S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/05/2016 - 11:45

హైదరాబాద్: నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ వద్ద కమలానగర్‌లో మంగళవారం తెల్లవారుజామున రోడ్డుపై రక్తపు మడుగులో ఇంటర్ విద్యార్థిని మృతదేహం పడి ఉండటం సంచలనం సృష్టించింది. మృతురాలిని తుకారాంగేట్ పోలీసుస్టేషన్‌లో సిఐగా పని చేస్తున్న అర్జున్ కుమార్తె చందనగా గుర్తించారు.

01/05/2016 - 11:45

వరంగల్: తెలంగాణ సి.ఎం. కెసిఆర్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు నిర్వహించకుండా పలు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. భూపాల్‌పల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించేందుకు సి.ఎం. వస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించే విషయమై ఆందోళన చేస్తున్న విద్యార్థులు సి.ఎం. పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు.

01/05/2016 - 11:44

మెదక్: రాజీవ్ రహదారిపై బస్సులు ఆపడం లేదని, ఈ కారణంగా తాము కళాశాలలకు సమయానికి హాజరు కాలేక పోతున్నామని విద్యార్థులు మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ అధికారుల వైఖరి వల్ల తాము నష్టపోతున్నామని వారు తెలిపారు. విద్యార్థుల ధర్నాతో సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు జోక్యం చేసుకొని విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

01/05/2016 - 07:47

హైదరాబాద్, జనవరి 4: ఒకేసారి ఇంటికి పది మంది వస్తే వండి వడ్డించడం ఇల్లాలికి కష్టం. మరి 50వేల మందికి ఒకేసారి వండితే ఎలా ఉంటుంది. నిజం ఇప్పుడు ఒకేసారి 50వేల మందికి వంట వండే అత్యాధునిక వంటశాల నేటి నుంచి తెలంగాణలో ప్రారంభం అయింది.

01/05/2016 - 07:43

హైదరాబాద్, జనవరి 4: బిజెపి నాయకులకు దమ్ముంటే ప్రధానమంత్రితో మాట్లాడి హైదరాబాద్ అభివృద్ధికి 20వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇప్పించాలని, అలా చేస్తే తాను బిజెపికి ఓటువేస్తానని టిఆర్‌ఎస్ ఎంపి కవిత సవాల్ చేశారు. సోమవారం ఖైరతాబాద్ నియోజకవర్గం పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో విపక్షాలు అనవసర విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని అన్నారు.

01/05/2016 - 07:36

నిజామాబాద్, జనవరి 4: జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్(డిటిసి) కార్యాలయంపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. నిజామాబాద్ డిఎస్పీ నరేందర్‌రెడ్డి నేతృత్వంలో నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన సిబ్బంది పక్కా ప్రణాళికతో జరిపిన ఈ దాడి సందర్భంగా ఆర్టీఎ కార్యాలయంలో వేళ్లూనుకుపోయిన ప్రైవేట్ ఏజెంట్ల దందా మరోసారి తెరపైకి వచ్చింది.

01/05/2016 - 07:35

సుల్తానాబాద్, జనవరి 4: రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార సంఘాలు కృషి చేస్తున్నాయని, కరవును అధిగమించేందుకు గాను రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సహకార అఫెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.

01/05/2016 - 07:34

ఆదిలాబాద్,జనవరి 4: తెలంగాణ ప్రజా ఉద్యమాల్లో చైతన్యస్రవంతిని రగిలించి ఊపిరి పోసిన సాహిత్యాన్ని, ప్రపంచీకరణలో అస్థిత్వాన్ని కోల్పోతున్న తెలుగుభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత భావితరాలపై ఉందని తెలంగాణ సాహితీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

01/05/2016 - 07:34

మహబూబ్‌నగర్, జనవరి 4: ప్రజాసమస్యలను గాలికి వదిలి సొంత ఎజెండాలు, రాజకీయ అంశాలు తెరపైకి రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సభ్యుల వాగ్వాదాలు, ఆందోళనలతో దద్దరిల్లింది. సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన జడ్పీ సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జిల్లాకు సంబంధించిన జడ్పీటిలు, ఎంపిపిలు హాజరయ్యారు.

01/05/2016 - 07:33

నల్లగొండ, జనవరి 4: సిఎం కెసిఆర్ మరోసారి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి రానున్నారు. కెసిఆర్ రాక..అభివృద్ధి పనుల సమీక్షతోనైనా ఏడాదిగా నామమాత్రంగా సాగుతున్న యాదాద్రి అభివృద్ధి పనులు పరుగులు పెట్టవచ్చన్న ఆశలు రేపాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాలో పర్యటనలో భాగంగా ఈ నెల 5న వరంగల్ పర్యటనకు వెళ్లి తిరుగు ప్రయాణంలో 6వ తేది రాత్రి గుట్టకు చేరుకుంటారు.

Pages