S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/02/2018 - 04:24

భీమవరం, మార్చి 1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు విద్యాసంస్థల ప్రాంతంలో ‘విష్ణు ఇన్నోవేషన్ సమిట్-2018’ శుక్ర, శనివారాల్లో నిర్వహించనున్నారు. అంతర్జాతీయంగా పేరొందిన సాప్, ఇన్నోవేటిఒఎక్ట్స్‌లతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణు విద్యాసంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.

03/02/2018 - 01:58

చౌడేపల్లె, మార్చి 1: ప్రముఖ రచయిత నాయ ని కృష్ణమూర్తి గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. అనేక నవలలు, కథలు, ఆధ్యాత్మిక గ్రంథాలను ఆయన రచించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం నడిమిచెర్లలో 1951లో జన్మించిన నాయని హైస్కూల్ స్థాయి నుంచి సాహి త్యం, రచనల పట్ల ఆసక్తి చూపారు.

03/02/2018 - 01:56

హైదరాబాద్, మార్చి 1: అమెరికా సైన్యం ఎక్కువగా ఉపయోగించే అపాచీ యుద్ధ హెలిక్యాప్టర్ల ప్రధాన విడి భాగాలు హైదరాబాద్‌లోని టాటా బోయింగ్ ఏయిరోస్పేస్ కేంద్రంలోనే తయారు అవుతున్నాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక్కడ తయారయ్యే అపాచీ యుద్ధ హెలిక్యాప్టర్లు జీరో డిఫెక్ట్‌గా ఉన్నాయని అమెరికా సంస్థ కితాబు ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తు చేసారు.

03/02/2018 - 01:53

విజయవాడ, మార్చి 1: అగ్రిగోల్డ్ బాధితులకు రూ.5కోట్ల విలువైన చెక్కులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి నిబంధనలు ఉన్నా లెక్కచేయనని, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులను గురువారం సీఎం పంపిణీ చేశారు. ముందుగా 100 మందికి నష్టపరిహార చెక్కులు ఆయన అందజేశారు.

03/02/2018 - 01:50

రామచంద్రపురం, మార్చి 1: విద్యార్థుల నుండి ఎడాపెడా ఫీజులు వసూలుచేస్తూ, రాష్ట్రంలోని పురపాలక చట్టంలోని 88 (1)సి సెక్షన్ కింద ఆస్తి పన్ను మినహాయింపు పొందుతున్న విద్యాసంస్థలపై పురపాలక శాఖ కొరడా ఝుళిపిస్తోంది. సేవాభావంతో విద్యార్థుల నుండి ఎటువంటి రుసుములు వసూలుచేయని విద్యాసంస్థలకే ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొం టూ, ఇతర అన్ని విద్యాసంస్థల నుండి బకాయిలతో సహా పన్ను వసూలచేయాలని నిర్ణయించింది.

03/02/2018 - 01:24

హైదరాబాద్/శంషాబాద్, మార్చి 1: వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. సమగ్ర కేన్సర్ కేర్ మేనేజింట్ పథకం కింద టాటా ట్రస్టుతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య రంగంలో దేశ వ్యాప్తంగా విశేష కృషి చేస్తున్న టాటా ట్రస్టు ఈ ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రానికి కేన్సర్ మేనేజిమెంట్ విషయంలో సహాయం అందించనుంది.

03/02/2018 - 01:22

విజయవాడ, మార్చి 1: వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాకర్షక బడ్జెట్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. సంక్షేమానికి, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఓటు బ్యాంకును ఆకట్టుకునేలా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను రూపకల్పన చేస్తున్నారు.

03/02/2018 - 01:20

విశాఖపట్నం, మార్చి 1: పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండే వ్యాక్యూమ్ టాయ్‌లెట్లు అందుబాటులోకి రానున్నాయి. సాంకేతిక నిపుణుల సిఫారసులు, సూచనలతో స్వచ్ఛ్భారత్‌ను సాధించే క్రమంలో వ్యాక్యూమ్ టాయ్‌లెట్లను అన్ని రైళ్లల్లో ఏర్పాటు చేయాలని రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత ఒకట్రెండు రైల్వేజోన్ల పరిధిల్లో నడిచే కొన్ని రైళ్లల్లో వీటిని ఏర్పాటు చేశారు.

03/02/2018 - 00:53

హైదరాబాద్, మార్చి 1: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేగంగా అభివృద్ది చెందాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ శ్రీపీఠం నేతృత్వంలో విళంబినామ సంవత్సరం ఉగాది నుండి ఐదు రోజుల పాటు హైదరాబాద్ (నిజాం కాలేజ్ గ్రౌండ్స్) లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద తెలిపారు.

03/02/2018 - 00:48

హైదరాబాద్, మార్చి 1: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం చేసిన సాయంపై నివేదిక అందించేందుకు జనసేన అధినేత , సినీనటుడు పవన్‌కళ్యాణ్ చొరవతో ఏర్పాటైన సంయుక్త నిజనిర్థారణ కమిటీ (జేఎఫ్‌సీ) తమ నివేదికను పవన్‌కళ్యాణ్‌కు అందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చలేదని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.

Pages