S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/28/2018 - 01:49

హైదరాబాద్, ఫిబ్రవరి 27: హైదరాబాద్‌లో సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లను సుప్రీం కోర్టును కోరుతూ తీర్మానం చేశాయి. మంగళవారం హైకోర్టులో రెండు రాష్ట్రాల బార్ అసోసియేషన్ సభ్యుల సమావేశం జరిగింది. 2015 నుంచి హైకోర్టు ప్రధానన్యాయమూర్తి పోస్టు ఖాళీగా ఉంది. పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని కోరారు.

02/28/2018 - 01:43

వికారాబాద్, ఫిబ్రవరి 27: కేంద్రంలో మోదీ పాలనలో వేల కోట్ల బ్యాంకు కుంభకోణాలు జరుగుతుంటే, రాష్ట్రంలోని కేసీఆర్ పాలనలో వేలాది రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా విమర్శించారు. మంగళవారం తాండూర్‌లో నిర్వహించిన ప్రజా చైతన్య బస్సు యాత్ర సభలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాజనీతితో కొనసాగుతోందని చెప్పారు.

02/28/2018 - 01:41

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 28న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 29న ప్రారంభం కానున్నాయి. రాష్టవ్య్రాప్తంగా 9.63 లక్షలమంది హాజరవుతున్న పరీక్షలకు భారీ ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ తెలిపారు. అభ్యర్ధుల హాల్‌టిక్కెట్లు జారీ చేయడంలో పలు జూనియర్ కాలేజీలు ఫీజులతో ముడిపెట్టినట్టు విద్యార్థులు వాపోతున్నారు.

02/28/2018 - 01:40

ఆదిలాబాద్, ఫిబ్రవరి 27: దేశంలో రైతు సంక్షోభానికి జాతీయ పార్టీలు సిగ్గుతో తలవంచుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెంపుదల కోసం జాతీయస్థాయిలో ఉద్యమానికి సిద్ధమని ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రైతు సమస్యలే ఎజెండాగా కేంద్ర విధానాలను ఎండగడుతామని హెచ్చరించారు.

02/28/2018 - 01:35

విశాఖపట్నం (జగదాంబ), ఫిబ్రవరి 27: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్టవ్య్రాప్తంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా రెండు సంవత్సరాలకు సంబంధించి జనరల్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 10, 26,891 మంది హాజరవుతున్నారన్నారు.

02/28/2018 - 01:32

జి. రాహుల్ మల్హోత్రా

02/28/2018 - 01:29

అమరావతి, ఫిబ్రవరి 27: ‘అనుభవమే పాఠాలు నేర్పుతుంది. అది పదిమందికీ పంచితేనే బతుకుకు సార్థకత చేకూరుతుంది. ఏపీని నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం. రోజువారీ విశే్లషణ, సమస్యల అధ్యయనం, వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించడం, దాని అమలుతోనే విజయవంతమైన నాయకులం కాగలం’ అని సీఎం చంద్రబాబు ఉద్బోధించారు.

02/28/2018 - 01:21

విజయవాడ, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ద్వారా ప్రపంచానికి తెలియజేశామన్న సంతృప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారు. వరుసగా మూడోసారి విశాఖలో జరిగిన సదస్సు ఉత్సాహంగా జరిగిందన్నారు.

02/27/2018 - 18:10

విజయవాడ: సినీ వినీలాకాశంలో శ్రీదేవి ఓ ధ్రువతార అని, అటువంటి అతిలోకసుందరి మరణం చాలా బాధాకరమని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. మహా నటి శ్రీదేవి ఆత్మహత్య చేసుకునేంత పిరికి మనిషి కాదని శ్రీదేవి అంత్యక్రియలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

02/27/2018 - 17:47

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో పొగలు రావడంపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. సెక్యూరిటీ సర్వీస్ విభాగంలో వైర్‌‌లెస్ కిట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలొచ్చాయన్నారు. వెంటనే సెక్యూరిటీ వింగ్ అలర్టైందన్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ కొనసాగుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

Pages