S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/28/2017 - 04:13

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌పై హైదరాబాద్ డబీర్‌పుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణలోని మదర్సాలు, శిశుమందిరాలపై దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ బచావో తహరిక్ (ఎంబిటి) నేత అమ్జదుల్లా ఖాన్ డబీర్‌పుర పిఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు.

02/28/2017 - 04:12

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్‌డి అడ్మిషన్లకు ఎంపికైన అభ్యర్ధుల పేర్లను సోమవారం రాత్రి విడుదల చేసింది. 2013-14 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఈ ఫలితాల విడుదలపై సోమవారం నాడు పెద్ద హైడ్రామానే నడిచింది.

02/28/2017 - 03:38

హైదరాబాద్, ఫిబ్రవరి 27: జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో కోట్లాదిరూపాయలు ముడుపులు తీసుకుని ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణకు తాను కట్టుబడి ఉన్నానని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అవినీతిని నిరూపించేందుకు తాను చర్చకు ఎక్కడకు పిలిచినా వస్తానని అన్నారు.

02/28/2017 - 03:37

హైదరాబాద్, ఫిబ్రవరి 27: నిరుద్యోగ నిరసన ర్యాలీని ప్రభుత్వం అడ్డుకున్నందున, మున్ముందు కొత్త పద్ధతుల్లో ఉద్యమాలు చేపట్టాలని తెలంగాణ జెఎసి నిర్ణయించింది. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండ రామ్ అధ్యక్షతన సోమవారం టి.జెఎసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో 31 విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.

02/28/2017 - 03:35

హైదరాబాద్, ఫిబ్రవరి 27: నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసే సమర్థత మీకు లేదని టిఆర్‌ఎస్ శ్రేణులను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ పార్టీని నిందించడం సరికాదని అన్నారు.

02/28/2017 - 03:34

హైదరాబాద్, ఫిబ్రవరి 27: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలో దండుమల్కారంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య (టిఐఎఫ్)-గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. జర్మనీకి చెందిన జిఐజడ్ సంస్థ సహకారంతోదేశంలోనే కాలుష్య రహిత పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

02/28/2017 - 03:34

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 23.25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ సోమవారం జీఓ (జీఓ ఆర్‌టి నెంబర్ 151) జారీ చేసింది. ప్రణాళికాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

02/28/2017 - 03:33

హైదరాబాద్, ఫిబ్రవరి 27: అసెంబ్లీ పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ (పియుసి) మంగళవారం నగర శివారులోని స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్‌ఇజెడ్)లను పరిశీలించనున్నది. ఎస్‌ఇజెడ్‌లపై దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ కమిటీ మంగళవారం ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమై, అక్కడి నుంచి ఎస్‌ఇజెడ్‌ల పరిశీలనకు బయలుదేరనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్ తెలిపారు.

02/28/2017 - 03:32

హైదరాబాద్, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో విద్యా, వ్యాపార అవకాశాలను పరిశీలించేందుకు అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రానికి చెందిన బృందం మూడు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చింది. ఈ బృందం సోమవారం ఐటి శాఖ మంత్రి తారక రామారావును కలిసింది. విద్యా, వ్యాపార అవకాశాల పరిశీలనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ, టి-హబ్, జినోమ్ వ్యాలీ, ఇక్రిసాట్ వంటి సంస్థలను ఈ బృందం సందర్శించనుంది.

02/27/2017 - 04:28

కరీంనగర్, ఫిబ్రవరి 26: దేశంలో బిజెపి ప్రభు త్వం అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయిందని, త్వరలోనే కాంగ్రెస్ ఖేల్ ఖతం కాబోతుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు జోష్యం చెప్పారు.

Pages