S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/02/2018 - 16:56

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో ‘దగాపడ్డ తెలంగాణ’ కరపత్రాన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పుట్టకముందే తాము తెలంగాణ ఇవ్వాలని కోరామని అన్నారు. సోనియా వల్లనే తెలంగాణ వచ్చిందని అన్నారు.

06/02/2018 - 16:55

హైదరాబాద్: వాతావరణ ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రజలు సేదతీరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ చేసిన హెచ్చరికతో అదికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణాజిల్లాలోని తిరువురు, గన్నవరం, కైకలూరు, గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

06/02/2018 - 14:23

రాజన్న సిరిసిల్ల: రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడుదామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణం కాలేజ్ గ్రౌండ్‌లో మంత్రి కేటీఆర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.

06/02/2018 - 14:21

అమరావతి : రాష్ట్రంలో వాతావరణ మార్పులు, పిడుగులు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

06/02/2018 - 14:19

కృష్ణా: జిల్లాలోని పలు ప్రాంతాలకు పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చాట్రాయి, విసన్నపేట, తిరువూరు, ఎ.కొండూరు, వత్సవాయి, ఆగిరిపల్లి, విజయవాడ రూరల్ మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నందిగామ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

06/02/2018 - 14:16

హైదరాబాద్: తెలంగాణలో జయ శంకర్ ఆశయాలు నెరవేరటం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని, నాలుగు వేలతో రైతుకు అన్ని సమస్యలు తీరిపోతాయా? అని ప్రశ్నించారు.

06/02/2018 - 12:58

హైదరాబాద్ : రైతుబంధు పథకం అమలుతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ర్టావతరణ వేడుకల్లో సీఎం ప్రసంగించారు.

06/02/2018 - 12:26

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని చంద్రబాబు విమర్శించారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో నవ నిర్మాణ దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా డీవీ మ్యానర్‌ నుంచి చంద్రబాబునాయుడు ర్యాలీగా బెంజ్‌సర్కిల్‌కు కాలినడకన చేరుకున్నారు. ప్రజలతో ‘ప్రతిజ్ఞ బూనుదాం, ప్రగతి సాదిద్ధాం’ నినాదంలో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

06/02/2018 - 12:14

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో పలువురు రాష్ట్ర మంత్రులు, ముఖ్యనేతలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకలను పురస్కరించుకొని..

06/02/2018 - 03:59

విజయవాడ: ఈ-ప్రగతి ఇంటిగ్రేషన్ ప్రక్రియ వేగవంతం చేసి అన్ని శాఖల్లోనూ అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఈ-ప్రగతి అమలు పురోగతిపై శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-ప్రగతి అమలు విషయంలో తనను మెప్పించాలని చూస్తే ప్రయోజనం లేదని, దీనివలన ఎంత ప్రభావం కన్పించిందో చెప్పగలగాలని అధికారులకు సూచించారు.

Pages