S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/18/2017 - 02:49

హైదరాబాద్, అక్టోబర్ 17: పట్టు చీరలకు ప్రసిద్థిగాంచిన గద్వాలలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయడానికి చేనేత, మున్సిపల్‌శాఖ మంత్రి కె తారకరామారావు హామీ ఇచ్చారు. ఇన్‌ఫ్రాస్టక్చర్ లీసింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నివేదిక ఆధారంగా క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గద్వాల మున్సిపాల్టీకి వారం రోజుల్లో రూ. 26 కోట్లు విడుదల చేయనున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు.

10/18/2017 - 02:48

హైదరాబాద్, అక్టోబర్ 17: రైతులకు 2016 ఖరీఫ్‌కు సంబంధించి పంటల బీమా మొత్తాన్ని ఈ నెల 20 లోగా చెల్లించాలని వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు. వివిధ బీమా సంస్థలతో మంగళవారం ఆయన సచివాలయంలో సమావేశమై పంటల బీమాకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

10/18/2017 - 02:47

హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్రంలో శాసనసభ సమావేశాలను కనీసం 25 రోజుల పాటు నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అనేక ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

10/18/2017 - 02:45

హైదరాబాద్, అక్టోబర్ 17: గ్యాంగ్ స్టర్ నరుూమ్ కేసులో సహచరుడు ఎన్ శ్రీ్ధర్ గౌడ్‌ను పోలీసులు డిటెన్షన్ చేయడం సరైన చర్యని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ షామీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. తన భర్తను డిటెన్షన్ చేయడం అసంబద్ధమంటూ శ్రీ్ధర్ గౌడ్ భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

10/18/2017 - 02:45

హైదరాబాద్, అక్టోబర్ 17: మల్బరీ తోటలు పెంచడంతో పాటు పట్టుపురుగుల పెంపకం చేపట్టిన రైతులకు చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టుగుడ్లను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో విక్రయించుకునేందుకు సహకారం అందించారని నిర్ణయించామన్నారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

10/17/2017 - 23:44

హైదరాబాద్, అక్టోబర్ 17: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన టిఆర్‌ఎస్ నాయకుడు అయూబ్ ఖాన్ కుటుంబానికి పార్టీ తరఫున రూ.30 లక్షల సహాయాన్ని అందజేసింది. బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి మహబూబ్ అలీ, మంత్రులు కె తారకరామారావు, పి మహేందర్‌రెడ్డి అయూబ్ ఖాన్ కుటుంబ సభ్యులకు చెక్కు అందజేసారు.

10/17/2017 - 23:43

హైదరాబాద్, అక్టోబర్ 17: పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం అంబర్‌పేట పోలీస్ ట్రైనింగ్ కళాశాల మైదానంలో రాచకొండ పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని అదనపు డిజిపి అంజనీకుమార్ ప్రారంభించారు. సుమారు ఐదు వందల మంది రక్తదానంలో పాల్గొన్నారు.

10/17/2017 - 23:42

హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్రంలోని ఐదు వ్యవసాయ మార్కెట్ కమిటీల గడువును మరో ఆరునెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కరీంనగర్ జిల్లా గోపాల్‌రావుపేట, భద్రాద్రి జిల్లా ఇల్లందు, రాజన్న సిర్సిల్లా జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటి, కామారెడ్డి జిల్లా గాంధారి మార్కెట్ కమిటి, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీల గడువును ఆరునెలల పాటు పొడిగించారు.

10/17/2017 - 23:42

హైదరాబాద్, అక్టోబర్ 17: ఈ నెల 23వ తేదీన హెచ్‌ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సదస్సు జరగుతుంది. సైబర్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాన్ని చర్చిస్తారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, రాష్ట్రప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. సైబర్ నేరాలు విసురుతున్న సవాళ్లపై ఈ సదస్సులో నిపుణులతో చర్చిస్తారు.

10/17/2017 - 23:41

హైదరాబాద్, అక్టోబర్ 17: విద్యార్థుల ఆత్మహత్యలు జరిగితే తీవ్రమైన చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను హెచ్చరించింది. కాలేజీలను ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.30 వరకూ మాత్రమే నిర్వహించాలని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఇంటర్ బోర్డు అధికారులు మంగళవారం నాడు సమావేశం నిర్వహించారు.

Pages