S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/21/2017 - 04:17

హైదరాబాద్, అక్టోబర్ 20: భద్రత ప్రమాణాలు, నిబంధనలు పాటించని 18 హాస్పిటళ్లపై కేసులు నమోదు చేయడంతో ఆయా హాస్పిటల్ యాజమాన్యాలు ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నాయి. నిబంధనలు పాటించనట్లు తేలిన హాస్పిటళ్లపై రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. ఇటీవల జరిగిన హాస్పిటళ్ల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అగ్నిమాపక శాఖ హాస్పిటళ్లపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తత్ర తనిఖీలు నిర్వహించింది.

10/21/2017 - 04:16

హైదరాబాద్, అక్టోబర్ 20: ముఖ్యమంత్రి మాటలే తప్ప, చేతల్లో రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. శుక్రవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ వచ్చి మూడున్నర సంవత్సరాలు అయిందని, తెలంగాణ అభివృద్ధి లక్ష్యాల సాధనలో తెరాస ఘోరంగా విఫలమైందని అన్నారు.

10/19/2017 - 01:04

హైదరాబాద్, అక్టోబర్ 18: దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది కోసం వినూత్న మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ యాప్‌ను బుధవారం సికిందరాబాద్‌లోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్ మధుసూదన్ ప్రారంభించారు. రైల్వే ఆపరేషన్స్, కమర్షియల్ విభాగంలో పనిచేసే సిబ్బందికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

10/19/2017 - 01:03

హైదరాబాద్, అక్టోబర్ 18: రాష్ట్రంలో ప్రభుత్వ నేతృత్వంలో 2017-18 సంవత్సరంలో 5.60 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని తయారు చేస్తున్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. 2017 ఖరీఫ్ సీజన్‌లో 3.20 లక్షల క్వింటాళ్లు, 2017-18 రబీ సీజన్‌లో 2.40 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు.

10/19/2017 - 01:02

హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ విభాగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, డాక్టర్ల కొరత చాలా తీవ్రంగా ఉందని, సరైన వౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు.

10/19/2017 - 01:01

హైదరాబాద్, అక్టోబర్ 18: కేంద్ర విద్యుత్ శాఖ, ఎన్‌టిపిసి సంయుక్తంగా విద్యుత్ వినియోగం అనే అంశంపై పాఠ శాల విద్యార్థులకు జాతీయ స్థాయి చిత్ర లేఖన పోటీలు నిర్వహిస్తున్నాయి. 4, 5, 6 తరగతులు (గ్రూప్ ఎ), 7, 8, 9 తరగతులు (గ్రూప్ బి)గా విభజించి అక్టోబర్ 30 లోగా పోటీలు నిర్వహించాలని ఆయా పాఠశాలలను రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో కోరాయి.

10/19/2017 - 00:56

రహదారుల అభివృద్ధికి అసెంబ్లీలో ముసాయిదా బిల్లు కీలక రోడ్ల ఆధునికీకరణకు రూ.600 కోట్లు
బ్యాంకుల కన్సార్టియం ద్వారా నిధుల సమీకరణ ఎస్‌ఒఎస్ ద్వారా మరో 2 వేల కి.మీ అభివృద్ధికి ప్రణాళికలు

10/19/2017 - 00:53

పోలీసు రేంజ్‌ల తరహాలో రెవెన్యూ రేంజ్‌లు ప్రతి మూడు జిల్లాలకు ఒకటి చొప్పున ఏర్పాటు
ఇన్‌చార్జిలుగా ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న సర్కారు

10/18/2017 - 23:37

హైదరాబాద్, అక్టోబర్ 18: నగర శివార్లలో ఏర్పాటు చేయనున్న ప్రెపిషన్ ఇంజనీరింగ్ (విడి భాగాల తయారీ) పార్కు కోసం భూ సేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్-ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ పార్కు ఏర్పాటుకు మేడ్చల్ జిల్లా, ఘట్‌కేసర్ మండలం మాదారంలో 300 ఎకరాలను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు.

10/18/2017 - 23:35

మృతుల ఒంటిపై నగలు ఉన్నాయి
సెల్‌ఫోన్లు మాయమయ్యాయి
ఐదుగురి మృతికేసు దర్యాప్తు ముమ్మరం
ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో సోదాలు..
కాల్ డేటా సేకరణలో పోలీసులు
ప్రభాకర్‌రెడ్డి ఎవరితోనూ
మాట్లాడేవాడు కాదు: ఇంటి యజమాని

Pages