S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/04/2016 - 08:11

హైదరాబాద్, ఆగస్టు 3: దేవాదుల ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద నిధులు ఇచ్చిందని, వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తి చేయకపోతే కేంద్రం వద్ద తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు. ఆరు నూరైనా వచ్చే ఏడాదిలోగా దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు.

08/04/2016 - 08:10

గద్వాల, ఆగస్టు 3: వారం రోజులుగా ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరదనీటి ఉధృతి పెరిగింది. బుధవారం ఆల్మట్టి ప్రాజెక్టు 26 గేట్లు అర సెంటీమీటర్ ఎత్తుకు, నారాయణపూర్ డ్యాం 17 గేట్లు ఒక మీటర్ ఎత్తుకు తెరిచి దిగువకు జూరాల వైపు నీటిని వదులుతున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు.

08/04/2016 - 08:08

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, అలవెన్స్‌లు సకాలంలో చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల చెల్లింపులను నిలిపివేసినట్టు వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది.

08/04/2016 - 08:07

నిజామాబాద్, ఆగస్టు 3: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన ప్రధాన కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీని సందర్శించి ప్రధాన కాల్వల ద్వారా లాంఛనంగా నీటిని విడుదల చేశారు.

08/04/2016 - 08:01

హైదరాబాద్, ఆగస్టు 3: అపోలో ఆసుపత్రి పరిధిలో ఉన్న కేన్సర్ మేనేజిమెంట్ వౌలిక సదుపాయాల వ్యవస్ధ విభాగాలను ఇకపై అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లుగా మారుస్తున్నట్లు అపోలో ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్‌కొత్తా, అహ్మదాబాద్, బిలాస్‌పూర్, బెంగళూరు, మధురైలో అపోలో ఆసుపత్రుల ఇనిస్టిట్యూట్‌ల మధ్య అనుసంధానం నెలకొల్పనున్నట్లు ఆయన చెప్పారు.

08/04/2016 - 07:51

చిట్యాల, ఆగస్టు 3: పారిశ్రామిక రంగం కోసం తెరాస ప్రభుత్వ అనుకూలంగా ఉన్నప్పటికీ పరిశ్రమలను నెలకొల్పే ప్రాంతాల్లో ప్రజాభీష్టం మేరకే వాతావరణ కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి పరిశ్రమలకు అనుమతులుండవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

08/04/2016 - 07:51

హైదరాబాద్/బేగంపేట, ఆగస్టు 3: సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాతృమూర్తికి అత్యంత క్లిష్టమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

08/04/2016 - 07:49

హైదరాబాద్, ఆగస్టు 3: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రావడం వల్ల అభివృద్ధికి మరింత ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంతి బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ బుధవారం ఎన్‌టిపిసి, రామగుండం ఎరువుల ప్రాజెక్టు, రైల్వేల ఉన్నతాధికారులతో సమీక్షించారు.

08/04/2016 - 07:48

కడెం, ఆగస్టు 3: ఆదిలాబాద్ జిల్లాలో అతి పెద్దదైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు రిజర్వాయర్‌లో ఇన్‌ఫ్లో వరదనీరు వేలాది క్యూసెక్కులుగా వచ్చి చేరుతుండడంతో కడెం ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.

08/04/2016 - 07:47

కరీంనగర్, ఆగస్టు 3: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకు జిల్లా అంతటా వానలు కురువగా, హుజురాబాద్‌లోని గ్రామ పంచాయితీ కార్యాలయ భవనం కూలిపోయింది. ఎగువ ప్రాంతంలో నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారింది.

Pages