S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/02/2018 - 01:14

సాలూరు, జూన్ 1: నియోజకవర్గ ఇన్‌ఛార్జి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ అక్రమాలపై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం విజయనగరం జిల్లా సాలూరులోని బోసుబొమ్మ జంక్షన్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆద్యంతం భంజ్‌దేవ్ అక్రమాలపైనే కొనసాగింది. రైతుల పొలాలకు వినియోగించాల్సిన పెద్దగెడ్డ నీటిని భంజ్‌దేవ్ చేపల చెరువులకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.

06/02/2018 - 01:12

విజయవాడ, జూన్ 1: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త విధానాన్ని గాడిలో పెట్టింది. దీంతో రెండు మాసాల అనంతరం జూన్ 1వ తేదీ ఉదయానికి జీతాలు, పెన్షన్ల చెల్లింపులు జరిగిపోయాయి.

06/02/2018 - 01:12

రాజమహేంద్రవరం, జూన్ 1: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పోటీచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల యాజమాన్య నిర్వహణ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. ఎన్నికల్లో పవన్‌తోగాని, జగన్‌తోగాని పొత్తుపెట్టుకునే ఉద్దేశం తమ పార్టీకి లేదని స్పష్టంచేశారు.

06/02/2018 - 01:08

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 1: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించి జిల్లా పరీక్ష కేంద్రాల ఆప్షన్ల నమోదు ముగిసిందని ఏపీ టెట్ కన్వీనర్ ఎ సుబ్బారెడ్డి తెలిపారు. టెట్‌కు మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా 3,83,066 మంది అభ్యర్థులు సెంటర్ల ఆప్షన్లను పెట్టుకున్నారని శుక్రవారం ఆయన పేర్కొన్నారు. ఆప్షన్లను పెట్టుకున్న అభ్యర్థులకు వారు సూచించిన ప్రకారమే సెంటర్ల ఎంపిక ఉంటుందన్నారు.

06/02/2018 - 04:12

విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఈ సారి గడువుకంటే ముందే వస్తున్నాయన్న ఆనందం ఆవిరైంది. సాధారణంగా జూన్ 5నాటికి రాష్ట్రాన్ని తాకే నైరుతి, ఈసారి 2నే పలుకరిస్తుందని అంచనా వేశారు. బంగాళాఖాతంలో పరిస్థితులు ఆశించిన దానికంటే భిన్నంగా ఉండటంతో ముందస్తు ఆశ పోయిందని తుపాను హెచ్చరికల కేంద్రం భావిస్తోంది.

06/02/2018 - 04:16

హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల గందరగోళం పతాకస్థాయికి చేరింది. బదిలీలకు ఓకే చేసిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ఉత్తర్వులను, షెడ్యూలును జారీ చేసినా మార్గదర్ళకాల్లో ఉన్న అనేక అనుమానాలు టీచర్లను అయోమయంలోకి నెట్టేశాయి. మరోపక్క ఇప్పటికే ప్రభుత్వం దొడ్డిదారిన ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాయి.

06/02/2018 - 00:54

హైదరాబాద్, జూన్ 1: రాష్ట్రావతరణ దినోత్సవాన ప్రకటిస్తామన్న మధ్యంతర భృతి ప్రకటనను వాయిదా వేస్తున్నట్టు సీఎం కే.చంద్రశేఖర్ రావు తెలిపారు. శుక్రవారం మధ్యహ్నాం ప్రగతి భవన్‌లో మధ్యంతర భృతికి సంబంధించి వేతన సవరణ సంఘం చైర్మన్ సీఆర్ బిస్వాల్, సభ్యుడు మహ్మద్ అలీ రఫత్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

06/02/2018 - 04:11

హైదరాబాద్: తెలంగాణ రాష్టస్థ్రాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించిన పోలీసు ఉద్యోగాల భర్తీకి వయోపరిమితి నిబంధనలు సడలించాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తోంది. పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో అన్నీ కలిపి 18,428 ఉద్యోగాల భర్తీకి గత నెల 31న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగాల భర్తీకి ప్రకటించిన వయోపరిమితిని ఆరేళ్లకు పెంచాలని నిరుద్యోగ యువతి డిమాండ్ చేస్తోంది.

06/02/2018 - 00:52

హైదరాబాద్, జూన్ 1: ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఎదుగుతోందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీలో మేటి రాష్ట్రంగా ఎదిగిన తెలంగాణకు కేంద్రం నుంచి ఎటువంటి ప్రోత్సహం లభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును హైదరాబాద్‌లో నెలకొల్పుతామని కేంద్రం ప్రకటించినప్పటికీ గత నాలుగేళ్లుగా ఉలుకు పలుకూ లేదన్నారు. శుక్రవారం ఐటీ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు.

06/02/2018 - 00:49

హైదరాబాద్, జూన్ 1: దేశంలో 29వ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేటితో ఐదో వసంతంలోకి అడుగిడింది. ఎల్‌కెజీ, యుకేజీల దశలను దాటి మొదటి తరగతిలో చేరేంత వయసున్న పసిబిడ్డ తెలంగాణ. అయినప్పటికీ ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ అగ్రగ్రామిగా ఎదిగిందనడంలో అతిశయోక్తి లేదు.

Pages