S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/30/2018 - 02:10

హైదరాబాద్, జనవరి 29: ఆన్‌లైన్‌లో మారణాయుధాలను కొనుగోలు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసేందుకు పథకం వేసిన 12 మందిని నగర టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గృహాపకరణాల మాదిరిగా ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా ఈ ముఠా పదునైన మారణాయుధాలను, కొన్ని అతిపొడవైన, పదునైన నిషేధిత మారణాయుధాలను సైతం కొనుగోలు చేశారు. ఈ సంగతి టాస్క్ఫోర్స్‌కు సమాచారం అందడంతో దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.

01/30/2018 - 02:07

హైదరాబాద్, జనవరి 29: టిహబ్‌తో రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఇసి) సోమవారం ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 30 విశ్వవిద్యాలయాలకు చెందిన 1800 మంది విద్యార్థులు సోలార్ పవర్, విండ్ పవర్, బయో వేస్ట్ పవర్‌పై రీసెర్చ్ చేయడానికి అవకాశం కలిగింది.

01/30/2018 - 01:59

హిందూపురం, జనవరి 29: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో రాజకీయ పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. విభజనపై పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచం ద్వారా సమష్టి పోరాటం చేయలేకపోయాయన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం జరిగిన పార్టీ జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో పవన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

01/30/2018 - 01:53

విశాఖపట్నం, జనవరి 29: ఆ ఇంట్లో ఎటు చూసినా, బంగారు, వెండి వస్తువులే కనిపిస్తాయి. బీరువా తెరిచి చూస్తే, కొత్త కరెన్సీ కట్టలు, బంగారు, వజ్రాల ఆభరణాలు తళుకు తళుకుమంటున్నాయి. విలాసవంతమైన జీవితం. ఇదంతా ఎక్కడో కాదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంటి వైభోగం.

01/30/2018 - 01:51

అమరావతి, జనవరి 29: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మహా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు సోమవారం నిర్వహించిన ‘వాక్ విత్ జగనన్న’ పాదయాత్రకు జనం పోటెత్తారు. ఢిల్లీతోపాటు విదేశాల్లో కూడా జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకూ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి, జగన్‌కు సంఘీభావం ప్రకటించారు.

01/30/2018 - 01:44

అమరావతి, జనవరి 29: ‘ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో 11.5శాతం వృద్ధి సాధించాం, 62శాతం ప్రజల్లో సంతృప్తికి చేరుకున్నాం. ఇంకా 18శాతం సంతృప్తి సాధించాలి. ఈ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగించాలి. 15శాతం వృద్ధి, 80శాతం ప్రజా సంతృప్తి లక్ష్యంగా అందరూ పనిచేయాలి. సక్రమంగా పనిచేస్తే 15శాతం వృద్ధి సాధించడం సులభమే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

01/30/2018 - 01:38

తిరుపతి, జనవరి 29: శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించడానికి భక్తులు కాలినడకన వెళ్లే శ్రీవారి మెట్టుమార్గంలో సోమవారం రాత్రి 10గంటల ప్రాంతంలో బాంబులను పేల్చడానికి ఉపయోగించే ఎలక్ట్రికల్ పరికరాలను టాస్క్ఫోర్స్ దళాలు గుర్తించాయి. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఐజి కాంతారావు, చంద్రగిరి పోలీసులు, డాగ్‌స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

01/30/2018 - 02:18

హైదరాబాద్, జనవరి 29: మహానగరంలో పొగ మంచు కమ్ముకుంది. గడిచిన రెండు,మూడు రోజుల నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవటంతో చలిపులి పంజా విసురుతోంది. ముఖ్యంగా సోమవారం ఉదయం దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. ఉదయానే్న స్కూల్, కాలజీలు, ఆఫీసులకు వెళ్లాల్సిన వారు ఇబ్బందుల పాలయ్యారు.

01/29/2018 - 02:22

రాష్ట్రంలో ఆదివారం చుక్కల మందు హడావుడి కనిపించింది. పోలియోను శాశ్వతంగా నివారించే లక్ష్యంతో ఆస్పత్రులు, ప్రాథమిక పాఠశాలలు, పబ్లిక్ ప్రదేశాలు, వీధివీధిలో వలంటీర్లు చుక్కలమందు అందించారు. రాష్టవ్య్రాప్తంగా 22,768 కేంద్రాల్లో 36.56 లక్షల మంది పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 787 సంచార టీంలూ చుక్కలమందు అందించాయ.

01/29/2018 - 02:18

హైదరాబాద్, జనవరి 28: తెలంగాణ సర్కారు త్వరలో ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణకు ఇతోధికంగా నిధులు విడుదల చేయనుంది. పరిశ్రమల పునరుద్ధరణకు గతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌లు చురుకుగా పనిచేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న పరిశ్రమల యజమాన్యాల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Pages