S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/19/2016 - 11:43

నల్గొండ: నార్కట్‌పల్లి మండలం అక్కినపల్లి వెంకటేశ్వర స్వామి గుట్టపై దోమలపల్లికి చెందిన రమేష్, ప్రసన్న అనే ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం వీరి మృతదేహాలను స్థానికులు కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ప్రసన్నకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. దీంతో ప్రేమికులిద్దరూ తీవ్ర మనస్తాపానికి లోనై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

01/19/2016 - 11:41

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనలో వైస్ ఛాన్సలర్ అప్పారావును తక్షణం అరెస్టు చేయాలని విద్యార్థులు మంగళవారం ఉదయం వర్సిటీ వద్ద ఆందోళన చేపట్టారు. విసి ఛాంబర్ ముందు విద్యార్థులు బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా హెచ్‌సియు లో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.

01/19/2016 - 11:41

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థి ఆత్మహత్యకు కారకుడని ఆరోపిస్తూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ ఇంటి ముందు తెలంగాణ జాగృతి విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇక్కడ రామ్‌నగర్‌లోని దత్తాత్రేయ ఇంటిని ముట్టడించిన విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆందోళన చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

01/19/2016 - 04:28

హైదరాబాద్, జనవరి 18: ఎన్నికలు వస్తే చాలు. గోడలన్నీ రాజకీయ నినాదాలతో నిండిపోయేవి. ఎన్నికలకు ముందుగానే గోడలు రిజర్వ్ చేసుకునే వారు. గోడలమీద నినాదాలు రాయొద్దని పార్టీలకు చెప్పలేక ఇంటి యజమానులు తల్లడిల్లేవారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా టిఎన్ శేషన్ దెబ్బకు గోడలపై నినాదాలు మాయమయ్యాయి. అయితే, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ గోడపై చూసినా ఎన్నికల నినాదాలే కనిపిస్తున్నాయి. అయితే అవి ఇంటి గోడలు కాదు.

01/19/2016 - 04:27

హైదరాబాద్, జనవరి 18: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి), సింగరేణి కాలరీస్‌తో తెలంగాణ ట్రాన్స్‌కో సోమవారం వేర్వేరుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. సిఎం కె చంద్రశేఖర్‌రావు సమక్షంలో ట్రాన్స్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి ప్రభాకర్‌రావు, ఎన్టీపీసీ జనరల్ మేనేజర్లు సివి ఆనంద్, ఎస్‌కె ఖర్, అడిషనల్ జనరల్ మేనేజర్ కె సుదర్శన్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

01/19/2016 - 04:18

హైదరాబాద్, జనవరి 18: మిషన్ కాకతీయ పైలాన్ ప్రారంభోత్సవానికి వచ్చేనెల మొదటివారంలో ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రధాని పదవి చేపట్టిన తరువాత, తెలంగాణ ఆవిర్భావం తరువాత నరేంద్ర మోదీ తొలి పర్యటన ఇది. ఇప్పటివరకు వివిధ కార్యక్రమాలకు నరేంద్ర మోదీని మూడుసార్లు ఆహ్వానించినా రాలేదని తెరాస ఇటీవల బిజెపిపై విమర్శలు ప్రారంభించింది.

01/19/2016 - 04:09

హైదరాబాద్, జనవరి 18: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ (హెచ్‌సియు)లో పిహెచ్.డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన ప్రకంపనల సెగ ఢిల్లీని తాకింది. రోహిత్ ఆత్మహత్యతో వర్శిటీ విద్యార్థులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సియులో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.

01/18/2016 - 06:41

చౌటుప్పల్, జనవరి 17: సంక్రాంతి పండగ ముగిసింది. పల్లెలకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగుముఖం పట్టడంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి కిక్కిరిసిపోయిం ది. ఇసుకేస్తే రాలనంతగా రహదారిని వాహనాలు పూర్తిగా ఆక్రమించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లతో ప్రయాణికులు అవస్థ పడ్డారు. టోల్‌గేట్ల వద్ద పరిస్థితి సరేసరి.

01/18/2016 - 07:11

హైదరాబాద్, జనవరి 17: నీటిపారుదల ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గోదావరి నదిలో తెలంగాణకున్న వాటామేరకు నీటిని సమర్ధంగా, సంపూర్ణంగా వాడుకోవడానికి అనుగుణంగానే ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ చేశామన్నారు.

01/18/2016 - 06:25

హైదరాబాద్, జనవరి 17: జిహెచ్‌ఎంసి ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. అయినా కొన్ని పార్టీల అభ్యర్థులు పూర్తిగా తేలలేదు. ఈనెల 21న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా ‘బి-్ఫరం’ అందుకున్నవాళ్లే తుది అభ్యర్థులు అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి 150 డివిజన్లకు సుమారు 3 వేల నామినేషన్లు దాఖలయ్యాయి.

Pages