S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

11/08/2017 - 18:56

ప్రజలకు సుపరిపాలన అందిస్తామని పదే పదే చెబుతూ వచ్చే పాలకులు వివిధ ప్రభుత్వ శాఖల్లో నిర్దేశిత ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయటంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఏపీలో మండల వ్యవస్థకు అంకురార్పణ జరిగినప్పుడు 1983లో నాటి జనాభా సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అన్ని క్యాడర్లలోను నిర్దేశించిన పోస్టుల్లో ఇప్పటికి దాదాపు రెండు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

11/08/2017 - 18:56

రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటు ద్వారా జోనల్ వ్యవస్థను సత్వరం పునరుద్ధరించి లోకల్, నాన్‌లోకల్ విధానంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో 370-డి అధికరణ అమలులో ఉన్న కారణంగా ఉద్యోగాల ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

11/08/2017 - 18:55

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రధానంగా మూడు అంశాలపై ఏర్పడ్డది. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు.. ఈ అంశాలపైనే కెసిఆర్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఉద్యమం నడిపించారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఈ మూడు అంశాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నారు.

11/08/2017 - 18:54

తెలంగాణ నిరుద్యోగ యువతకు కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లక్షా పనె్నండు వేల ఉద్యోగాల కంటే అధికంగానే భర్తీ చేపట్టే దిశగా ముందుకెళుతోంది. ఉద్యోగ భర్తీలో తలెత్తిన వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించి భర్తీ, పదోన్నతుల ప్రక్రియల్లో వేగం పెంచాం. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఉద్యోగ పంపకాల్లో తలెత్తిన వివాదాలు, కమలనాథన్ కమిటీ చేసిన జాప్యం తెలంగాణలో ఉద్యోగ భర్తీని మూడున్నర ఏళ్లపాటు జాప్యం చేసింది.

11/08/2017 - 18:53

ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న తీవ్రమైన జాప్యంతో అనేక సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఖాళీలున్నాయి. ఫలితంగా ఉద్యోగులకు పనిభారం విపరీతంగా పెరిగింది. ఇటీవలి కాలంలో నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్స్ లేవు. నియామకాలు లేకపోతే ఉద్యోగులపై పనిభారం పెరిగిపోతుంది. ఫలితంగా పనిలో నాణ్యత ఉండదు. నియామకాల విషయంలో న్యాయ సంబంధమైన చిక్కులు కొన్ని అంశాల్లో మాత్రమే ఉంటాయి.

11/08/2017 - 18:53

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో జాప్యం చేస్తోంది. నియామకాల్లో జివోల పేరుతో కొంత.. నోటిఫికేషన్‌ల పేరుతో మరికొంత ఆలస్యం జరుగుతోంది. దీంతో నిరుద్యోగ సమస్య పెరగడంతోపాటు నిరుద్యోగులు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రావాలన్నా ముందుగా నిరుద్యోగులకు ఆశ పెడతారు. అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చేస్తారు.

11/08/2017 - 18:52

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దృక్పథం విధానంలో మార్పు వస్తే తప్ప ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే పరిస్థితి కనిపించటం లేదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఇంతవరకు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియపై కూడా ప్రభుత్వం ఆలోచించటం లేదు. దీనికితోడు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.

11/08/2017 - 18:51

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్లను రెండు ప్రభుత్వాలు పటిష్ఠం చేయాలి. ప్రతి ఏడాది రాష్ట్రంలో వివిధ గ్రూపుల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీలను ప్రకటించాలి. వీటికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలి. దరఖాస్తుల స్వీకారం, చివరి గడువు, సిలబస్ ఖరారు, ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఫలితాల వెల్లడి తేదీ, ఇంటర్వూ తేదీలను ముందుగా ఖరారు చేయాలి.

11/01/2017 - 19:28

ర్యాంకుల హోరెత్తినట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు హోరెత్తుతున్నాయి. ఒకటి... ఒకటి... ఒకటి..., రెండు... రెండు... రెండు... అంటూ టీవీ చానళ్లలో ఊదరగొట్టే కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వాకానికి ఆత్మహత్యల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. కాలేజీల ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

11/01/2017 - 19:28

విద్యార్థులకు మార్కులే జీవితం కాదు అన్న భావన నుంచి బయటపడాలి. విద్యార్థులకు సర్వతోముఖాభివృద్ధి దిశగా విద్యను అందించాలి. నేడు కార్పొరేట్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు మానసిక వత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు బోధన పేరుతోను, స్టడీ అవర్స్ పేరుతో ఆయా యాజమాన్యాలు విద్యార్థులను మానసిక వత్తిడికి గురిచేయడం సరికాదు.

Pages