S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/27/2018 - 02:45

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఇంటర్ అడ్వాన్స్ డ్ పరీక్ష ఫీజు అదనంగా రూ. వెయ్యి అపరాధ రుసుంతో చెల్లించేందుకు బోర్డు గడువు పెం చింది. ఈ నెల 30లోగా ఫీజును చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. ఇందుకు పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు కు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పారు.
ఏసీబీ వలలో
ఆర్‌అండ్‌బీ ఏఈఈ

04/27/2018 - 02:43

హైదరాబాద్, ఏప్రిల్ 26: బాలలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఇటీవలే ఏర్పాటైన ప్రత్యేక చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు తన తొలితీర్పును వెలువరించింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు 95 కేసుల్లో విచారణ కొనసాగగా, మూడు కేసుల్లో తుది తీర్పును వెలువరించింది.

04/27/2018 - 02:42

హైదరాబాద్, ఏప్రిల్ 26: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను శాస్త్ర సాంకేతిక రంగాల్లో చైతన్య పరచడం ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్ధుల సేవలను పొందే కొత్త కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నాందిపలికింది. ఈ కార్యక్రమం గురువారం నా డు ప్రారంభమైంది.

04/27/2018 - 02:26

హైదరాబాద్, ఏప్రిల్ 26: తెలంగాణ పదో తరగతి ఫలితాలను శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. ఫలితాలను మార్కులు కాకుండా గ్రేడింగ్ పద్ధతిలోనే విడుదల చేయనున్నారు. ఫలితాలను పలు వెబ్ పోర్టల్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని పాఠశాల విద్య సంచాలకులు కిషన్, పరీక్షల బోర్డు సంచాలకుడు సుధాకర్‌లు తెలిపారు.

04/27/2018 - 03:45

* యశోద ఆసుపత్రిలో మదర్ అండ్ చైల్డ్ ఇన్స్‌స్టిట్యూట్ ప్రారంభం

04/27/2018 - 02:22

హైదరాబాద్, ఏప్రిల్ 26: దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాలు పుట్టుకొచ్చాయని, వేలాది రూపాయిలు ఫీజులు వసూలుచేస్తూ ఆన్‌లైన్‌లోనూ విద్యార్థులను పెద్దఎత్తున మోసగిస్తున్న యూనివర్శిటీల్లో అడ్మిషన్లు తీసుకోవద్దని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ హెచ్చరించింది. 24 నకిలీ విశ్వవిద్యాలయాలు దేశంలో పనిచేస్తున్నాయని, ఇవన్నీ సొంతగా యూనివర్శిటీలుగా ప్రకటించుకున్నాయే తప్ప గుర్తింపు పొందలేదని యూజీసీ ప్రకటించింది.

04/27/2018 - 02:06

చిత్తూరు, ఏప్రిల్ 26: చట్టాలను అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై గురువారం జిల్లా వైద్య శాఖ అధికారులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతూ గర్భంలో ఆడ శిశువు అని తేలితే అబార్షన్ చేస్తున్న దారుణాన్ని గుర్తించి డాక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనలో స్కానింగ్ యంత్రాలతో పాటు విలువైన మందులను సీజ్ చేశారు.

04/27/2018 - 03:37

విజయవాడ, ఏప్రిల్ 26: ప్రజలకు నగదు అందుబాటులో ఎందుకు లేదని బ్యాంకర్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. మనీ సర్క్యులేషన్‌లో లేకపోవడం వలన తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయని తీవ్ర స్వరంతో అన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్లో 202 ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశం గురువారం సాయంత్రం జరిగింది.

04/27/2018 - 03:39

ధర్మపురి, ఏప్రిల్ 26: దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో ఉత్కృష్టమైనదిగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నిలయంగా, తెలుగునేలపై పేరెన్నికగన్న ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శ్రీనృసింహుని చందనోత్సవ వేడుకలు గురువారం వైభవోపేతంగా జరిగాయి.

Pages