S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/01/2016 - 16:19

హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న ఎపి న్యాయాధికారులపై దాడులను అరికట్టాలని ఎపి జడ్జీల సంఘం నాయకులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోంశే్లకి శుక్రవారం విజ్ఞప్తి చేసింది. సంఘం నాయకులు ఈమేరకు శుక్రవారం సిజెను కలిసి తాజా పరిస్థితులు వివరించారు. హైకోర్టు విభజన కోసం ఆందోళన చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు ఇలా భౌతిక దాడులకు దిగడం అన్యాయమన్నారు.

07/01/2016 - 16:18

హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇంటర్నేషనల్ (ఐసిస్) భావజాలానికి తాను వ్యితిరేకినని, ఆ సంస్థను అంతం చేయడానికి మిలటరీని ఉపయోగించాలని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నగరంలో 11 మంది ఐసిస్ అనుమానితులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన తన మనోభావాలను మీడియాకు తెలిపారు. ముందుగా ఐసిస్ భావజాలాన్ని అరికట్టేందుకు కృషి జరగాలన్నారు.

07/01/2016 - 16:17

హైదరాబాద్: నగరంలో అరెస్టు చేసిన అయిదుగురు ఐసిస్ సానుభూతి పరులను కనీసం 12 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు చేసిన 11 మందిలో ఆరుగురిని సాక్షులుగా మార్చి, మిగతా అయిదుగురిని చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

07/01/2016 - 16:17

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐసిస్ ఉగ్రవాద అనుమానితులను అరెస్టు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా మసీదుల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ప్రత్యేక పోలీసులతో పాటు రెండువేల మంది పోలీసులను నియమించామన్నారు.

07/01/2016 - 16:16

మెదక్: తెలంగాణ సిఎం కెసిఆర్ వ్యక్తిగత స్వార్థానికి దిగడం వల్లే హైకోర్టు విభజన హామీగా మిగిలిపోయి న్యాయవాదులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ అన్నారు. ఎపి సిఎం చంద్రబాబుతో కెసిఆర్ రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. దిల్లీలో దీక్ష చేయడం కన్నా చంద్రబాబుతో ముఖాముఖిగా మాట్లాడి హైకోర్టు విభజన సమస్యను కెసిఆర్ కొలిక్కితేవాలన్నారు.

07/01/2016 - 16:16

వరంగల్: జనగామ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ శుక్రవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు జనగామ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుండగా కొందరు వ్యక్తులు ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో మూడు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఓ బస్సుకు నిప్పంటించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

07/01/2016 - 16:15

మహబూబ్‌నగర్: గద్వాల కేంద్రంగా కొత్తజిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళనకారులు శుక్రవారం నాడు హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై పెద్దఎత్తున రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్ నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు నిషేధాజ్ఞలు విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

07/01/2016 - 12:22

మహబూబాబాద్: తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళదామనుకున్న ఆ కుటుంబానికి అనుకోని విషాదం ఎదురైంది. నిజామాబాద్- తిరుపతి ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతూ ఓ మహిళ రైలు చక్రాల కిందపడి మరణించిన ఘటన ఇక్కడి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగింది. మృతురాలిని రోటిబండ తండాకు చెందిన బి.విజయ (30)గా గుర్తించారు. తిరుపతికి దైవదర్శనం కోసం బయలుదేరగా మృత్యుదేవత ఎదురైందని విజయ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

07/01/2016 - 12:21

హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదుల మహాధర్నా శుక్రవారం ఉదయం ఇందిరాపార్కు వద్ద ప్రారంభమైంది. జంట నగరాలతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ధర్నాకు భారీ సంఖ్యలో న్యాయవాదులు తరలివస్తున్నారు. అయితే, ధర్నాలో పాల్గొనేందుకు వెయ్యిమందికి మాత్రమే అనుమతించామని, సాయంత్రం నాలుగున్నర గంటలతో ఆందోళన విరమించాలని పోలీసులు ఆంక్షలు విధించారు.

07/01/2016 - 12:20

హైదరాబాద్: రంజాన్ మాసంలో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా పాతబస్తీలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయం, మక్కా మసీదు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఉగ్రవాదులు పేల్చివేస్తారన్న సమాచారంతో పోలీసులు అక్కడ సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు.

Pages