S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/17/2017 - 03:23

హైదరాబాద్, అక్టోబర్ 16: హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న కల్తీ ప్రొటీన్ ఉత్పత్తుల గుట్టు రట్టయింది. కల్తీ ఉత్పత్తులు చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో కల్తీ పాల ఉత్పత్తులు జరుగుతున్నట్టు పోలీసులు కనుగొన్నారు. భారీ స్థాయిలోనే కల్తీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

10/17/2017 - 03:22

హైదరాబాద్, అక్టోబర్ 16: విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ఎబివిపి ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు గతంలో ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిటీ, చక్రపాణి కమిటీ, రత్నకుమారి కమిటీలు చేసిన సూచనలు అమలుచేస్తే చాలని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు.

10/17/2017 - 03:21

హైదరాబాద్, అక్టోబర్ 16: జీవో 25ను సవరించి 45 శాతం పర్సంటేజీతో సంబంధం లేకుండా బిఇడి, డిఇడి అర్హత సాధించిన అభ్యర్ధులు అందరికీ 2017 డిఎస్సీలో అవకాశం కల్పించాలని ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భూక్యా చందూ నాయక్, మూడ్ శోభన్ నాయక్‌లు ప్రభుత్వాన్ని కోరారు.

10/17/2017 - 03:21

హైదరాబాద్, అక్టోబర్ 16: ఉమ్మడి 9 జిల్లా కేంద్రాల్లో రూ.166.40 కోట్ల వ్యయంతో సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సోమవారం మంత్రి జోగు రామన్న తన ఛాంబర్‌లో తెలంగాణ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

10/17/2017 - 03:17

హైదరాబాద్, అక్టోబర్ 16: టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండ రామ్‌ను నక్సల్ పేరిట ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ చుట్టూర నక్సల్స్ ఉన్నారంటూ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలపై విహెచ్ సోమవారం తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ మాట ఎందుకు చెప్పలేదని, అప్పుడు నక్సల్స్ కనిపించలేదా?

10/17/2017 - 03:17

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఇంటికో ఉద్యోగం ఇచ్చేంత వరకూ తమ పోరాటం ఆగదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. సోమవారం ఎస్‌ఆర్ ఫంక్షన్ హాలులో రాష్ట్ర నిరుద్యోగ జాక్ అధ్వర్యంలో నిరుద్యోగుల సమావేశం జరిగింది. నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేష్, గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్.

10/16/2017 - 03:56

గద్వాల, అక్టోబర్ 15: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాటు కృష్ణానది, భీమా నదుల నుండి వస్తున్న వరద నీటితో జూరాల వద్ద వరద ఉదృత్తి కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.410 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 1,18,000 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

10/16/2017 - 03:54

జడ్చర్ల, అక్టోబర్ 15: రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించే ధైర్యం ప్రతిపక్షాలకు ఎక్కడిదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని చంద్రాగార్డెన్స్‌లో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లికృష్ణారావుతో కలిసి ఆయన ఆయన మాట్లాడారు.

10/16/2017 - 03:54

నల్లగొండ, అక్టోబర్ 15: భారత దేశ సమగ్రాభివృద్ధి దిశగా పురోగమించేందుకు ఆరోగ్య భారత్ నిర్మాణానికి విహెచ్‌పి దేశ వ్యాప్త కార్యాచరణతో ముందుకెళ్తోందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రైవేటు వైద్యులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు.

10/16/2017 - 03:53

మహబూబ్‌నగర్, అక్టోబర్ 15: తొలి దశ తెలంగాణ ఉద్యమం 1969లో జరుగుతున్నప్పుడు అప్పట్లో ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్ దినపత్రికలు ఉద్యమానికి ఎంతగానో సహకారం అందించాయని, వాటిలో వచ్చిన వార్తల ఆధారంగానే తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ సమాచారం తెలిసేదని రాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

Pages