S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/28/2018 - 12:20

అమరావతి: రాష్ట్రంలో పరిస్థితులను చూసిన తర్వాతే పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నానని, వాస్తవాలను వెల్లడించి ప్రజలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర చేశానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం చేపట్టిన తర్వాత సాధించిన విజయాలను వివరించారు.

04/28/2018 - 12:16

తిరుమల : తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. మహేష్ నటించిన భరత్ అను నేను చిత్ర విజయ యాత్రలో భాగంగా నిన్న తిరుపతికి వచ్చిన చిత్ర టీం.. ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో వీరు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు.

04/28/2018 - 12:10

తిరుమల: జిఎస్టీ నుంచి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలని మంత్రి యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. త్వరలో జరగనున్న సమావేశంలో కూడా మరోమారి జీఎష్టీ మినహాయింపు గురించి కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు.

04/28/2018 - 12:01

గుంటూరు : తుళ్లూరు మండలం దొండపాడు ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది. రాజధాని రహదారి నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మొత్తం 10 మంది చిన్నారులు ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను ఉప్పలపాటి అమల(9), ఉప్పలపాటి దినేష్(8), బండి సాత్విక్(6)గా గుర్తించారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

04/28/2018 - 05:22

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ సమస్యకు గత కాంగ్రెస్ పాలకుల పుణ్యమేనని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందని, యువతలో నైపుణ్యత కొరవడిందని శుక్రవారం ఇక్కడ ధ్వజమెత్తారు. మూడు జనరేషన్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు పనికట్టుకుని మోదీపై విమర్శలు చేస్తోందని విమర్శించారు.

04/28/2018 - 05:08

న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో జరపనున్న చర్చల్లో వివాదాస్పద డోక్లామ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా నిర్మిస్తోన్న ఆర్థిక కారిడార్ అంశాలు తప్పక చర్చించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ సూచించారు. శుక్రవారం ఈమేరకు ట్వీట్ చేస్తూ, ‘ప్రియమైన మోదీజీ, మీ ‘నో అజెండా’ చైనా యాత్రను లైవ్ ఫీడ్‌లో ఒకసారి చూసుకోండి. మీలో కొంత ఆందోళన కనిపిస్తోంది.

04/28/2018 - 03:45

విజయవాడ(బెంజిసర్కిల్), ఏప్రిల్ 27: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను సినీ నటుడు, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆయన వెంట భరత్ అనే నేను సినిమా డైరెక్టర్ కొరటాల శివ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తదితరులు ఉన్నారు.

04/28/2018 - 03:16

హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి 17 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వార్షిక ప్లీనరీ అసాంతం పూర్తిగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే కేంద్ర బిందువుగా సాగింది. పార్టీ అధినేత, సిఎం కేసీఆర్ తన ప్రసంగంలో సింహభాగాన్ని ఫ్రంట్ ఏర్పాటు అవశ్యకతపైనే కొనసాగింది. ప్లీనరీ జరిగిన తీరు తెన్నులను విశే్లషిస్తే ఇది రాష్ట్ర ప్లీనరీగా కాకుండా జాతీయ ప్లీనరీగా చెప్పవచ్చు.

04/28/2018 - 03:15

విజయవాడ/ద్వారకాతిరుమల, ఏప్రిల్ 27: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన ఇమ్మడి పృథ్వీతేజ్ తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్‌కు ఎంపికై సంచలనం సృష్టించాడు. సివిల్ సర్వీసు పరీక్షల్లో ఆయన అఖిల భారత స్థాయిలో 24వ ర్యాంకు సాధించారు. పృధ్వీతేజ్ చిన్న నాటి నుంచే చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. పృథ్వీతేజ్ తండ్రి శ్రీనివాసరావు వ్యాపారి. తల్లి రాణి గృహిణి.

04/28/2018 - 03:48

ధర్మపురి, ఏప్రిల్ 27: ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం రాత్రి లక్ష్మీనారసింహుని వసంతోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ నవరాత్రి ఉత్సవాల్లో అంతర్భాగంగా దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర నారసింహాలయాలలో శుక్రవారం పల్లవోత్సవం, వసంతోత్సవం, పుష్పోత్సవం, నానావిధ ఫల రసోత్సవాది వేడుకలను సనాతన సంప్రదాయ వేదోక్త రీతిలో నిర్వహించారు.

Pages