S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/28/2018 - 04:27

వరంగల్/ కొత్తగూడెం, ఏప్రిల్ 27: మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడు రోజుల కిందటే మహారాష్టల్రోని గడ్చిరోలిలో జరిగిన రెండు భారీ ఎన్‌కౌంటర్లలో 37మంది మావోలు మృతిచెందగా తాజాగా శుక్రవారం తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మరోసారి కాల్పులమోత కొనసాగింది.

04/27/2018 - 16:37

విజయవాడ: హీరో మహేష్‌బాబు బెజవాడలో సందడి చేశాడు. బెంజిసర్కిల్ ట్రెండ్ సెట్‌లో ప్రేక్షకులతో కలిసి ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని వీక్షించారు. ఆయనతో పాటు దర్శకుడు కొరటాల శివ, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. సినిమా విజయోత్సవానికి వచ్చానని, రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు.

04/27/2018 - 16:27

అమరావతి: ఆళ్లగడ్డ పంచాయతీ సమస్య మరోసారి సమావేశంలో చర్చలు జరిగాయి. శుక్రవారంనాడు ప్రజాదర్బార్ హాలులో జరిగిన సమావేశంలో పరస్పరం కత్తులు దూసుకుంటున్న ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిలప్రియ తన సోదరి వౌనిక, సోదరుడు బ్రహ్మానందరెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో ఇద్దరి పద్ధతి బాగాలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. గ్రూపులు కడితే చులకన అవుతామని హెచ్చరించారు.

04/27/2018 - 16:22

హైదరాబాద్: దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో మాట్లాడుతూ దేశ రాజకీయాలలో తాను సమూల మార్పులు తీసుకువస్తానని, తాను చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తుందని అన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని, వీటి వల్ల నీటి యుద్ధాలు జరుగుతున్నాయని అన్నారు.

04/27/2018 - 13:55

హైదరాబాద్: ఎవరెన్ని అవాకులు చవాకులు పేలినా తెలంగాణ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నీతి, నిజాయితీగా పని చేస్తున్నద‌ని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పార్టీ 17వ ప్లీనరీ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లడారు. చరిత్రలో నిలిచిపోయేలా కాళేశ్వరం నిర్మిస్తుంటే కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.

04/27/2018 - 12:08

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ శుక్రవారం కొంపల్లిలోని జీబీఆర్‌ గార్డెన్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. వేల సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు.

04/27/2018 - 12:00

గుంటూరు: జిల్లాలోని మంగళగిరిలో భార్య మృతిని తట్టుకోలేక తన ఇద్దరు పిల్లలతో సహ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. మంగళగిరి పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి భార్య గత రెండు రోజుల క్రితం మృతిచెందింది. అప్పటినుంచి దిగాలు చెందిన ఆయన భార్య మరణాన్ని తట్టుకోలేక తేజేశ్వర్‌, అమరేశ్వర్‌ అనే ఇద్దరు పిల్లలతో సహ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

04/27/2018 - 04:49

హైదరాబాద్, ఏప్రిల్ 26: వచ్చే జూలై 1వ తేదీ నుంచి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్‌మెంట్ చట్టం (రెరా) 2016ను అమలు చేసేందు కు వీలుగా రాష్ట్రప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రెరా నిపుణులు ఇప్పటికే కర్నాటక, మహారాష్టల్రో పర్యటించి రెరా విధి విధానాల అమలును అధ్యయనం చేశారు.

04/27/2018 - 04:19

బెంగళూరు, ఏప్రిల్ 26: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత ఉధృతిని సంతరించుకుంది. రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్ర మోదీ అధికార కాంగ్రెస్‌పై తీప్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కులాల ప్రాతిపదికన సమాజాన్ని చీల్చేస్తోందని, అలాగే అబద్ధాల ప్రచారంతో అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండాలన్న కుత్సిత వ్యూహమే కాంగ్రెస్ లక్ష్యమని మోదీ అన్నారు.

04/27/2018 - 02:49

తిరుపతి, ఏప్రిల్ 26: ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారని, అయినా ఎలాంటి కాలుష్యం లేకుండా పర్యావరణం చక్కగా, ఆహ్లాదంగా ఉందని పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి అన్నారు. పార్లమెంటరీ కమిటీ గురువారం సాయంత్రం తిరుమలలో పర్యటించి పలు ప్రాంతాలను పరిశీలించింది.

Pages