S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/04/2016 - 18:20

హైదరాబాద్‌ : జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికైన వెంకటయ్యను గురువారం సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ సన్మానించి రూ. 1,11,111ల చెక్కును బహుమతిగా అందజేశారు. వెంకటయ్య యోగ క్షేమాలను, కుటుంబ నేపథ్యాన్ని మంత్రి తెలుసుకున్నారు.

08/04/2016 - 18:10

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మెదక్‌ జిల్లా జోగిపేటకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన షేక్‌ షకీరాను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆరుగురు విద్యార్థులను కోల్‌కతాలకు తీసుకెళ్లి వీరు ప్రశ్నాపత్రం అందజేసినట్లు సీఐడీ గుర్తించింది.

08/04/2016 - 16:18

హైదరాబాద్ : భూసేకరణకు ఉద్దేశించిన 123జీవోను హైకోర్టు కొట్టివేయడంతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, న్యాయనిపుణులతో సీఎం కేసీఆర్ భేటీ జరుగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై కేసీఆర్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

08/04/2016 - 15:36

హైదరాబాద్: ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూ సేకరణ విషయమై జారీ చేసిన 123 జీవోను హైకోర్టు కొట్టివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను తెలంగాణ సర్కారు అనే్వషిస్తోంది. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ గురువారం ఇక్కడ పలువురు మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లాలా? లేదా? అన్న విషయమై కెసిఆర్ సమాలోచనలను జరుపుతున్నారు.

08/04/2016 - 15:32

హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఎపికి అయిదేళ్లు కాదు, పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ బిజెపి నేతలు గొప్పగా మాట్లాడారని, నేడు హోదా గురించి అడిగితే కాదంటున్నారని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. ఆయన గురువారం ఉదయం మీడియాతో కాసేపు మాట్లాడుతూ బిజెపి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

08/04/2016 - 14:41

హైదరాబాద్ : పోలీసులతో సమానంగా హోంగార్డులు పనిచేస్తున్నా 30శాతం తక్కువ జీతాలు ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల్లో హోంగార్డుల జీతాలు పెంచాలని బీజేపీ నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హోంగార్డుల సమస్యలపై గవర్నర్‌కు గురువారంకిషన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

08/04/2016 - 12:11

హైదరాబాద్: ప్రధాని మోదీ ఈనెల 7న ఒకరోజు పర్యటనకు వస్తున్నందున పలుచోట్ల భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎస్‌పిజి (ప్రత్యేక భద్రతా దళం) అధికారులు గురువారం నగరానికి చేరుకున్నారు. గజ్వేల్, రామగుండం, హైదరాబాద్‌లో ప్రధాని పర్యటన ఉన్నందున ఈ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మోదీ బహిరంగ సభ జరిగే ఎల్‌బి స్టేడియంను ఎస్‌పిజి అధికారులు పరిశీలించారు.

08/04/2016 - 12:10

హైదరాబాద్: ప్రధాని హోదాలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ బిజెపి నేతలు ఎల్‌బి స్టేడియంలో గురువారం సుదర్శనయాగం నిర్వహించారు. ఈనెల 7న వస్తున్న మోదీ గజ్వేల్‌లో మిషన్ భగీరథను, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎల్‌బి స్టేడియంలో జరిగే సభలో పాల్గొంటారు.

08/04/2016 - 12:09

హైదరాబాద్: రోడ్డుపక్కన ఆగిఉన్న లారీని మార్బుల్స్ లోడ్‌తో వెళుతున్న వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు కూలీలు మరణించారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట వద్ద రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్ క్యాబిన్‌కు, మార్బుల్ రాళ్లకు మధ్య ఇరుక్కుని ఇద్దరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను సికిందరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

08/04/2016 - 12:09

మెదక్: ఓ కుటుంబ సభ్యులంతా నిద్రిస్తుండగా గురువారం తెల్లవారు జామున ఇంటిపై కిరోసిన్ పోసి కొందరు దుండగులు నిప్పంటించారు. జిన్నారం మండలం ఐడిఎ బొల్లారంలో ఈ ఘటన జరిగింది. మంటలు వ్యాపించడంతో అతి కష్టమీద తలుపులు తీసుకుని కుటుంబ సభ్యులు బయటపడ్డారు. ఇంటి యజమాని సుంకయ్య, అతని భార్య సునీత, పిల్లలు వీరేష్, క్రిష్, దాన్యాలు గాయపడ్డారు. వీరిని సికిందరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Pages