S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/22/2017 - 03:09

హైదరాబాద్, ఏప్రిల్ 21: కౌశల్యాన్ని , పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు నూతన మార్గాల అనే్వషణలో ఉన్న అధ్యాపకుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ యుకెలోని యుసిఎల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌తో కలిసి ఒక ఉచిత ఆన్‌లైన్ కోర్సును అభివృద్ధి చేసింది. అత్యుత్తమ అధ్యాపకుడిగా మారడానికి ఇది ఎంతో దోహదం చేయనుంది.

04/21/2017 - 03:36

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్‌తో హర్యాణ-తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, చారిత్రక, భాషా సంబంధాలు పటిష్టమవుతాయని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం అన్నారు. భిన్న సంస్కృతులు కలిగి ఉన్న భారత దేశంలో రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ప్రధాన చేపట్టిన ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు.

04/21/2017 - 03:33

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలకు నిజాం వారసులను నలుగుర్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్వయంగా ఆహ్వానించడాన్ని బిజెపి తప్పుపట్టింది. ఈయన ధోరణి చూస్తుంటే బ్రిటిష్ వారినీ పిలిచేలా ఉన్నారని బిజెపి అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు ఎద్దేవా చేశారు. నిజాం వారసులను ఆహ్వానించాల్సిన అవసరం వందేళ్ల తర్వాత ఏం వచ్చిందని ఆయన నిలదీశారు.

04/21/2017 - 03:32

హైదరాబాద్, ఏప్రిల్ 20:వడగాడ్పులకు తెలంగాణ విలవిల్లాడుతోంది. ఈ ఏడాది ఇంతవరకు 42 మంది మృతి చెందినట్టు అంచనా. కరీంనగర్ జిల్లాలో 10 మంది, ఖమ్మం, నాగర్‌కర్నూలు జిల్లాల్లో ఐదుగురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు, రంగారెడ్డి, మంచిర్యాల, మహబూబ్‌నగర్, కామారెడ్డిలో ఇద్దరు చొప్పున, ఇతర జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు సమాచారం అందింది.

04/21/2017 - 03:31

హైదరాబాద్, ఏప్రిల్ 20: గ్రామ పంచాయితీల్లో రికార్డు స్థాయిలో పన్నులు వసూలు అయినట్టు కమిషనర్ తెలిపారు. 90శాతం వరకు పన్నులు వసూలు అయినట్టు తెలిపారు. 411.10 కోట్ల రూపాయల పన్నులు వసూలు అయ్యాయి. ఇంటి పన్ను, ప్రకటన కర్తల నుండి రావలసిన పన్నులు, వ్యవసాయ ఉత్పత్తులపై వచ్చే పన్నులు, నీటి పన్నులు, వర్తక లైసెన్స్‌ల పన్ను మొత్తం 462.49 కోట్ల రూపాయలని అంచనా వేశారు. దీనిలో 411.10 కోట్లు వసూలు అయ్యాయి.

04/21/2017 - 03:31

హైదరాబాద్, ఏప్రిల్ 20: మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం చేసే వర్క్ ఏజెన్సీలను 60సి నిబంధన కింద తొలగించడానికి కూడా వెనుకాడమని గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్ ఇన్ చీఫ్ సరేందర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం ఎర్రమంజిల్‌లోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో అన్ని జిల్లాల ఎస్‌ఇ, ఈఈలతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించి పైప్ లైన్ పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు.

04/21/2017 - 03:30

హైదరాబాద్, ఏప్రిల్ 20: చెరకు రైతుల ఖాతాల్లోకే దాని అమ్మకం పన్నును నేరుగా బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ షుగర్, కేన్ కమిషనర్ భద్రు మల్లోత్ గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. చెరకు అమ్మకం పన్నును దాదాపు 16 సంవత్సరాల నుండి చెరకు ధరతో కలిపి ఇస్తున్నారు. టన్నుపై 60 రూపాయలుగా చెరకు అమ్మకం పన్ను ఉంటుంది. ఈ పన్ను వాస్తవంగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సి ఉంది.

04/21/2017 - 03:29

హైదరాబాద్, ఏప్రిల్ 20: గజ్వేల్ ప్రాంత అభివృద్ధి సంస్థ (గడా) ప్రత్యేక అధికారిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎం. హనుమంతప్పను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్. మీనా పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. గజ్వెల్ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ అథారిటీని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

04/21/2017 - 02:54

వికారాబాద్, ఏప్రిల్ 20: భారతదేశంలో కష్టం చేసింది కాంగ్రెస్ అయితే లాభం పొందుతున్నది మాత్రం బిజెపి అని పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బడుగు, బలహీన వర్గాల గర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

04/21/2017 - 02:51

హైదరాబాద్, ఏప్రిల్ 20: ధాన్యం సేకరణపై ప్రతి రోజూ సమీక్షించాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. గురువారం కొందరు కలెక్టర్లతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ధాన్యం క్రయ విక్రయాల్లో తలెత్తుతున్న ఇబ్బందులపై చర్చించారు. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మార్గదర్శకాలను ఇంతకు ముందే వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించినట్టు చెప్పారు.

Pages