S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/28/2016 - 03:23

నిజామాబాద్, అక్టోబర్ 27: నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శనివారం మూసివేయనున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ గత జూలై 1వ తేదీన బాబ్లీకి చెందిన 14గేట్లను ఎత్తివేసి దిగువకు నీరు వదిలారు.

10/28/2016 - 03:13

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను నెలకొల్పామని, ఇక్కడ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన రోగులకు సత్వరమే వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం ఇక్కడ పదవ ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ కాంగ్రెస్ సభలను ఆయన ప్రారంభించారు.

10/28/2016 - 03:11

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం, అభ్యున్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని తిరుపతి బ్రాహ్మణ సమాజం పేర్కొంది. ఈ మేరకు తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్ష, కార్యదర్శులు కెవి రంగానాథన్, కొత్తపల్లి అజయ్‌కుమార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.

10/28/2016 - 03:11

హైదరాబాద్, అక్టోబర్ 27: ‘ఇల్లు అమ్మేవాళ్లు అమ్ముతున్నారు. కొనే వాళ్లు డబ్బులిచ్చి కొంటున్నారు, మధ్యలో రిజిస్ట్రేషన్ చేసిన వారికి లంచం ఎందుకు? దీన్ని నివారించలేమా? ఏం చేస్తే బాగుంటుంది’ అని స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావువెలిబుచ్చిన అభిప్రాయం ఇది. వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతిని తగ్గించే అంశంపై సిఎం అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తున్నారు.

10/28/2016 - 03:08

హైదరాబాద్, అక్టోబర్ 27: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి వెళ్లి ఎండగట్టాలని, విబేధాలు విస్మరించి సమిష్టిగా పోరాడుదామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ కార్యక్రమంపై నిర్వహించిన సదస్సులకు జనం నుంచి వస్తున్న స్పందన విశేషంగా ఉందని, ఇదే ఊపుతో జనంలోకి వెళ్లాలని టిపిసిసి నేతలు నిర్ణయించారు.

10/28/2016 - 03:04

హైదరాబాద్, అక్టోబర్ 27: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎన్నికల ముందు పేద, మధ్య తరగతి ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చి, ఎన్నికల తర్వాత ఇళ్ల నిర్మాణం చేయకుండా మోసం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బిజెపి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతుందని అన్నారు.

10/28/2016 - 03:04

హైదరబాద్, అక్టోబర్ 27: కయాంత్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అప్రమత్తం చేశారు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల తెలంగాణలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. మార్కెట్ కార్యదర్శులు, సిబ్బంది మార్కెట్‌లో అందుబాటులో ఉండాలని కోరారు. రైతుల సరుకులను షెడ్‌లలో పోయించాలని చప్పార.

10/27/2016 - 08:48

హైదరాబాద్, అక్టోబర్ 26: వాస్తు పేరిట సచివాలయంలోని భవనాలను కూల్చి వేయడానికి చర్యలు చేపడితే తాను కోర్టుకు వెళతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. వాస్తు బాగాలేదని సచివాలయంలోని భవనాలను కూల్చి వేసి తిరిగి 350 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భావించడం భావ్యం కాదని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

10/27/2016 - 08:47

మహబూబ్‌నగర్, అక్టోబర్ 26: మహబూబ్‌నగర్ జిల్లాలోని తెరాసలో నివురుగప్పిన నిప్పులా ఉన్నా విభేదాలు ఒక్కొటి బయటపడుతున్నాయి. బుధవారం జిల్లా పరిషత్ సమావేశానికి విచ్చేసిన ఎంపి జితేందర్‌రెడ్డి మంత్రులు, జడ్పీ చైర్మన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

10/27/2016 - 08:47

మెదక్, అక్టోబర్ 26: నూతన జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్ జిల్లా ప్రత్యేకంగా ఏర్పడటంతో ప్రభుత్వ సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారుల నిశిత పరిశీలన ప్రారంభమైంది. ఈ క్రమంలో తనకు బదులు బినామీతో పనిచేయన్న ఓ ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగుచూసింది. దీంతో సుక్లాల్‌పేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సిద్దిరెడ్డిని సస్పెండ్ చేస్తూ మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారిణి జి.రేణుకాదేవి బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

Pages