S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/07/2018 - 01:55

హైదరాబాద్, జూలై 6: రాబోవు ఐదు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రాష్టవ్య్రాప్తంగా రుతుపవనాలు బలపడటంతో గురువారం అనేక చోట్ల వాతావరణం మేఘావృతమై, పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షపాతం నమోదు అయింది. ఇదే పరిస్థితి ఈనెల 10 వరకు కొనసాగుతుందని తెలిపింది.

07/07/2018 - 01:54

హైదరాబాద్, జూలై 6: మెడికల్ , డెంటల్ యూజీ సీట్లకు వెబ్ కౌనె్సలింగ్ నోటిఫికేషన్ జారీ అయినట్టు కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఏ కేటగిరి సీట్లకు తొలి విడత వెబ్ కౌనె్సలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కూడా పూర్తయిందని, తుది మెరిట్ జాబితాను యూనివర్శిటీ విడుదల చేసిందని అన్నారు.

07/06/2018 - 17:49

హైదరాబాద్: రుణాలు, మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ మూడు కోట్ల రూపాయలను వసూలు చేసిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు రట్టు చేశారు. వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సతీషన్, రాం నివాస్, హరినివాస్‌లను అరెస్టు చేసి 45 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు దాదాపు మూడు కోట్లరూపాయల వరకు వసూలు చేసి ప్రజలను చీటింగ్ చేశారని పోలీసులు వెల్లడించారు.

07/06/2018 - 13:00

మచిలీపట్నం-విజయవాడ రోడ్డులోని వృద్ధురాలు లక్ష్మీనర్సమ్మ ఇంట్లో దొంగలు పడ్డారు. ఆమెపై దాడిచేసి 12 కాసుల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

07/06/2018 - 12:55

హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖకు మరో అధికారి చిక్కాడు. నీటిపారుదల కృష్ణాబేసిన్ చీఫ్ ఇంజినీర్ సురేశ్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో ఆయనకు సంబంధించిన ఇళ్లలో సోదాలు జరిపారు. ఆయనకు రెండు ఇళ్లు, పది ఫ్లాట్లు, 17 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్లు, మూడు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు కనుగొన్నారు.

07/06/2018 - 05:24

సూళ్లూరుపేట, జూలై 5: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రాకెట్ ప్రయోగాల ప్రాథమిక పరిశీలన కోసం తొలిసారిగా చేపట్టిన ట్రయిల్ బేస్ ప్రయోగం తొలి అడుగులోనే విజయ సాధించింది. భవిష్యత్‌లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించేందుకు ఈ ట్రయిల్ ప్రయోగ పరీక్ష చేసింది.

07/06/2018 - 04:48

తిరుపతి, జూలై 5: దక్షిణాయనం ప్రారంభం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆణివార ఆస్థానం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేస్తారు. ఈ నెల 17న కర్కాటక సంక్రమణం ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం చేపడతారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందువచ్చే మంగళవారం అంటే ఈ నెల 10న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహించనుంది.

07/06/2018 - 05:26

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జూలై 5: ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీన వరకు అత్యంత వైభవోపేతంగా శాకంబరీ ఉత్సవాలను మూడు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎం పద్మ ఒక ప్రకటనలో తెలిపారు.

07/06/2018 - 04:45

న్యూఢిల్లీ, జూలై 5: మణిపూర్‌లో జరిగిన నాలుగు ఎన్‌కౌంటర్ల కేసులో తుది నివేదికను ఈ నెల 27వ తేదీలోగా సమర్పించాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. జవాన్లు, అస్సాం రైఫిల్స్ సిబ్బందితోపాటు పోలీసులు కూడా కలిసి బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తులు మదన్ బీ లోకూర్, యూయూ లలిత్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

07/06/2018 - 04:44

ఏలూరు, జూలై 5: సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఆ సంస్థ ఆడిటర్‌కు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కోర్టు రిమాండు విధించింది. హైదరాబాద్‌కు చెందిన అగ్రిగోల్డ్ ఆడిటర్ జొన్నవిత్తుల దుర్గాప్రసాద్ సీఐడీ నమోదు చేసిన కేసులో 25వ నిందితుడు. కొంతకాలంగా అతను తప్పించుకుని తిరుగుతున్నాడు.

Pages