S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/02/2018 - 00:58

హైదరాబాద్, ఫిబ్రవరి 1: జగన్ అక్రమాస్తుల కేసులో నాలుగు వారాల పాటు సీనియర్ ఐఎఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌పై అభియోగాలను సిబిఐ కోర్టు విచారించకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ఆదిత్యనాథ్ దాస్‌కు ఊరట లభంచినట్లయింది. అక్రమాస్తుల కేసులవో ఇడి అభియోగాలను మోపింది. ఈ కేసును జస్టిస్ షామీమ్ అక్తర్ విచారించారు.

02/02/2018 - 00:40

అమలాపురం, ఫిబ్రవరి 1: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మూడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ప్రధాన సమస్యను పరిష్కరించకుండా ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోందని, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు ప్రకటించారు.

02/02/2018 - 00:37

కడప, ఫిబ్రవరి 1: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుచేయాలంటూ ఆందోళన చేపట్టిన కడప న్యాయవాదులు గురువారం ఏకంగా జిల్లా కోర్టు గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. జడ్జీలు, కోర్టు సిబ్బంది, కక్షిదారులను గేటు బయటే అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో విధులకు హాజరయ్యేందుకు వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకున్నారు.

02/02/2018 - 00:35

పొదలకూరు, ఫిబ్రవరి 1: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ రెండోరోజైన గురువారం నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో పర్యటించారు. తోడేరు క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం రాత్రి బస చేసిన ఆయన ఉదయం తొమ్మిది గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో ఆయనకు అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. మహిళలు పెద్దసంఖ్యలో హారతులిస్తూ నీరాజనాలు పలికారు.

02/01/2018 - 00:07

భద్రాచలం టౌన్, జనవరి 31: శ్రీ రామచంద్రుడు విళంబి నామ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో జన్మించాడు. చైత్రశుద్ధ నవమినే శ్రీ రామనవమిగా భావిస్తూ స్వామి పుట్టిన రోజునే భద్రాద్రిలో కల్యాణం జరిపించడం ఆనాదిగా ఆనవాయితీగా వస్తోంది.

01/31/2018 - 22:15

న్యూఢిల్లీ, జనవరి 31: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక విజ్ఞప్తి చేసింది. బుధవారం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక నాయకులు మాజీ ప్రధాని మాన్మోహన్ సింగ్‌ను కలిశారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలు కాని విషయాన్ని మన్మోహన్ దృష్టికి తెచ్చారు.

01/31/2018 - 03:30

హైదరాబాద్/గచ్చిబౌలి, జనవరి 30: పంచాక్షరి సినిమా హీరో, నటుడు జీవీఎస్ కృష్ణారెడ్డి అలియాస్ సామ్రాట్‌రెడ్డిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతని భార్య కొండకల్లా హర్షితరెడ్డి 25వ తేదీన తాను లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి తన భర్త విలువైన సామాన్లు తీసుకుపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సామ్రాట్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

01/31/2018 - 02:28

హైదరాబాద్, జనవరి 30: తెలంగాణలో కల్తీ పాల విక్రయాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాల్సిందిగా హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. నల్లగొండ జిల్లాకు చెందిన కె నరసింహారావుదాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం ఈ పిల్‌ను విచారించింది.

01/31/2018 - 02:28

హైదరాబాద్, జనవరి 30: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలకు సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించేందుకు మంగళవారం నిర్వహించాల్సిన సమావేశం వాయిదావేశారు. సాంకేతిక కారణాల వల్ల ఈ సమావేశం నిర్వహించ లేదని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలో రెండు రాష్ట్రాలకు సమ్మతమైన రోజున కృష్ణాబోర్డు సమావేశం నిర్వహిస్తామన్నారు.

01/31/2018 - 01:35

మేడారం, జనవరి 30: మంచుదుప్పటి పరచుకున్న మేడారం.. మాఘ పున్నమి వేళ పులకరిస్తోంది.. మహాతల్లుల జాతర ఘడియ సమీపించడంతో వీరత్వాన్ని పులుముకుని శివాలెత్తుతోంది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కీకారణ్యంలో రెండేళ్లకోమారు జరిగే సమ్మక్క- సారలమ్మ జాతర నేడు (బుధవారం) శ్రీకారం చుట్టుకోబోతున్నది.

Pages