S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/30/2016 - 15:26

నల్గొండ: తమను పరీక్షలకు అనుమతించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు కళాశాల భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఈ ఘటన జరిగింది. తమకు కళాశాల యాజమాన్యం హాల్‌టిక్కెట్లు ఇవ్వలేదని ముగ్గురు విద్యార్థులు భవనంపైకి ఎక్కి కిందకు దూకేస్తామని బెదిరించారు. సమాచారం తెలిశాక పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని ఆ విద్యార్థులను కిందకు రప్పించారు.

04/30/2016 - 14:07

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై మంత్రి కెటిఆర్ మితిమీరిన అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేస్తానని కెటిఆర్ అనడం అహంకారానికి పరాకాష్ట అన్నారు. రాజకీయ దాహంతో వ్యవహరిస్తున్న సిఎం కెసిఆర్‌కు తెలంగాణలో నీటికష్టాలు, కరవు పరిస్థతులు పట్టవని విమర్శించారు.

04/30/2016 - 14:04

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద శనివారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపఎన్నికలపై ఆసక్తి చూపే సిఎం కెసిఆర్ తాగునీటి సమస్యపై కొంత శ్రద్ధ చూపినా జనం సమస్యలు గట్టెక్కేవని యూత్ కాంగ్రెస్ నేతలు అన్నారు. ధర్నా కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

04/30/2016 - 12:38

హైదరాబాద్: నగరంలోని మోతీనగర్ లలితా టవర్ వద్ద శనివారం ఉదయం ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి, క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న అయిదుగురు బుకీలను అరెస్టు చేశారు. వీరి నుంచి 5.40 లక్షల రూపాయల నగదు, ల్యాప్‌టాప్, 15 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

04/30/2016 - 12:37

వరంగల్: ఎండిపోయిన తాటిచెట్టు వారిపాలిట మృత్యుదేవతగా ఎదురైంది. ఆరుబయట నిద్రిస్తున్న వారిపై తాటిచెట్టు విరిగిపడడంతో ముగ్గురు మరణించిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి స్టేషన్ ఘనపూర్ మండలం సిర్పూర్‌గుట్ట వద్ద జరిగింది. ఈ గుట్టపై రాళ్లు కొట్టేందుకు గోదావరిఖని నుంచి ఇటీవల కొంతమంది కూలీలు వచ్చి గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.

04/30/2016 - 12:36

ఆదిలాబాద్: నకిలీ ఎటిఎం కార్డులను తయారుచేసి జిల్లాలో పలు ఎంటిఎం కేంద్రాల్లో నగదు చోరీ చేసిన హర్యానాకు చెందిన రెహ్మాన్ అనే ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని ముఠాకు చెందిన మరో నలుగురిని కూడా అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. వీరి నుంచి నకిలీ ఎటిఎం కార్డులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

04/30/2016 - 08:09

హైదరాబాద్, ఏప్రిల్ 29: భాగవతాన్ని తెలుగులో రచించిన బమ్మెర పోతన్న గ్రామమైన బమ్మెర, బసవ పురాణం వంటి ప్రసిద్ధ గ్రంధాలను రచించిన పాల్కురికి సోమనాథుడి గ్రామమైన పాలకుర్తి, వాల్మిడి గ్రామాలను కల్చరల్ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి పర్చాలని నిర్ణయించినట్టు పర్యాటకశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ తెలిపారు. ఈ మూడు గ్రామాలు కూడా వరంగల్ జిల్లాలోనే ఉన్నాయి.

04/30/2016 - 08:07

హైదరాబాద్, ఏప్రిల్ 29: సచివాలయంలో పదవీ బాధ్యతల స్వీకరణలతో శుక్రవారం సందడి నెలకొంది. మంత్రుల శాఖలలో ఇటీవల జరిగిన చేర్పులు, మార్పుల మేరకు కొత్తగా అప్పగించిన శాఖల బాధ్యతలను మంత్రులు చేపట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, సహకారశాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి పదవీ బాధ్యతలను చేపట్టారు.

04/30/2016 - 08:07

హైదరాబాద్, ఏప్రిల్ 29: ఈ ఏడాది జూన్ వరకు దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని దత్తాత్రేయ నవగ్రహ ఆలయం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి ఈ మేరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిందిగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.

04/30/2016 - 08:06

హైదరాబాద్, ఏప్రిల్ 29: రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన లాకప్ డెత్‌పై జుడిషియల్ మెజిస్ట్రేట్‌చే విచారణ జరిపించాలని హైకోర్టు జస్టిస్ రామలింగేశ్వర రావు శుక్రవారం ఆదేశించారు. 2007లో మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఇబ్రహీం అనే వ్యక్తి లాకప్‌లో మృతి చెందాడు. ఈ మేరకు న్యాయ విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని కోరుతూ ఇబ్రహీం భార్య నజ్మా కోర్టును ఆశ్రయించింది.

Pages