S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/29/2016 - 18:12

హైదరాబాద్: మెట్రో నిర్మాణం కారణంగా వినాయకుని విగ్రహలు ఈసారి 15 అడుగుల ఎత్తు మాత్రమే ఉండేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సూచించారు. హైకోర్టు ఆదేశాలను గణేశ్ ఉత్సవ సమితికి ఈ సందర్భంగా వివరించారు. విగ్రహాల తయారీలో మట్టి, సాధారణ రంగులు వాడాలని వారికి విజ్ఞప్తి చేశారు. బుధవారం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితో ఆయన భేటీ అయ్యారు.

06/29/2016 - 17:31

హైదరాబాద్: ఇంటిపన్ను తగ్గించేందుకు నాలుగు వేల రూపాయల లంచం తీసుకున్న టాక్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌ను ఎసిబి అధికారులు బుధవారం వలపన్ని పట్టుకున్నారు. జిహెచ్‌ఎంసి అబిడ్స్ ఏరియాలో టాక్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ ముషీరాబాద్ (బోలక్‌పూర్)కు చెందిన ఓ ఇంటి యజమాని నుంచి లంచం తీసుకున్నాడు.

06/29/2016 - 17:30

హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాతే తెలంగాణలో టీచర్ల నియామకానికి చర్యలు చేపడతామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బుధవారం మీడియాకు తెలిపారు. టీచర్ల కొరతను తీర్చేందుకు 9,335 మంది విద్యావాలంటీర్లను నియమిస్తామన్నారు.

06/29/2016 - 17:29

హైదరాబాద్: ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను తలకు చుట్టుకుని సరదాగా ఆటాడుకుంటున్న ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన కూకట్‌పల్లి సమీపంలోని నిజాంపేటలో బుధవారం జరిగింది. ప్లాస్టిక్ కవర్ తలకు బిగుసుకుపోవడంతో ఊపిరాడక నాలుగేళ్ల శ్రీయాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే తల్లిదండ్రులను బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

06/29/2016 - 17:28

హైదరాబాద్: తెలంగాణలో రెండువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగినా మనస్తాపం చెందని సిఎం కెసిఆర్ ఇపుడు హైకోర్టు విభజన కోసం దిల్లీలో దీక్ష చేస్తాననడం విడ్డూరంగా ఉందని బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్‌రావు విమర్శించారు.

06/29/2016 - 17:26

హైదరాబాద్: కెసిఆర్, చంద్రబాబుల మధ్య ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వివాదాల మాదిరి హైకోర్టు విభజన సమస్య ఎందుకు కొలిక్కిరాలేదని కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు విభజన గురించి దిల్లీలో ఆందోళన చేస్తామంటున్న కెసిఆర్ ఎపి ముఖ్యమంత్రితో మాత్రం ఎందుకు మాట్లాడడం లేదన్నారు. హైకోర్టు విభజన తర్వాతే జడ్జిల కేటాయింపు జరగాలని, ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతంలోనే నియమించాలన్నారు.

06/29/2016 - 17:25

హైదరాబాద్: నమ్మకంగా మాట్లాడి కొందరి నుంచి ఏభై లక్షల రూపాయల వరకూ అప్పుచేసి ఓ కిరాణా వ్యాపారి కుటుంబంతో పాటు ఉడాయించిన ఘటన నగరంలోని చిక్కడపల్లి వివేక్‌నగర్‌లో వెలుగు చూసింది. కిరాణా షాపు నడిపే భూపతి రామకృష్ణ తనకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయని స్థానికులను నమ్మించి 50 లక్షల రూపాయల వరకూ అప్పు చేశాడు. ఈనెల 14 నుంచి అతను కనిపించకుండా పోయినట్లు బాధితులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.

06/29/2016 - 14:58

హైదరాబాద్: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యానగర్ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాస్ ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. ఏడున్నర తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకుపోయారు.

06/29/2016 - 14:55

హైదరాబాద్: న్యాయమూర్తులపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలో బుధవారం ఉదయం లాయర్లు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఎల్బీనగర్‌లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు న్యాయవాదులను ఆందోళన విరమింపజేసేందుకు యత్నిస్తున్నారు.

06/29/2016 - 14:21

హైదరాబాద్: రాబోయే విజయదశమి (దసరా) నాటికి కొత్త జిల్లాలు ఆవిర్భవించాలని సిఎం కెసిఆర్ బుధవారం ఇక్కడ జరిగిన తెరాస శాసనసభా పక్షం సమావేశంలో అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 14 కొత్త జిల్లాలకు ప్రతిపాదనలు వచ్చాయని, కొత్తగా 73 మండలాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Pages