S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/14/2016 - 07:48

హైదరాబాద్, ఏప్రిల్ 13: భక్తులకు వసతితో పాటు, సంపూర్ణ వౌళిక సదుపాయాలు కల్పించి జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇన్ముల్ నర్వ దగ్గర ఉన్న జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధిపై తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం సిఎం సమీక్షించారు.

04/14/2016 - 07:40

హైదరాబాద్, ఏప్రిల్ 13: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకానికి అవసరమైన నిధుల్లో రూ.8 వేల కోట్ల వరకు రుణంగా మంజూరు చేసేందుకు హడ్కో సంసిద్ధత వ్యక్తం చేసిందని గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మరిన్ని నిధులు ఈ పథకం కోసం సమకూర్చుకోవాల్సి ఉందని, తక్కువ వడ్డీకి ఇతర దేశాల నుంచి నిధులు పొందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

04/14/2016 - 07:39

హైదరాబాద్, ఏప్రిల్ 13: మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజోలి బండ మళ్లింపు పథకం (ఆర్‌డిఎస్)పై కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్‌కి స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటకల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్న ఆర్‌డిఎస్ వివిధ కారణాలతో తెలంగాణ రైతులకు నీరందించలేకపోతున్నదని ఆయన ఆ లేఖలో తెలిపారు.

04/14/2016 - 07:38

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్ర మంత్రివర్గంలో దళితులకు, మహిళలకు స్థానం కల్పించాలని తెలంగాణ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. మహిళలు లేని మంత్రివర్గం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విశ్వాసం లేదని ఆయన విమర్శించారు.

04/14/2016 - 05:11

హైదరాబాద్, ఏప్రిల్ 13: యాదాద్రి తరహాలో భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అదేశించారు. గోదావరి తీరాన బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ కారిడార్‌గా సమగ్రాభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.

04/14/2016 - 05:06

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మరో షాక్ తగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి గూటికి చేరారు. ఎమ్మెల్యే చిట్టెం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణకు స్వయాన సోదరుడు. దీంతో ఇప్పటి వరకు కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది.

04/14/2016 - 04:47

హైదరాబాద్, ఏప్రిల్ 13: ‘పదవులు రాగానే కొంతమందికి కళ్లు నెత్తికెక్కుతాయ. కొమ్ములు మొలిచినట్టు ప్రవర్తిస్తే ప్రజలకు దూరమైపోతాం’ అని సిఎం చంద్రశేఖర్‌రావు కార్పొరేటర్లను హెచ్చరించారు. ‘పదవులు రాగానే రాని భాషను మాట్లాడాలని చూస్తారు. కొందరికి నల్ల కళ్లద్దాలు నెత్తిమీదికి కొస్తాయి. వీళ్ల వాలకం చూసి జనం పరేషాన్ అయ్య తర్వాత దూరమవుతారు. జాగ్రత్త’ అని సిఎం హితవు చెప్పారు.

04/13/2016 - 18:38

హైదరాబాద్: యాదగిరిగుట్ట తరహాలో భద్రాచలం ఆలయాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామని సిఎం కెసిఆర్ తెలిపారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై ఆయన బుధవారం అధికారులతో సమీక్ష జరిపారు. భద్రాద్రి ఆలయం, మాడ వీధులను మార్పు చేసేందుకు పండితులు, ఆగమ శాస్త్ర నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు. భక్తజనులకు సౌకర్యాలు పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు.

04/13/2016 - 18:37

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల వల్లే ఉస్మానియా వర్సిటీకి ‘నాక్’ గుర్తింపు రద్దయిందని బిజెపి నేత డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. వర్సిటీలో అధ్యాపక పోస్టులు భర్తీ చేయనందున విద్యా ప్రమాణాలు దిగజారాయని ఆయన అన్నారు.

04/13/2016 - 18:16

దిల్లీ: కరవు నివారణకు కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన 318 కోట్ల రూపాయలు ఇంకా కలెక్టర్ల వద్దే ఉన్నాయని ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్ సింగ్‌లకు ఓ నివేదిక ఇచ్చారని సమాచారం.

Pages