S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/04/2016 - 06:39

హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు తీపి కబురు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని చెప్పిన అధికారులు ఆ నిబంధనను సడలించారు. ‘ఒక్క నిమిషం’ నిబంధనతో పలువురు విద్యార్ధులు పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడటంతో ఆ నిబంధనను తొలగించి పరీక్ష ప్రారంభం అయిన ఐదు నిమిషాల వరకూ అనుమతించనున్నట్టు ఇరు బోర్డులకు చెందిన అధికారులు ప్రకటించారు. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్ధులు కుదుటపడ్డారు.

03/03/2016 - 05:31

హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటికీ సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఒక ప్రకటనలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిందని మంత్రి పేర్కొన్నారు.

03/03/2016 - 05:19

హైదరాబాద్: ప్రయాణీకుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే హుబ్లీ-చెన్నై-హుబ్లీ మధ్య 16 తత్కాల్ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ నెల 7, 9, 14, 16, 21, 23, 28, 30 తేదీల్లో నెం.07324 రైలు హుబ్లీ నుంచి రాత్రి 8.20 గంటలకు బయలుదేరి తర్వాత రోజు చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటుందని ద.మ.రైల్వే అధికార వర్గాలు తెలిపాయి.

03/03/2016 - 04:33

నెల్లూరు/ప్రకాశం/చిత్తూరు: జిల్లా కేంద్రమైన చిత్తూరులో అరకొర సౌకర్యాల మధ్యనే ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పలు కేంద్రాల్లో చీకటి గదులు, వరండాలు, డెస్క్‌లు లేకపోవడంతో నేలపై కూర్చుని పరీక్షలు రాయాల్సిన దుస్థితి నెలకొంది.

03/03/2016 - 04:17

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఒక్క నిమిషం ఆలస్యమయిందనే కారణంగా అధికారులు అడ్డుకోవడంతో విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రొద్దుటూరు, కొత్తవలస తదితర పట్టణాల్లోని కాలేజీల్లో ఫీజులు చెల్లించలేదని హాల్‌టిక్కెట్లు జారీ చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

03/02/2016 - 08:15

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలును రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు తేలిగ్గా తీసుకున్నాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లో 29వ తేదీలోగా స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞలను నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించినా అధికార గణం పట్టించుకోలేదు. యుజిసి ఆదేశాలను కూడా గాలికి వదిలేశాయి.

03/02/2016 - 08:02

విజయవాడ: ప్రభుత్వానికి, పార్టీకి నాయకులే సంధాన కర్తలని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందే ప్రగతి ఫలితాలపై పర్యవేక్షణ బాధ్యత నాయకులదే అన్న విషయాన్ని ఏ ఒక్కరూ మరువరాదని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమంటూ వలసలను ప్రోత్సహించటాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

03/02/2016 - 07:55

హైదరాబాద్: సుమారు ఐదురోజుల తేడాతో రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభం కానుండగా, 10న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు నిలిచిపోతాయి.

03/02/2016 - 07:53

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలను ఈ నెల 8న రాత్రి మూసివేసి, తొమ్మిదో తేదీ మధ్యాహ్నం సంప్రోక్షణ అనంతరం తిరిగి తెరవాలని నిర్ణయించారు.

03/02/2016 - 06:09

హైదరాబాద్: ఎలక్ట్రానిక్ యంత్రం ద్వారా ఓటు వేయగానే ఓటు వేసినట్టు రసీదు అందనుంది. ఓటరు కోరుకున్న పార్టీకే ఓటు నమోదైందో లేదో కూడా అక్కడే కనిపించనుంది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ విధానాన్ని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అమలు చేయనున్నారు. ఓటు వేయగానే ఓటరుకు రసీదు అందుతుంది. 2014 ఎన్నికల్లో దేశంలో తొలిసారిగా ఎనిమిది పార్లమెంటు నియోజక వర్గాల్లో ఈ విధానాన్ని అమలు చేశారు.

Pages