S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/03/2016 - 17:53

హైదరాబాద్‌ : మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు భూసేకరణపై బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి చెంపపెట్టు అని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. రైతులు, కూలీలకు ఈ తీర్పు ఎంతో మేలు చేకూరుస్తుందని అన్నారు. న్యాయస్థానం రైతులను కాపాడే విధంగా తీర్పు ఇచ్చిందని అన్నారు.

08/03/2016 - 17:50

హైదరాబాద్‌ : ఈనెల 7న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ కోసం బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ తొలిసారిగా రాష్ర్టానికి వస్తున్నారని, ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభను జయప్రదం చేయానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నట్లు బీజేపీ నేత కిషనరెడ్డి చెప్పారు. పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు సభకు రావాలని ఆయన కోరారు.

08/03/2016 - 17:45

హైదరాబాద్: రైతుల నుంచి నేరుగా భూమి కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.123, 124ను బుధవారం హైకోర్టు కొట్టేసింది. జహీరాబాద్ వ్యవసాయ కూలీలు ఈ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైతులతోపాటు కూలీలకు పరిహారం ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం విస్మరించిందని హైకోర్టు పేర్కొంది.

08/03/2016 - 16:53

హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీలకు ఈ నెల 28న శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. పార్టీ నేతలు జైరాం రమేష్‌, కొప్పులరాజు పాటు మేధావులతో శిక్షణ తరగుతులు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.

08/03/2016 - 16:05

హైదరాబాద్‌ : కృష్ణా పుష్కరాలకు 12 రోజుల పాటు ప్రతిరోజూ 200 పైగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపారు. తెలంగాణలో మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలు, ఏపీలో శ్రీశైలం, విజయవాడ ప్రాంతాలకు మహత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలిపారు. 50 మంది ప్రయాణికులు ఒకేసారి వెళ్లాలనుకుంటే వారి కోసం ప్రత్యేక బస్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

08/03/2016 - 15:27

హైదరాబాద్‌: తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 1164 పోస్టులు, గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో 630 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అనుమతించిన 758 పోస్టులకు అదనంగా తాజా ప్రకటనను ప్రభుత్వం వెలువరించింది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు.

08/03/2016 - 14:46

హైదరాబాద్: అనుమతులు లేకుండా వేసిన లే అవుట్లలో స్థలాలు, భవనాలు కొనవద్దని అధికారులు హెచ్చరించారు. శంషాబాద్ మండలం మదన్‌పల్లిలో వెలసిన అక్రమ వెంచర్లపై అధికారులు బుధవారం దాడులు చేశారు. అక్రమ నిర్మాణాలను తొలగించారు. అనుమతులు లేని వెంచర్లలో పెట్టుబడులు పెట్టి మోసపోరాదని వారు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

08/03/2016 - 12:56

కరీంనగర్: మంత్రి ఈటల రాజేందర్‌‌ కాన్వాయ్‌‌లో బుధవారం ప్రమాదం జరిగింది. వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒక కారు ధ్వంసమైంది. మంత్రి నిజామాబాద్ పర్యటనకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

08/03/2016 - 11:45

హైదరాబాద్: నగరంలోని తార్నాకలో ఆర్టీసీ ఆస్పత్రిని ఆ సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బుధవారం తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. వైద్యసేవలు, సౌకర్యాల తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రోగులకు మెరుగైన సేవలందించాలని వైద్యులకు సూచించారు.

08/03/2016 - 07:52

హైదరాబాద్, ఆగస్టు2: తెలంగాణలో అధికార పక్షంపై దాడికి బలమైన అస్త్రాల కోసం విపక్షం ప్రయత్నిస్తోంది. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచి పోయినా అధికారపక్షంపై పోరాడేందుకు విపక్షాలకు బలమైన ఆయుధాలు కనిపించడం లేదు. చివరకు భూసేకరణ వివాదంపై విపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. అయితే అధికార పక్షం వ్యూహాత్మకంగా రైతులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ విపక్షాలకు ఆ అవకాశం కూడా దక్కకుండా చేస్తోంది.

Pages