S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/08/2016 - 07:54

తిరుపతి, మార్చి 7: మహాశివరాత్రి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన చండీఘడ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరేష్‌కుమార్(60) గుండె పోటుతో మృతి చెందారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తిరుచానూరు, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకున్న ఆయన మధ్యాహ్నానికి తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు.

03/08/2016 - 07:41

ప్రత్తిపాడు : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడులోని విశ్వనగర్‌లో సోమవారం మహాశివరాత్రి పర్వదినోత్సవం వైభవంగా జరిగింది. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం మహాలింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ స్వయంగా పరమశివుడికి అభిషేకం చేసి భక్తుల చేత అభిషేకం చేయించారు. విశ్వగురుపీఠంలో భక్తులకు ఆశీస్సులు అందజేశారు.

03/07/2016 - 07:21

హైదరాబాద్: దేశంలోని విమానాశ్రయాల్లో పట్టుబడిన బంగారం కేసులు గాలిలో దీపంలా మారుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ అవుతుందని కస్టమ్స్ అధికారులు అప్రమత్తతో పట్టుకుంటున్నప్పటికీ వాటి భద్రత, స్వాధీనం చేసుకున్న బంగారం ప్రభుత్వ ఖజానాకు చేరడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సేకరించిన సమాచారం ఈ విధంగా ఉంది.

03/07/2016 - 07:12

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో చోటుచేసుకున్న ప్రేమోన్మాదం ఘటనపై ఆదివారం జిల్లా కేంద్రం ఏలూరులో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఆదివారం నాటి పరిణామాల్లో ఏలూరు ఆసుపత్రిలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

03/07/2016 - 07:10

విశాఖపట్నం: ఇసుక రవాణా బకాయిల విషయంలో ప్రభుత్వ ధోరణి లారీ యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో అమలు చేసిన మీ ఇంటికే ఇసుక పథకంలో రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్లకు ఇసుకను చేరవేసేందుకు ప్రైవేటు లారీ ఆపరేటర్లను ప్రభుత్వం వినియోగించుకుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఎ) సారధ్యంలో డ్వాక్రా సంఘాల పేరున స్టాక్‌పాయింట్లను ఏర్పాటు చేసింది.

03/07/2016 - 06:55

హైదరాబాద్: ఆలిండియా కిసాన్ సభ నూతన కార్యవర్గం ఎన్నికైంది. జాతీయ అధ్యక్షుడిగా ప్రబోధ్ పాండా, ప్రధానకార్యదర్శిగా అతుల్‌కుమార్ అంజాన్‌లు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన మూడు రోజుల కిసాన్ సభ జాతీయ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశాల్లో కిసాన్ సభ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజాన్ తెలిపారు.

03/07/2016 - 02:08

తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు అర్ధరాత్రి నుంచే
భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. దేవదేవుడిని దర్శించి తరించేందుకు భక్తులు ఆలయాల వద్ద
క్యూగట్టారు. తెలంగాణలోని వేములవాడ, కాళేశ్వరం,
కొమురవెల్లి, కీసర, ఆంధ్రలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, పంచారామాల్లో మహాశివుడి దర్శనం కోసం
భక్తులకు ఏర్పాట్లు చేశారు.

03/06/2016 - 07:45

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతాయి. శనివారం గవర్నర్ నరసింహన్ ఉభయ సభల సభ్యులనుద్ధేశించి ప్రసంగించారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం జరిగింది.

03/06/2016 - 07:44

శ్రీకాళహస్తి: చెన్నైలోని అపోలో ఆసుపత్రి యాజమాన్యం శ్రీకాళహస్తీశ్వరాలయానికి వెండి సింహ వాహనం విరాళంగా అందజేసింది. అపోలో అధినేత డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి పలుమార్లు ఆలయానికి వచ్చిన సందర్భంగా దేవస్థానం వారు వెండి వాహనాల తయారీపై చర్చించారు. రెండేళ్ల క్రితం వెండి నంది వాహనాన్ని విరాళంగా అందజేశారు. శనివారం 100 కిలోల వెండితో తయారుచేసిన 60 లక్షల విలువైన సింహ వాహనాన్ని ఆలయానికి అందజేశారు.

03/06/2016 - 07:43

హైదరాబాద్, మార్చి 5: ‘కాపు సామాజిక వర్గానికి మీరొక్కరే నాయకుడు కాదు, ఆ భ్రమలోంచి బయటకు రండి. నిజంగా మీరు కాపుల ప్రయోజనాలకు కట్టుబడితే, మీ వైఖరి మార్చుకోండి’ అని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని తెలుగుదేశం అధికార ప్రతినిధి బోండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. ఈ మేరకు బోండా బహిరంగ లేఖ రాశారు.

Pages