S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/12/2016 - 06:50

హైదరాబాద్, ఏప్రిల్ 11: రాజ్యాంగ నిర్మాత బిఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.

04/12/2016 - 06:35

హైదరాబాద్, ఏప్రిల్ 11: ఉస్మానియా యూనివర్శిటీతో పాటు తెలంగాణ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాలు, అనుబంధ, ప్రైవేటు పిజి కళాశాలల్లో 2016-17 విద్యాసంవత్సరానికి 3ఒయుసెట్-20162 నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ నెల 13 నుంచి మే 7 వరకూ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుందని పిజి అడ్మిషన్స్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి చెప్పారు.

04/11/2016 - 18:13

హైదరాబాద్: తాను నడుపుతున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించనందున సినీ నటుడు తారకరత్నకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం 700 రూపాయల జరిమానా విధించారు. అదే రోడ్డులో వెళుతున్న విజయవాడకు చెందిన సబ్ కలెక్టర్‌కు కూడా ఇదే కారణంపై 700 రూపాయల జరిమానా విధించారు. కారు అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్‌ను పోలీసులు స్వయంగా తొలగించారు.

04/11/2016 - 16:30

హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్‌లో 125 అడుగుల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు ప్రారంభించింది. విగ్రహం నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఒక కమిటీని ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

04/11/2016 - 16:28

నల్గొండ: వేసవి తాపం తీర్చుకునేందుకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో ఈతకు దిగిన అయిదుగురు యువకుల్లో ఇద్దరు గల్లంతైన ఘటన సోమవారం జరిగింది. మిర్యాలగూడ మండలం చిల్లాపురం వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. ఈతకు దిగిన వారిలో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకురాగా, గల్లంతైన ఇద్దరు యువకుల కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

04/11/2016 - 14:17

హైదరాబాద్: కేసు విచారణ సందర్భంగా కోర్టుకు వచ్చిన భార్యపై దాడిచేసిన భర్త ఆమె గొంతు కోసిన ఘటన రాజేంద్రనగర్ కోర్టు ప్రాంగణంలో సోమవారం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నాగేందర్‌పై భార్య సౌజన్య గతంలో కేసు పెట్టింది. కేసు విచారణకు హాజరైన సందర్భంగా సౌజన్యపై నాగేందర్ దాడి చేసి ఆమె గొంతు కోశాడు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

04/11/2016 - 14:17

హైదరాబాద్: భాగ్యనగర్ శ్రీరామనవని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 15న సీతారాం బాగ్ మందిరం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకూ శోభాయాత్ర జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని ఉత్సవ సమితి పిలుపునిచ్చింది.

04/11/2016 - 14:14

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నందున రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ అసెంబ్లీలో బిజెపి పక్షం నేత లక్ష్మణ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. తొమ్మిది జిల్లాల్లో ఇటీవల తమ పార్టీ నాయకులు విస్తృతంగా పర్యటించి దుర్భిక్ష పరిస్థితులపై అధ్యయనం చేశారని ఆయన తెలిపారు. కరవు పరిస్థితులపై పార్టీ తరఫున ఒక నివేదికను రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు అందజేశారు.

04/11/2016 - 14:13

హైదరాబాద్: ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ఆశలను తీర్చేలా కార్పొరేటర్లు దీక్షతో పనిచేయాలని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. జిహెచ్‌ఎంసిలో తెరాస కార్పొరేటర్లకు మూడురోజుల శిక్షణ శిబిరాన్ని సోమవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలనాపరమైన అంశాలపై అవగాహన తోడైతే కార్పొరేటర్లు నైపుణ్యంతో పనిచేయగలరన్నారు. అపుడు అధికారులు కూడా వారికి సహకరిస్తారన్నారు.

04/11/2016 - 12:55

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తెరాస కార్పొరేటర్లకు ప్రగతి రిసార్ట్సులో మూడు రోజుల శిక్షణ తరగతులను సిఎం కెసిఆర్ సోమవారం ఉదయం ప్రారంభించారు. మున్సిపల్ పరిపాలనకు సంబంధించిన పలు అంశాల్లో వీరికి అధికారులు శిక్షణ ఇస్తారు. చివరి రోజున ఇతర కార్పొరేషన్లకు చెందిన కార్పొరేటర్లకు శిక్షణ ఇస్తారు. సిఎం ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగే శిక్షణ శిబిరానికి అధికారులు భారీ సన్నాహాలు చేశారు.

Pages