S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/19/2015 - 02:56

హైదరాబాద్, డిసెంబర్ 18: విజయవాడ కాల్‌మనీ రాకెట్ వ్యవహారంపై ఆంధ్ర అసెంబ్లీలో రచ్చ రచ్చ జరిగింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పట్టువిడుపులు లేకుండా తమ వైఖరులకే కట్టుబడి ఉండటంతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. చివరకు విపక్ష పార్టీల సస్పెన్షన్ల మధ్య ముగిసింది. ఈ గందరగోళం మధ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు కాల్‌మనీ రాకెట్‌పై ప్రకటన చేశారు.

12/19/2015 - 02:10

హైదరాబాద్, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 10నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్ఫూర్త్భివన్ నిర్మించనున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం శాసనసభలో అంబేద్కర్ జయంత్యుత్సవాలపై జరిగిన చర్చకు బాబు బదులిచ్చారు. అంబేద్కర్ అందించిన సేవలను వివరిస్తూ అతి పెద్ద మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు.

12/19/2015 - 02:03

హైదరాబాద్, డిసెంబర్ 18: విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ, దానివెనుకవున్న సెక్స్ రాకెట్‌తో ముఖ్యమంత్రి, తెదేపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధం ఉందని శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. రెండోరోజైన శుక్రవారం కాల్‌మనీ వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. కాల్‌మనీపై స్పీకర్ కోడెల చర్చ ప్రారంభిస్తూ ప్రతిపక్ష నేత జగన్‌కు అవకాశం ఇచ్చారు.

12/18/2015 - 18:17

హైదరాబాద్: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి హకీంపేటలో ఘనస్వాగతం లభించింది. ఇవాళ ఆయన వాయుసేనకు చెందిన విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేటకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి నగరానికి చేరుకున్న విషయం తెలిసిందే.

12/18/2015 - 18:05

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. శుక్రవారం ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి ప్రతిపాదన మేరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు.. రోజాను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.

12/18/2015 - 16:27

హైదరాబాద్ : కాల్ మనీ కేసులో చంద్రబాబే ముద్దాయి అని జగన్ సభలో ఆరోపించారు. ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రకటన చేసేస్తానంటే మేం ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు. చంద్రబాబుకు కాల్ మనీ నిందితులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ కొన్ని ఫొటోలను ఆయన సభలో ప్రదర్శించారు. సభానాయకుడు ప్రకటన చేసిన తరువాత ఇక దానిపై ఎటువంటి చర్చకూ అవకాశం ఉండదని నిబంధనలు చెబుతున్నాయని జగన్ పేర్కొన్నారు.

12/18/2015 - 16:10

హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తుండగా వైసీపీ సభ్యులు ఆందోలన చేపట్టారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేపట్టారు.

12/18/2015 - 16:04

హైదరాబాద్ : నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. కాల్ మనీ వ్యవహారంపై చంద్రబాబు ప్రకటన చేస్తున్న సందర్భంలో రోజా నినాదాలు చేస్తూ ఆందోళనకు నాయకత్వం వహించారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మహిళా? ఆమె మాట్లాడే మాటల్లో సభ్యత ఉందా? అసలు ఆమె ఆడదేనా? ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా?

12/18/2015 - 16:03

హైదరాబాద్ : అంగన్ వాడీ లకు ఉపసంఘం ఇచ్చిన సిఫార్సుల మేరకు వారికి వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే బడ్జెట్‌ నుంచి పెంచిన జీతాలు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అంగన్ వాడీ లకు రూ.4,200 నుంచి రూ. 7వేలకు, హెల్పర్ల వేతనాలు రూ.2,200 నుంచి రూ.4,500 వరకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు.

12/18/2015 - 15:50

ముంబయి : 1993లో జరిగిన ముంబయి బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం నాసిక్‌రోడ్డులోని జైలులో శిక్ష అనుభవిస్తోన్న ఖైదీ గఫూర్ పార్కర్ మృతిచెందారు. ఈమేరకు జైలు అధికారులు వెల్లడించారు. ఆనారోగ్యంతో బాధపడుతోన్న పార్కర్ నాసిక్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతిచెందినట్టు తెలిపారు.

Pages