S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/01/2018 - 01:08

హైదరాబాద్, మే 31: తెలంగాణ ప్రభుత్వం ముందు చెప్పినట్లుగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 18,428 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు విభాగాలుగా రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులను జూన్ 9 నుంచి 30 వరకు స్వీకరిస్తారు.

06/01/2018 - 01:04

గురువారం ప్రచురితమైన ఫన్‌గామా కార్టూన్..
తమ న్యాయమైన కోర్కెలకోసం సమ్మెకు దిగిన బ్యాంకు ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసినట్టుగా ఉన్నందుకు చింతిస్తున్నాం.
-సంపాదకుడు

06/01/2018 - 01:03

గుంటూరు, మే 31: గుంటూరు జిల్లాలో గురువారం సాయంత్రం భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగుపాటుతో కూడిన భారీవర్షం కురిసింది. దీనికి ఈదురు గాలులు తోడవటంతో పలు చోట్ల భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. జిల్లా వ్యాప్తంగా పిడుగుపాటుకు ఐదుగురు మృతిచెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

06/01/2018 - 00:56

కురుపాం, మే 31: ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురైనందున మరో కళింగాంధ్ర ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. గురువారం విజయనగరం జిల్లా కురుపాంలో పవన్‌కళ్యాణ్ బహిరంగ సభ జరిగింది.

06/01/2018 - 00:53

విజయవాడ, మే 31: రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్న రూ.2 వేల కోట్ల విలువ చేసే ‘అమరావతి బాండ్ల’ను జూన్ 6వ తేదీ తరువాత విడుదల చేయనున్నారు. ఈ బాండ్ల విడుదలకు సంబంధించిన ప్రక్రియను దాదాపు పూర్తయింది. ఆర్‌బిఐ పాలసీ ప్రకటన తరువాత వీటిని జారీ చేస్తారు. రాజధాని అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం సచివాలయంలో జరిగిన 17వ అధీకృత సమావేశంలో ఈ బాండ్లకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి

06/01/2018 - 00:51

విజయవాడ, మే 31: విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు వెల్లడించారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో గురువారం మధ్యాహ్నం ఆయన విద్యుత్ శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబును ప్రజల, ఉద్యోగుల పక్షపాతిగా పేర్కొన్నారు.

06/01/2018 - 00:50

హైదరాబాద్, మే 31: దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటకతో మొదలై రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా పాగా వేస్తామని, ఇక తమ దృష్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లపైనేనని కేంద్ర ఐటి, న్యాయశాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. గురువారం హైదరాబాద్ వచ్చిన రవి శంకర్ ప్రసాద్ మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత పాత్రికేయులతో మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం 48 నెలల్లో సాధించిన విజయాలను వివరించారు.

05/31/2018 - 04:36

మదనపల్లె, మే 30: చిత్తూరు జిల్లా మదనపల్లెలో బుధవారం పట్టపగలు మహిళా న్యాయవాది దారుణహత్యకు గురయ్యారు. పోలీసుల కథనం మేరకు జితేంద్ర, నాగజ్యోతి దంపతులు వీరికి ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం అయింది. కుమారుడు హైదరాబాద్‌లో లా చదువుతున్నాడు.

05/31/2018 - 04:35

విజయవాడ, మే 30: రాష్టవ్రిభజన తరువాత నవ్యాంధ్ర ప్రదేశ్‌కు వివిధ అంశాల్లో ప్రత్యేకతను సంతరించుకున్న వాటిని రాష్ట్ర గుర్తులుగా ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చెట్టుగా వేప, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర పుష్పంగా మల్లెపూవును ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

05/31/2018 - 05:12

ఏలూరు, మే 30: తెలుగుదేశం పార్టీ తాజాగా నిర్వహించింది మహానాడు కాదని, అది ఒక దగానాడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అబద్ధాలు, మోసాలు, కుట్ర, కుతంత్రాలు, దగా, వంచన, వెన్నుపోటుపై సమావేశాల్లో పోటీలు జరిగాయన్నారు. ఈసారి జరిగిన చర్చల్లోనూ మరోసారి చంద్రబాబు ఛాంపియన్‌షిప్ సాధించారని, తరువాతి స్థానంలో నారా లోకేష్ నిలిచారన్నారు.

Pages