S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/04/2017 - 01:40

విజయవాడ, ఫిబ్రవరి 3:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిపడిన రెండు విడతల కరవుభత్యంలో ఒక కిస్తీని మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జనవరి 1నుంచి జూలై 1కి సంబంధించిన కరవు భత్యాన్ని విడుదల చేసింది. పెంచిన కరవుభత్యం బకాయిలు పిఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. మార్చి నెల జీతం నుంచి నగదు రూపంలో చెల్లిస్తారు.

02/04/2017 - 01:39

నెల్లూరు, ఫిబ్రవరి 3:ప్రత్యేక హోదాకు, పరిశ్రమలకు ఎలాంటి సంబంధం లేదని, పరిశ్రమలు వస్తే ఉపాధి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక హోదాతో పారిశ్రామిక రాయితీలు ఉండవని, హోదాతో వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో ఉన్నాయన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే తమ ముఖ్య ఉద్దేశమని, ఇందుకోసం పరిశ్రమల ఏర్పాటుకు ఇతోధిక ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు.

02/04/2017 - 01:37

విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీ సమీపంలో పున్నమి ఘాట్ వద్ద కృష్ణా నదిలో తూర్పు నావికాదళం ప్రదర్శించిన సాహసోపేత విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శత్రునౌకలను ధ్వంసం చేస్తున్న దృశ్యాన్ని పైచిత్రంలో చూడవచ్చు.

02/03/2017 - 05:06

ఖైరతాబాద్, ఫిబ్రవరి 2: నైతిక విలువలు లేని అభివృద్ధి ఎంత మాత్రం సరికాదని భగత్ సింగ్ సొదరుడి కొడుకు కిరణ్‌జిత్ సింగ్ సింధూ అన్నారు. ‘సుస్థిర అభివృద్ధిలో ధర్మం పాత్ర’ అనే అంశంపై ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో మూడు రోజుల జాతీయ స్థాయి సమ్మేళనాన్ని స్వామి అగ్నివేష్, ప్రణనానంద్, ధర్మానంద్ సరస్వతితో కలిసి గురువారం ప్రారంభించారు.

02/03/2017 - 03:11

రేణిగుంట/జీడిమెట్ల, ఫిబ్రవరి 2: స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి కారులో వస్తున్న భక్తులను రేణిగుంటలో లారీ రూపంలో మృత్యువు కబళించింది. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో రేణిగుంట మండలం వెదళ్లచెరువు వద్ద లారీని ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు వ్యక్తులు మృత్యువుతో పోరాడుతున్నారు.

02/03/2017 - 03:03

హైదరాబాద్, ఫిబ్రవరి 2: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో హైకోర్టు ఈ నెల 9నుంచి హైదరాబాద్‌లో జరగనున్న భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌ల నిర్వహణపై శుక్రవారం సూచనలు, ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. నగరానికి చెందిన ఎం గోవిందరెడ్డి అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

02/03/2017 - 03:02

హైదరాబాద్, ఫిబ్రవరి 2: వైఎస్ హయాంలో తాను మైనింగ్ లీజుల కేటాయింపులో ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి హైకోర్టుకు తెలిపారు. దాల్మియాసిమెంట్స్‌కు లీజుల కేటాయింపులో అనుకూలంగా వ్యవహరించారని సిబిఐ అభియోగాలు మోపింది. తనపై సిబిఐ దాఖలు చేసిన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సిబిఐ చేసిన అభియోగాలు నిరాధారమని ఆమె పేర్కొన్నారు.

02/03/2017 - 03:01

హైదరాబాద్, ఫిబ్రవరి 2: రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నైపుణ్య అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. తెలంగాణలో పూర్వ పది జిల్లాల్లో, ఆంధ్రాలోని 13 జిల్లాల్లో ఈ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటవుతాయి. ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన, ప్రధాన మంత్రి కౌషల్ కేంద్ర పేరిట ఈ కేంద్రాలకు కేంద్రం ఆర్ధిక సాయం అందించనుంది.

02/03/2017 - 02:59

హైదరాబాద్, ఫిబ్రవరి2:తీవ్ర అస్వస్థకు గురై సికిందరాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్రమంగా కోలుకుంటున్నారు. దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ సిఇఓ బొల్లినేని భాస్కర్‌రావు గురువారం హెల్త్‌బులెటిన్ విడుదల చేశారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరినప్పుడు డయాల్సిస్ చేశారు, అదే విధంగా వెంటిలెటర్ అమర్చారు.

02/03/2017 - 02:55

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఒక ప్రభుత్వ ఉద్యోగి కనపడకుండా పోయిన తేదీ నుంచి ఏడేళ్ల పాటు అతని ఆచూకీ తెలియని పరిస్థితుల్లో మృతి చెందినట్లు భావించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 1872 ఎవిడెన్స్ చట్టం కింద ఈ నిర్ణయానికి రావచ్చని కోర్టు పేర్కొంది.

Pages