S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

07/27/2019 - 19:05

మనసులోని మాటలు ఇక అక్కడే దాగవు. మనుషుల ఆలోచనలను చదివి వారు ఏమనుకుంటున్నారో మాటల రూపంలో బయటకు వినిపించే సాంకేతికతను శాస్తవ్రేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం మెదడుకు అమర్చే ఓ పరికరాన్ని అమెరికాలోని యూనివర్శిటీ ఆప్ కాలిఫోర్నియా పరిశోధకులు రూపొందించారు. మాట పడిపోయిన చాలామందికి ఈ సాంకేతికత ద్వారా ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని వారు అంటున్నారు.
ఇలా పనిచేస్తుంది..

07/27/2019 - 19:02

సృష్టిలో ప్రతి ప్రాణికి సముచిత స్థానం ఉంది. పులికి భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్ప స్థానముంది. దేని విలువ దానికే. జంతు రాజ్యంలో అడవికి రాజైన సింహం తర్వాత అగ్రస్థానం పులిదే. పులి రాజసానికీ, ఠీవికి పేరు. దాని కళ్ళల్లోని స్ఫురద్రూపం, నడకలో గాంభీర్యం చూస్తేనే వణుకు పుడుతుంది. పులులు ఆరోగ్యపరమైన జీవావరణ వ్యవస్థకు సూచికలు. పర్యావరణ, ఆరోగ్యకరమైన అరణ్య నిర్మాణానికి ఇవి చిహ్నాలు.

07/27/2019 - 18:39

సరోవరంలో గుంపులుగా వేలాడే పక్షులు
ఆకాశాన్ని వేరు చేసి మబ్బుల మధ్య ఈదుతున్నాయి
కళ్లనిండా ఆశల సంద్రాలు పొంగుతున్నాయి

వెనుకటి పాదముద్రలు హృదయాంతరాలలో చిక్కుకుని
రేపటి స్వప్నాలికి అడుగులు తడబడుతున్నాయి.

07/27/2019 - 18:27

మనం ఏదైనా పనిని ప్రారంభించాలంటే ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. అందులో ముఖ్యమైంది.
చాలా ఆలస్యం జరిగిపోయింది.
ఈ అనుమానం, ఆలోచన రాగానే మనం ఆ పనిని మొదలుపెట్టడం ఆపేస్తాం.
మనల్ని వెనక్కి లాగడానికి ఎన్నో కారణాలు వున్నాయి. అందులో చాలా కారణాలు మనం కల్పించుకున్నవే.
కొన్ని పద బంధాలని మార్చితే బాగుంటుందేమో.

07/20/2019 - 20:16

చిత్రకారుడు కానిదే శిల్పి కాలేడు. చేయి తిరిగిన చిత్రకారుడే మంచి శిల్పి అవుతాడు. వర్తమానంలో శిల్పి అనేక మాధ్యమాలను ఎంచుకుంటున్నాడు. ఒకప్పుడు రాతి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో శిల్పాలు తయారుచేసేవారు. ఇప్పుడు సృజనకు, కళాత్మకతకు కాదేదీ అనర్హమన్న రీతిలో తుక్కు (పనికిరాని ఇనుప సామాగ్రి) సైతం శిల్పానికి భేషుగ్గా ఉపయోగపడుతోంది.

07/20/2019 - 20:12

ప్రిన్సిపాల్ చేస్తున్న అన్ని పనులలో ఉపాధ్యాయులలో వృత్తిపరమైన లక్ష్యాన్ని కలిగించటం చాలా కష్టతరమైన పని. ఉపాధ్యాయ బృందంలో ప్రిన్సిపాల్‌కన్నా ఎక్కువ అనుభవం కలవారు కూడా ఉంటారు. తనకన్నా ఎక్కువ అంకిత స్వభావం కల ఉపాధ్యాయులు ఉంటారు. కొత్తవారు కూడా ఉంటారు.

07/20/2019 - 20:11

రసాయన శాస్త్రంలో ‘వేలన్సీ’ (valency) అనే మాట వస్తుంది. దీని మూలం లేటిన్ భాషలో ఉంది. లేటిన్‌లో ఈ మాట విలువ, బలం, స్థోమత మొదలైన అర్థాలు ఉన్నాయి. ఒక అణువు మరొక అణువుతో సంగం చెందటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలియపరచటానికి ‘వేలన్సీ’ అనే మాట వాడతారు. ఈ మాట రసాయన శాస్త్రంలో బాగా పాతుకుపోయింది. ఇదేదో బాగుందే అని భాషా శాస్తవ్రేత్తలు ఈ మాటని వ్యాకరణంలో ఉపయోగించటం మొదలుపెట్టేరు.

07/20/2019 - 19:45

ప్రియా నిను చూడలేక.. ఊహలో నీ రూపు రాక.. నీ తలపులోనే నే బ్రతుకుతున్నా.. ప్రేమలో... వాన చినుకై.. పూవుల మొలకై.. విరిసిన చెంపల మెరిసిన కెంపై.. చూపరులకు కడు ఇంపై సొంపైన పూలతాంగికై...

07/20/2019 - 19:06

ఊహల రెక్కలు తొడిగి
చిననాటి నా వూరి దిగుడుబావిని
వెతుక్కొంటూ వెళ్లిపోతాను
దిగుడు బావి కనిపించదు.
మా వూరి ప్రెసిడెంటుగారి హృదయమంత విశాలం
ఆయన నవలాకుల తోట కోసం
వొళ్లంతా కళ్లు చేసుకుంటాను
నవలాకులతోట కనిపించదు
మా వూరి రచ్చబండ చప్టా మధ్యలో
పెద్దమనిషి తరహాలో నీడనిచ్చిన చింతచెట్టు
నలుగురికీ ముప్పొద్దుల గాలికొసరిన మహావృక్షం

07/20/2019 - 19:04

మనం వ్యక్తులం
వ్యక్తీకరించగల సామర్థ్యాన్ని
కల్గి వున్నవాళ్లం
మనకంటూ ఓ వ్యక్తిత్వాన్ని
రూపొందించుకున్న వాళ్లం
విలువలను ప్రమాణాలుగా చేసి
దానికో కొలమానాన్ని
నిర్దేశించుకొన్న వాళ్లం
గుర్తించి సమాజంలో
దానికో గౌరవాన్ని
ఆపాదించుకొన్న వాళ్లం
సామాజిక వేదికపై
మనల్ని మనం ఆవిష్కరించుకొనే
తులనాత్మక వైఖరులే

Pages