S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/05/2018 - 04:03

హైదరాబాద్, జూలై 4: మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కథ టీఆర్‌ఎస్‌లో కంచికి చేరినట్టే కనిపిస్తోంది. విజయవాడ నుంచి రాగానే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపువస్తుందని డీఎస్ భావించగా ఇప్పటి వరకు అలాంటి ఊసే లేదని సమాచారం. ఆయన కూడా సీఎం కేసీఆర్‌ను కలువడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని తెలుస్తున్నది.

07/05/2018 - 04:02

హైదరాబాద్, జూలై 4: ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి నాయకులు, కార్యకర్తలు చేరడం, లేదా అధికార పార్టీ ప్రతిపక్షాలను ఆకర్షించడం సహజమే. కానీ అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన వరంగల్ జిల్లా పరకాల మున్సిపల్ చైర్మన్ మార్తిరాజు భద్రయ్య తన అనుచరులతో కలిసి బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

07/05/2018 - 05:20

హైదరాబాద్, జూలై 4: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చాన్సలర్‌గా జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి నియమితులయ్యా రు. ఇంతకాలం చాన్సలర్‌గా డాక్టర్ రంగరాజన్ కొనసాగారు. జస్టిస్ నర్సింహారెడ్డి పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇప్పుడు ఆయనను ఛాన్స్‌లర్‌గా నియమిస్తూ రాష్టప్రతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసిందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అధికారులు తెలిపారు.

07/05/2018 - 05:22

హైదరాబాద్, జూలై 4: రాష్ట్రంలో 2018 ఖరీఫ్ సీజన్‌లో 110 లక్షల ఎకరాల్లో పంటలు వేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 2018-19 సంవత్సరానికి వ్యవసాయ శాఖ రూపొందించిన ‘వార్షిక ప్రణాళిక’ను వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వానాకాలం 110 లక్షల ఎకరాలు, యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని నిర్ణయించామన్నారు.

07/05/2018 - 05:26

విశాఖపట్నం, జూలై 4: రాష్ట్రంలో అవినీతి, అక్రమాల పాలన జరుగుతోంది. అధికార పక్ష దారుణాలను సమర్థవంతంగా ఎదుర్కొనే విపక్ష వైసీపీ చేష్టలుడిగి చూస్తోంది. ప్రజల పక్షాల నిలవాల్సిన విపక్ష వైసీపీ అసెంబ్లీకి రానంటూ భీష్మించుకుంది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తాననే ధోరణిలో ఉన్నారు. ఇక ప్రజల కష్టాల తీర్చేదెవరు.

07/05/2018 - 05:24

వరంగల్, జూలై 4: తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో భద్రకాళి ఫైర్‌వర్క్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటిలింగాల దేవాలయం సమీపంలోని భద్రకాళి ఫైర్ వర్క్సలో బుధవారం జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాద ఘటనలో 10 మంది కూలీలు క్షణాల్లోనే సజీవ దహనమయ్యారు. తీవ్రగాయలపాలైన ఐదుగురిని పోలీసులు చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

07/05/2018 - 05:30

అమరావతి, జూలై 4: కుట్రతో..కక్షతో రాష్ట్భ్రావృద్ధిని కాలరాస్తున్న కేంద్రప్రభుత్వ దుర్నీతిపై మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పోరాటం సాగించాల్సిన తరుణం ఆసన్నమైందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

07/05/2018 - 03:46

కావలి/నెల్లూరు జూలై 4: కార్యకర్తల విస్తృత్త సమావేశంలో భాగంగా బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించారు. అందులో భాగంగా కార్యకర్తలతో పట్టణంలోని బృందావనం కాలనీ నుంచి బీజేపి కార్యాలయం వరకు భారీగా ర్యాలీ ఏర్పాటు చేశారు.

07/04/2018 - 18:03

హైదరాబాద్: వరంగల్ అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

Pages