S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/06/2018 - 13:50

విజయవాడ:ఇచ్చిన మాట ప్రకారం వైకాపా ఎంపీలు రాజీనామా చేశారని ఆ పార్టీ నేత వైఎస్ జగన్ అన్నారు. దమ్ముంటే తెలుగుదేశం పార్టీ కూడా తన ఎంపీలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదాపై శ్రద్ధ ఉంటే మాతో కలసిరావాలని విజ్ఞప్తి చేశారు. అందరం ఐక్యమత్యంగా కలిసి పోరాడదామని ట్విట్టర్‌లో కోరారు.

04/06/2018 - 13:05

నల్గొండ :జిల్లాలోని పిఏ మండలం వద్దికట్ల వద్ద ఏఎంఆర్ కాలువలో ట్రాక్టర్ బోల్తాపడి తొమ్మిది మంది మృతిచెందారు. ఈ టాక్టర్‌లో 30మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా కూలీలు. మిరపచేనులో పనుల కోసం వెళుతూ మృత్యువాత పడ్డారు. పడమటితండా నుంచి పులిచర్లలోని కూలీ పనుల కోసం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

04/06/2018 - 13:02

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వివిధ పార్టీలు తమ ఆందోళనలతో పట్టు బిగిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రులు, నాయకులు, కార్యకర్తలు సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. వెంకటపాలెంలోని ఎన్టీయార్ విగ్రహం వద్ద నుంచి అసెంబ్లీ వరకు సాగిన ఈ సైకిల్ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, అచ్చెయ్య నాయుడు కూడా పాల్గొన్నారు.

04/06/2018 - 03:26

విజయవాడ: రాష్ట్రంలో దళితులు గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారు పారిశ్రామికవేత్తలుగా తయారుకావడానికి తన వంతు సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విద్యార్థి దశ నుంచే జగ్జీవన్‌రామ్ ఆశయమైన సామాజిక న్యాయం కోసం తాను కృషిచేస్తూ అధికారం, వనరులు కొద్దిమందికే సొంతం కాకూడదని అందరికీ దక్కాలన్న ఆశయంతోనే పనిచేస్తున్నానని కూడా స్పష్టం చేశారు.

04/06/2018 - 03:24

విశాఖపట్నం, ఏప్రిల్ 5: క్యుమిలోనింబస్ మేఘాల ప్రభావంతోపాటు, విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమను ఆనుకుని తమిళనాడు వరకూ ఏర్పడి ఉన్న అల్పపీడన ప్రభావం వలన కోస్తాలోని శుక్రవారం అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది. కొన్ని చోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని గురువారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనాయి.

04/06/2018 - 01:20

విజయవాడ, ఏప్రిల్ 5: రాజధాని అమరావతిపై విజయవాడ బందరు రోడ్డులో కొన్ని మీటర్ల దూరంలోనే వేర్వేరు ప్రదేశాల్లో గురువారం సాయంత్రం పోటాపోటీగా రెండు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. భారీగా ప్రజలు తరలి వస్తున్నారని తెలిసి ముందు జాగ్రత్తగా అడుగడుగునా భారీ పోలీస్ బందోబస్తు పెట్టారు. మొత్తంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

04/06/2018 - 01:14

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 5: ఖండాంతర ఖ్యాతిగడించిన కొండపల్లి బొమ్మల తయారీకి ముడి సరుకుకు ఇపుడు తూర్పు కనుమల అడవులు ఆవాసంగా మారా యి. ముడి సరుకు కొరతను తీర్చి కళను కాపాడటానికి, ఈ కళాకృతుల తయారీలో తరతరాలుగా ఆధారపడిన కళాకారుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర అటవీ శాఖ వననిధి (ఉడ్ బ్యాంకు) పథకాన్ని చేపట్టింది.

04/06/2018 - 03:39

మిర్యాలగూడ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఇందుకు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిద్ధమేనా అని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటీశాఖ మంత్రి కేటీ.రామారావు సవాల్ విసిరారు.

04/06/2018 - 03:40

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ, కేంద్ర జల సంఘం నుంచి దాదాపు అనుమతులన్నీ లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై దృష్టి సారించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశకు అటవీశాఖ అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం సమాచారం అందింది.

04/06/2018 - 00:57

వరంగల్, ఏప్రిల్ 5: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరు అని, ప్రతి బడ్జెట్‌లో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించి ప్రజలను మోసం చేస్తున్నాడని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Pages