S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/08/2018 - 03:18

హైదరాబాద్, మార్చి 7: గత ఏడాది నోటిఫై చేసిన 23 సివిల్ జడ్జీ(జూనియర్ డివిజన్)ల పోస్టులను భర్తీ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు శనివారం ఫలితాలను ప్రకటించింది. గత ఏడాది ఫిబ్రవరి 28న 23 సివిల్ జడ్జీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి అనుగుణంగా 20 మందిని ఎంపిక చేసి ఆ జాబితాను హైకోర్టు వెబ్ పోర్టల్‌లో ఉంచింది.

04/08/2018 - 02:43

సూళ్లూరుపేట, ఏప్రిల్ 7: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెల 12న పిఎస్‌ఎల్‌వి సి41 ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు.

04/08/2018 - 02:24

శ్రీకాకుళం, ఏప్రిల్ 7: తెలుగు రాష్ట్రాల నుంచి వేదం నేర్చుకున్న 200 మంది విద్యార్థులు ఇక్కడి శ్రీచక్రపురంలో శనివారం నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యారు. ఉత్తరాంధ్ర వేద విద్యాట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ భాస్కరమూర్తి ఆధ్వర్యంలో 19వ వేదవిద్యా సమ్మేళనం జగత్ జననీ మరో స్వరూపమైన ఏకోత్తర సహస్ర శ్రీచక్రమేవుల వద్ద ఈ వేద విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.

04/08/2018 - 02:06

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 7: పార్లమెంటులో అవిశ్వాసాన్ని ఎదుర్కొనలేక పారిపోయిన ప్రధాని మోదీ, ఆ నెపాన్ని కాంగ్రెస్‌పై వేయడం విడ్డూరమని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈమేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎన్‌డీఏ మిత్రపక్షమైన ఏఐడీఎంకే ఎంపీల ఆందోళనల ద్వారా పార్లమెంటును స్తంభింపచేసి ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టడం ప్రధాని అసమర్థతకు నిదర్శనమన్నారు.

04/08/2018 - 04:02

వరంగల్: అధికార అహంకారంతో విర్రవీగుతున్న సీఎం కేసీఆర్ పతనం వరంగల్ నుంచే మొదలవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం వరంగల్ డీసీసీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, హన్మకొండలో నిర్వహించిన రెండో విడత ప్రజాచైతన్య బస్సు యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చిందన్నారు.

04/08/2018 - 01:18

హైదరాబాద్, ఏప్రిల్ 7: అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చేస్తున్న అప్పులు భవిష్యత్ అవసరాలకు పెట్టుబడులని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కే. తారకరామారావు స్పష్టం చేశారు.

04/08/2018 - 04:07

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీ జేఈఈ మెయిన్స్ పెన్ను- పేపర్ ఆధారిత పరీక్ష నేడు జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇందుకు 25 రీజనల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 11.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది హాజరవుతున్నారు.

04/08/2018 - 01:08

విశాఖపట్నం, ఏప్రిల్ 7: కృష్ణాడెల్టాకు నీరిచ్చేందుకు గోదావరి జలాల మళ్లింపులో భాగంగా నిర్మించి పట్టిసీమ ప్రాజెక్టులో అంతులేని అవినీతి చోటుచేసుకుందని బీజేపీ శాసనసభ పక్ష నేత పీ విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. విశాఖలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ టెండర్ల ప్రక్రియలో ఎక్సస్ రేట్లపై ఉన్న నిషేధాన్ని తొలగించడం ద్వారా కాంట్రాక్టరు 22 శాతం ఎక్కువకు కోట్ చేసి నిధులు మింగేశారని ఆరోపించారు.

04/08/2018 - 04:07

తెనాలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హయాంలో పాలనా వ్యవస్థ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్న ఆయనను ప్రజలు క్షమించరని, ఇసుక మాఫియాల నుండి చినబాబుకు మామూళ్ళ వర్షం కురుస్తోందని ధ్వజమెత్తారు.

04/08/2018 - 00:59

విజయవాడ, ఏప్రిల్ 7: ప్రధాని నరేంద్ర మోదీ ఒక నియంత తరహా నాయకుడని, ఎన్డీఏ నుండి ఆనాడే బయటకు వచ్చి ఉంటే రాష్ట్రానికి మరిన్ని వేధింపులు ఉండేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. దబాయించి ముందుకు పోవాలనుకుంటున్నారే తప్ప ప్రజల మనోభావాలు గుర్తించి సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన ఆయనకు లేదని ధ్వజమెత్తారు.

Pages