S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/09/2018 - 04:56

విశాఖపట్నం, జూన్ 8: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి తరం పార్లమెంట్ సభ్యుడు కందాళం సుబ్రహ్మణ్య తిలక్(98) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. 1952లో విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తిలక్ గెలుపొందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన అంత్యక్రియలు విశాఖలో శనివారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

06/09/2018 - 04:57

నన్ను నమ్మండి

06/09/2018 - 02:24

హిందూపురం టౌన్, జూన్ 8: కుట్ర రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్న బీజేపీపై సమైక్యంగా దండెత్తాల్సిన సమయం ఆసన్నమైనదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రధానమంత్రి పదవికి చంద్రబాబు లాంటి సమర్థుడైన నాయకుడు అడ్డువస్తాడనే ఉద్దేశంతోనే మోదీ రాష్ట్రం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు.

06/09/2018 - 02:22

హైదరాబాద్, జూన్ 8: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. జిల్లాల్లో త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేసి, వాటి ఆధ్వర్యంలో ఆస్తుల వేలం చేపట్టాలని శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్‌వి భట్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించిన పిటీషన్లను విచారించింది.

06/09/2018 - 02:18

విజయవాడ(బెంజిసర్కిల్), జూన్ 8: రుణమాఫీ లేక రైతులు.. డ్వాక్రా రుణమాఫీ లేక మహిళలు..ఉద్యోగాలు లేక యువత..ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారు చంద్రబాబు నాలుగు సంవత్సరాల పాలనలో దగా పడ్డారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీమంత్రి తమ్మినేని సీతారామ్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, జోగి రమేష్ ధ్వజమెత్తారు.

06/09/2018 - 05:02

యలమంచిలి, జూన్ 8: రాష్ట్రప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని రానున్న 2019 ఎన్నికల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించాలని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా, యలమంచిలిలో శుక్రవారం జరిగిన ప్రజాపోరాట యాత్రలో పాల్గొని ప్రసంగించారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు.

06/08/2018 - 17:03

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం రగుడు గ్రామంలో కంకరు లోడుతో వెళుతున్న టిప్పర్ అదుపుతప్పి ఓ బైక్‌ను ఢీకొనటంతో పాటు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో సత్తిరెడ్డి అనే వ్యిక్తి మృతిచెందడంతో పాటు మరో పదిమందికి గాయాలు అయ్యాయి. చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన సత్తిరెడ్డి, అతని తల్లి ఎల్లవ్వ సిద్దిపేటకు బైక్‌పై తిరిగివస్తుండగా టిప్పర్ ఢీకొన్నది.

06/08/2018 - 17:01

అమరావతి: ప్రభుత్వంలో అందరు సంతృప్తిగా జీవించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి ఈ నాలుగేళ్లలో 5.20 లక్షల కోట్లు ఖర్చుచేశామని అన్నారు. విపక్షాలకు రాష్ట్భ్రావృద్ధి కనిపించకపోవటం శోచనీయమని అన్నారు. మేనిఫేస్టోలో ప్రకటించినదానికంటే 103 సంక్షేమ పథకాలు అమలుచేశామని అన్నారు.

06/08/2018 - 17:00

కరీంనగర్: ఆర్టీసీ సమ్మెకు టీజీఎస్ మద్దతు ఇస్తుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీపై డీజిల్ రేట్ల భారాన్ని ప్రభుత్వం భరించాలని అన్నారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించకుండా సీఎం బెదిరించటం సరికాదన్నారు.

06/08/2018 - 13:36

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య ఫలితాలను విడుదల చేశారు.

Pages