S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/13/2018 - 03:15

హైదరాబాద్, మార్చి 12: కాంగ్రెస్ నాయకులు బీసీల జోలికొస్తే ప్రజాక్షేత్రంలో పాతరేస్తామని మంత్రులు జోగురామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై జరిగిన దాడిని మంత్రులు తీవ్రంగా ఖండించారు.

03/13/2018 - 03:14

హైదరాబాద్, మార్చి 12: బిఏసి సమావేశంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై జరిగిన దాడి అంశాన్ని ఎంఐఎం శాసనసభా పక్షం నాయకుడు అక్బరుద్ధీన్ ఒవైసీ ప్రస్తావించారు. శాసనసభ దేవాలయం, ప్రార్థనా మందిరాలంతా పవిత్రమైనవనీ, ఇలాంటి చోట భౌతిక దాడులను హేయమైన చర్యన్నారు. బాధ్యులు ఎవరైనా సమావేశాలు ముగిసే వరకు చర్య తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేసారు.

03/13/2018 - 03:13

హైదరాబాద్, మార్చి 12: ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఈ నెల 15 నుండి ఒంటిపూట బడులను నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జి కిషన్ తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఐచ్ఛిక సెలవులు వ్యక్తిగతంగా సవరణ చేస్తూ తిరిగి పాత విధానంలోనే పాఠశాలలు పరంగా తీసుకునే విధంగా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

03/13/2018 - 04:30

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్) సమావేశాలు మంగళవారం (13) నుంచి ఆంధ్ర ప్రదేశ్ కౌన్సిల్ హాలులో జరుగుతాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్నందున, అనేక ప్రభుత్వ భవనాల్లో ఆంధ్ర ప్రదేశ్ వాటాగా ఆ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల్లోనూ వాటాగా ఎపి ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి.

03/13/2018 - 03:12

హైదరాబాద్, మార్చి 12: రాష్ట్ర ప్రభుత్వ పద్దులపై భారత కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (కాగ్) తన ‘ఆడిట్ నివేదిక’ను సోమవారం రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు అందజేసింది.

03/13/2018 - 02:20

హైదరాబాద్, మార్చి 12: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్ రెండు స్థానాలకు బిసి అభ్యర్థులను నిలబెట్టడం గొప్ప విషయమని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తెలిపారు. రాజకీయంగా బిసిలకు ప్రాతినిధ్యం కల్పించినందుకు కృష్ణయ్య సోమవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

03/11/2018 - 03:32

చిత్రాలు..మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభలో పాల్గొనేందుకు శనివారం ట్యాంక్‌బండ్‌కు వస్తున్న టీజేఏసీ, ప్రజా సంఘాల కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు.
*సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు

03/11/2018 - 03:27

హైదరాబాద్, మార్చి 10: సంక్షేమం లక్ష్యంగా జాతీయ స్థాయిలో కొత్త ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్న సంకల్పానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మెరుగులు దిద్దుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గత మూడున్నరేళ్లలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియచేస్తూ, జాతీయ స్థాయిలో సమన్వయంతో ఇంతకంటే అద్భుతాలు సృష్టించవచ్చనే డాక్ట్రిన్ ఆఫ్ వేల్ఫేర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు.

03/11/2018 - 03:25

హైదరాబాద్, మార్చి 10: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఈ నెల 13న నిర్వహించతలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్‌కు సిపిఐ మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ 1994 నుంచి ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సిపిఐ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

03/11/2018 - 04:24

హైదరాబాద్: టిఆర్‌ఎస్‌లో పుట్టాను, టిఆర్‌ఎస్‌లోనే చస్తానని చెప్పిన రాష్ట్ర మంత్రి టి. హరీశ్‌రావు లోగడ కాంగ్రెస్‌లో చేరేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసింది వాస్తవం కాదా? అని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాజాగా బిజెపిలో కీలక నాయకులతో, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శితో మంతనాలు జరిపింది వాస్తవం కాదా? అని రేవంత్‌రెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు.

Pages