S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/30/2017 - 01:59

నిజామాబాద్, జనవరి 29:మన ఇసుకను పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తవ్వుకుపోతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ శివారు గ్రామాల వద్ద ఇరు రాష్ట్రాల మధ్య పారుతున్న మంజీరా నది సాక్షిగా ఈ ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. మరో విషయమేమిటంటే...మహారాష్టన్రుంచి ఇసుక క్వారీల తవ్వకాలకు అనుమతి పొందిన కాంట్రాక్టర్లలో నిజామాబాద్, హైదరాబాద్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.

01/30/2017 - 01:56

హైదరాబాద్, జనవరి 29: తెలంగాణ డిస్కాంలు విద్యుత్ చార్జీలను స్వల్పంగా పెంచి ఆ మేరకు ప్రతిపాదనలను ఈ నెల 31న విద్యుత్ నియంత్రణ మండలికి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటికే డిస్కాంలు 22,044 కోట్ల రెవెన్యూ అవసరమని, 32,844 ఎంయు విద్యుత్ అవసరం ఉంటుందని అంచనాలను మండలికి సమర్పించాయి. రాష్ట్రప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ కింద దాదాపు రూ.3000 కోట్ల వరకు భరించేందుకు సిద్ధంగా ఉంది.

01/30/2017 - 01:56

హైదరాబాద్, జనవరి 29: రాష్ట్రంలో దశలవారీగా కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం, దీనికి పూర్తిస్థాయిలో సాంకేతిక సమాచార వ్యవస్థను వినియోగించుకోనుంది. రాష్ట్రానికి కేటాయించిన నదీ జలాలను పూర్తిగా వినియోగించుకోవడంతోపాటు సాగునీటి వనరులను శాస్ర్తియంగా నిర్వహించుకోవాలని భావిస్తోంది.

01/30/2017 - 01:54

హైదరాబాద్, జనవరి 29:రాష్ట్రంలో త్వరలో 40 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించనున్నట్టు వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. అలాగే డయాలసిస్ రోగులకు జీవితకాలం మందులు ఉచితంగా అందజేయనున్నామన్నారు. గాంధీ ఆస్పత్రిలో అగర్వాల్ సమాజ్ సహాయత్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన కిడ్నీ సెంటర్‌ను మంత్రి ఆదివారం ప్రారంభించారు.

01/30/2017 - 04:04

ఏలూరు, జనవరి 29: రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పాలన చతుర్ముఖ దుష్టపాలన రీతిలో జరుగుతోందని వైసిపి అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవల కేంద్ర సంస్ధ ఎన్‌సిఎఇఆర్ ఇచ్చిన నివేదికలో రాష్ట్రం అవినీతిలో నెంబర్‌వన్‌గా ఉందని పేర్కొన్నారని చెప్పారు. వ్యవస్థలను, మనుషులను, మీడియాను కూడా మేనేజ్ చేయటంలో చంద్రబాబు ఘనుడన్నారు.

01/30/2017 - 01:43

విశాఖపట్నం, జనవరి 29: అర్బన్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వచ్చే నెల తొలి వారంలో టెండర్లు పిలవనున్నట్టు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరాలకు సమీపంలోనే ఇళ్ల నిర్మాణాలకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు.

01/30/2017 - 03:17

హైదరాబాద్, జనవరి 29: ప్రపంచంలోని పెద్ద దేశాల్లో నగదురహిత లావాదేవీల విధానం అమల్లో లేదని, భారత్‌లో కూడా ఇది అసాధ్యమని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీలో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

01/30/2017 - 01:38

నిమ్మరాజు చలపతిరావు

01/30/2017 - 01:31

విజయవాడ, జనవరి 29: ఇటీవలి కాలంలో వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో పోటాపోటీగా భారీ కమర్షియల్ చిత్రాలు విడుదలవుతున్నాయి. భారీగా లాభాలు వస్తుండటంతో మళ్లీ మళ్లీ అలాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అయితే వినోదపన్ను వసూళ్ల విధానంలో ఉన్న లొసుగులు స్థానిక సంస్థల పాలిట శాపంగా మారాయి. అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

01/29/2017 - 04:20

హైదరాబాద్, జనవరి 28: దేశంలోని నల్లధనం విదేశాలకు తరలిపోయిందని, పెద్ద నోట్ల రద్దు నల్లధనం నిర్మూలనకు పరిష్కారం కాదని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ జర్నలిస్టు అరుణ్ శౌరీ అన్నారు. నిజంగా నల్లధనం పెద్ద మొత్తంలో ఉన్నవారు భారతీయ కరెన్సీలో ఎలా తమ వద్ద ఉంచుకుంటారని ఆయన ప్రశ్నించారు.

Pages