S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/07/2018 - 13:44

న్యూఢిల్లీ: ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా ఉమెన్‌చాందీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చేలా పనిచేస్తామని ఉమెన్‌చాందీ స్పష్టం చేశారు.

06/07/2018 - 12:50

విజయవాడ: సవాళ్లు, ప్రతిసవాళ్లతో నవ నిర్మాణ దీక్షలు జరుగుతున్నాయని ,టీడీపీ రాజకీయం చేస్తోందని సీపీఎం, సీపీఐ నేతలు మధు, రామకృష్ణ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ దీక్షల పేరుతో ఇతర పార్టీలపై దుమ్మెత్తిపోస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై చార్జిషీట్ పెడతామని తెలిపారు. ఏపీలో అవినీతి పాలన సాగుతోందని మధు, రామకృష్ణ ఆరోపించారు.

06/07/2018 - 12:43

హైదరాబాద్: హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం అధికారి భీంరావ్ నివాసంలో అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి శేరిలింగంపల్లిలోని భీంరావ్ నివాసంలో కీలక ఆధారాల కోసం తనిఖీలు చేస్తున్నారు.

06/07/2018 - 12:33

అమరావతి: గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో పంటకుంటలు నిండాయని, ఊరూరా జలకళ ఉట్టిపడుతోందని, రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నవ నిర్మాణ దీక్ష ఆరో రోజు నిర్వహణపై ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

06/07/2018 - 12:35

హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణలో గురువారం పలు చోట్ల వర్షాలు పడే సూచనలున్నట్లు చెప్పింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల తేమ గాలులు వీస్తున్నాయి. తెలంగాణలోని 87 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా కొడంగల్‌లో 5, పెద్దెముల్‌లో 4, యాచారం, సరూర్‌నగర్‌లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

06/07/2018 - 12:24

హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల వల్ల రానున్న 48గంటల్లో కర్నాటకలోని దక్షిణ ప్రాంతం, రాయలసీమ, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి 12వ తేదీ వరకు కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

06/07/2018 - 12:37

పెరవలి: పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు శివారు కొండాలమ్మ గుడి వద్ద జగన్‌ పాదయాత్ర చేస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశాయి. తేనెటీగల బారిన పడకుండా కొద్దిసేపు జగన్‌ను పక్కకు తీసుకెళ్లారు.గుర్తుతెలియని వ్యక్తులు పాదయాత్ర జరుగుతున్న సమయంలో తేనెతుట్టపై రాయి విసరటంతో తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. తేనెటీగల దాడిలో సుమారు పదిమంది వరకు గాయపడ్డారు.

06/07/2018 - 12:13

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ మెట్రో సమీపంలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

06/07/2018 - 05:07

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ రంగంలో సంక్షోభం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. క్షేత్రస్థాయిలోని వ్యవసాయ సిబ్బంది తీవ్రమైన మానసిక వత్తిడికి గురవుతున్నారు. రైతులు కూడా సకాలంలో విత్తనాలు అందక ఇక్కట్లుపడే పరిస్థితులు నెలకొన్నాయి.

06/07/2018 - 04:47

హైదరాబాద్, జూన్ 6 : విద్యుత్ శాఖలో పని చేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే జూలై 21 నుంచి నిరవధిక సమ్మె తప్పదని ప్రకటించారు. బుధవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ యాజమాన్యానికి కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ జిల్లాల నుంచి వేలాదిమంది తరలివచ్చారు.

Pages