S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/20/2016 - 11:43

నిజామాబాద్: భార్యపై అనుమానం పెంచుకొన్న ఓ భర్త తన ఇద్దరు పిల్లలను నేలకేసి కొట్టిన ఘటన నందిపేట మండలం తల్వెదలో బుధవారం జరిగింది. ఈ ఘటనలో బాలుడు మరణించగా, తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు.

01/20/2016 - 11:43

హైదరాబాద్: రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య అనంతరం హెచ్‌సియు లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతు పలికేందుకు యు.పి. మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత్రి మాయావతి, సిపిఎం నేత సీతారాం ఏచూరి, లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ తదితరులు నేడు వర్సిటీకి వస్తున్నారు. దిల్లీ సిఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఇక్కడికి వస్తారని సమాచారం.

01/20/2016 - 11:41

హైదరాబాద్: రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య అనంతరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాలుగో రోజు బుధవారం బంద్ కొనసాగుతోంది. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు వర్సిటీకి తరలి వస్తున్నారు.

01/20/2016 - 08:10

నల్లగొండ, జనవరి 19: సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన ఏజెంట్లను అరెస్టు చేయడం ద్వారా నల్లగొండ జిల్లా పోలీసులు మరో విజయం సాధించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కిడ్నీ రాకెట్ ఏజెంట్లను హాజరుపరిచి కేసు పురోగతి వివరాలను వెల్లడించారు.

01/20/2016 - 06:58

హైదరాబాద్, జనవరి 19: పార్టీలు వేరు కానీ గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీల నినాదాలు ఒకటే. ఇటు అభివృద్ధి, అటు ఆంధ్ర. ఈ రెండు నినాదాలపై అన్ని పార్టీలూ ఆశలు పెట్టుకున్నాయి. 18నెలల పాలనా కాలంలో తాము చేసిన అభివృద్ధిపై తెరాస ఆశలు పెట్టుకుంటే, తమ పాలనా కాలంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్, భాజపా- తెదేపా కూటమి ప్రచారం చేస్తోంది.

01/20/2016 - 06:54

హైదరాబాద్, జనవరి 19: హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బొంస్లేతో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. ఈ ఘటనలో హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

01/20/2016 - 06:53

హైదరాబాద్, జనవరి 19: మిషన్ భగీరథ పనుల పురోగతి పరిశీలనకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30కు హెలిక్యాప్టర్‌లో మెదక్ జిల్లా గజ్వేల్, వరంగల్ జిల్లా జనగామ, నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి నల్లా ఏర్పాటు చేసి సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి.

01/19/2016 - 13:02

నల్గొండ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కిడ్నీ రాకెట్‌ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరింది. ప్రధాన నిందితుడు సురేష్‌తో పాటు దిలీప్‌ చౌహాన్‌(అహ్మదాబాద్‌) హైదరాబాద్‌కు చెందిన జీను నూకరాజు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్‌ మీడియాతో మాట్లాడారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి కస్టడీలోకి తీసుకుంటామన్నారు. త్వరలోనే విచారణను పూర్తి చేస్తామని విక్రమ్‌జిత్‌దుగ్గల్‌ చెప్పారు.

01/19/2016 - 11:45

హైదరాబాద్: మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని చెంగిచర్ల వద్ద ఓ ఫాంహౌస్‌లో పుట్టినరోజు వేడుకల అనంతరం ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి 17 మంది యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

01/19/2016 - 11:43

మహబూబ్‌నగర్: మద్దూరు నుంచి నారాయణపేట వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం మద్దెలబీడు మలుపు వద్ద బోల్తాపడిన ఘటనలో 20 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Pages