S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/07/2018 - 13:17

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకపోవటానికి కారణాలను వివరిస్తూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సైకిల్ ర్యాలీలు చౌకబారు ప్రచారం కోసమేనని ఆయన ఆ లేఖలో విమర్శించారు. మోదీ కంటే సోనియా, రాహుల్‌పైన నమ్మకం ఉన్నట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

04/07/2018 - 12:39

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి తరలిస్తున్న గంజాయిని పిఠాపురం పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 29 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓ ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా... ఈ వ్యవహారంతో సంబంధమున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

04/07/2018 - 04:45

తిరుపతి: తిరుమలలో శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి 33 సంవత్సరాలు పూర్తయిందని తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు చెప్పారు. భక్తులు విరాళాల ద్వారా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.937 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

04/07/2018 - 02:35

హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలుగు రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లో ఒక్క పీహెచ్‌డీ పూర్తికావడానికి సగటున ఏడేళ్లు పడుతోంది. కనీసం నాలుగేళ్లలో పూర్తికావల్సిన పీహెచ్‌డీలను యూనివర్శిటీ అధ్యాపకుల సాగతీత, అనుభవ రాహిత్యం, పరిశీలకుల నిర్ల క్ష్యం, నియమనిబంధనల కారణంగా పీహెచ్‌డీల ఆ మోదంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది.

04/07/2018 - 02:28

హైదరాబాద్, ఏప్రిల్ 6: ఇంజనీరింగ్ సహా దాని అనుబంధ కోర్సులు, అగ్రికల్చర్ దాని అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎమ్సెట్‌కు బుధవారం సాయంత్రం వరకూ 2,13,029 లక్షల దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్‌లో వెస్ట్ జోన్‌కు 25,050, నార్త్ జోన్‌కు 25,078, సెంట్రల్ జోన్‌కు 33,385, ఈస్టు జోన్‌కు 8782, సౌత్ ఈస్టు జోన్‌కు 42,518 దరఖాస్తులు వచ్చాయి.

04/07/2018 - 01:58

విజయవాడ, ఏప్రిల్ 6: బీజేపీ సీనియర్ నేతలు వచ్చి కలిస్తే చిన్నా, చితకా నాయకులు కలిసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఇలాంటి బీజేపీని తానెప్పుడూ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. శాసనసభ సమావేశాల ముగింపు అనంతరం టీడీపీ శాసనసభా పక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీలో నాయక త్వ ధోరణి భిన్నంగా ఉందని విమర్శించారు.

04/07/2018 - 01:54

విశాఖపట్నం, ఏప్రిల్ 6: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ అన్ని రాజకీయ పా ర్టీలూ, ప్రజా సంఘాలు శుక్రవారం రోడ్డెక్కా యి. నిరసనలతో నగరం అట్టుడికిపోయింది.

04/07/2018 - 01:56

రాజమహేంద్రవరం/ఏలూరు, ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన నమ్మకద్రోహని కి వ్యతిరేకంగా రాష్టవ్య్రాప్త పిలుపులో భాగం గా సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీల ఆధ్వర్యం లో శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున పాదయాత్రలు నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో బీజేపీ, టీ డీపీ దారుణంగా వంచించాయని ఈసందర్భంగా పలువురు నేతలు విమర్శించారు.

04/07/2018 - 01:51

హైదరాబాద్, ఏప్రిల్ 6: కృష్ణానది యాజమాన్య బోర్డులో నిర్ణయం మేరకు టెలిమెట్రీలు ఏర్పాటు చేయలేదని కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్‌కు తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి ఎస్‌కె జోషి తాజాగా మరో లేఖ రాసారు. ఇప్పటికే కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఇదే అంశంపై నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

04/07/2018 - 01:51

హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ చెరువులను తలపించాయ. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Pages