S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/27/2017 - 04:26

పెన్‌పహాడ్, ఫిబ్రవరి 26: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా మహాజన పాదయాత్ర కొనసాగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన ఆదివారం సూర్యాపేట మండల పరిధిలోని అన్నారం, అనంతారం, సింగారెడ్డిపాలెం గ్రామాలకు యాత్ర చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు.

02/27/2017 - 04:25

సిద్దిపేట, ఫిబ్రవరి 26 : ప్రవాస భారతీయులకు భద్రత కల్పించేందుకు కేంద్రం జోక్యం చేసుకొని అమెరికా వెళ్లి ప్రశాంత వాతావరణం వచ్చేలా చర్య లు తీసుకోవాలని ఏఐసిసి కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హ నుమం తరావు డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆనాలోచిత రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగా ప్రవాస భారతీయులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు.

02/27/2017 - 04:24

నల్లగొండ, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్రం లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతినొందిన యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి (యాదగిరిగుట్ట) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వరకు 11 రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తరలివచ్చే భక్తుల రద్దీ అంచనాల మేరకు అవసరమైన ఏర్పాట్లను ఃదేవస్థానం చేపట్టింది.

02/27/2017 - 04:23

అర్వపల్లి, ఫిబ్రవరి 26: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఫణిగిరి బౌద్ధక్షేత్రం అతి పవిత్రమైందని నేపాల్ దేశానికి చెందిన ప్రపంచ బుద్ధిష్టు, పరిశోధకుడు ఆనంద్‌కుమార్ శేరి అన్నారు. ఆదివారం నాగారం మండల పరిధిలోని బౌద్ధక్షేత్రాన్ని 16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ బౌద్ధ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు.

02/27/2017 - 04:06

హైదరాబాద్, ఫిబ్రవరి 26:తెలంగాణలోని 11 విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని వెంటనే ధర్నాలు మానుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. 11విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకులు ఆదివారం రోజున కడియం శ్రీహరిని కలిసి తమ సమస్యలు వివరించారు.

02/27/2017 - 04:04

హైదరాబాద్, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్రంలో పేదరికంలో మగ్గుతున్న బ్రాహ్మణులకు సంక్షేమ ఫలాలు అందిస్తామని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి తెలిపారు. పరిషత్ నేతృత్వంలో ఆదివారం బాలాజీ భవన్‌లో జరిగిన బ్రాహ్మణ పరిషత్ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులకు చేయూత ఇవ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వివిధ చర్యలు తీసుకున్నారన్నారు.

02/27/2017 - 04:01

హైదరాబాద్, ఫిబ్రవరి 26: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే నగరంలోని గోషామహల్, అంబర్‌పేట్ ప్రాంతాల్లో ఇఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణంలో జాప్యం జరుగుతున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా 17ఇఎస్‌ఐ డిస్పెన్సరీలు, ఐదు ఆసుపత్రులు నిర్మించేందుకు పరిపాలనాపరమైన ఆమోదం ఇచ్చామని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

02/27/2017 - 04:00

నర్సంపేట, ఫిబ్రవరి 26: మిర్చి పంటకు మద్దతు ధర 20వేల రూపాయలు ప్రకటించాలని, పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకుడు కడియాల వీరాచారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

02/27/2017 - 04:00

హైదరాబాద్, ఫిబ్రవరి 26: ‘కుడిచేత్తో ఇచ్చి, ఎడమచేత్తో లాక్కున్న చందంగా’ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవహరిస్తున్నారని బిజెపి శాసనసభా పక్ష నాయకుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చి, ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. సింగరేణి కార్మికుల క్రమబద్ధీకరణ వ్యవహారంపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన కెసిఆర్‌కు సవాల్ విసిరారు.

02/27/2017 - 03:59

హైదరాబాద్, ఫిబ్రవరి 26: శివరాత్రి పండుగ రోజు కురవి వెళ్లిన సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు డోర్నకల్ నియోజకవర్గంలో వౌలిక వసతుల కోసం ప్రకటించిన మేరకు రూ.21.75 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులను మంజురు చేశారు.

Pages