S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

10/26/2019 - 19:18

అవినీతి తమసంబు అంతమ్ము గావింప
పువ్వొత్తులై వెల్గు పొదలజేయ
మానభంగముసల్పు మదమత్తులను ద్రుంచ
బాంబులై ప్రేల్చి ధ్వంసంబు జేయ
దుర్భాషలాడెడి దుష్టుల పరిమార్చ
విష్ణుచక్రములై వ్రేఁగజేయ
మాయమాటలు జెప్పు మంత్రగాండ్రను గూల్చ
సీమ టపాసులై చిత్తుచేయ

10/26/2019 - 19:16

ఇప్పుడు దేశంలో దీపావళి సీజన్ నడుస్తోంది. ఎప్పుడు దీపావళి వచ్చినా మన దేశంలో మేధావితనం వొలకబోసేవాళ్లు సామాజిక బాధ్యత అంతా తామే నెత్తికెత్తుకున్నట్లు ఉపదేశాలిస్తారు. దీపావళికి బాణసంచా కాల్చడం వల్ల ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం కలుగుతుందనీ, టపాసుల పేలుళ్లకు పశుపక్ష్యాదులు భయపడిపోతాయని ఎక్కడ లేని ప్రేమా వొలకబోస్తూ హిందువులపై ఏడ్చిపోతారు వీళ్లంతా.

10/26/2019 - 19:07

ఓ ప్రేమా..
నన్ను అందుకోవాలని ఆరాటపడ్డాను
పొదివి పట్టుకోవాలని ఉబలాటపడ్డాను
నాలో నన్ను నిలుపుకోవాలని కలలు కన్నాను
ఆ కలలన్నీ కల్లలే అయ్యాయి
అందినట్లే అందుతావ్
అంతలోనే చేజారిపోతావ్
దూరాన ఉంటూ ఊరిస్తావ్
కవ్వించి నన్ను ఉరికిస్తావ్
ఈ పరుగులో నేను అలసిపోయాను
ఈ పోరాటంలో నేను ఓడిపోయాను
అలసి సొలసి చెమ్మగిల్లిన కళ్లతో

10/26/2019 - 18:31

పుట్టినాక ఎవరైనా
ఎప్పుడైనా పోవాల్సిందే
కాకపోతే ఒకరు ముందు
మరొకరు వెనుక

ఏదోనాడు పోతాంలే అని
గుండెను బండ చేసుకుంటే ఎలా?
హృదయాన్ని నదిలా పారించినప్పుడే
జవసత్వాలు నిలబడేది
మరో నలుగురికి ఊపిర్లూదగలిగేది!

10/26/2019 - 18:30

ఒక శీతాకాలపు ఉదయాన
మంచు తెరలు తెరలుగా కురుస్తున్నప్పుడు
అంత చలిలోనూ గుండె చేతపట్టుకుని
నీ కోసం వచ్చాడంటే వాడు తప్పకుండా స్నేహితుడే
ఒక దుఃఖం రెండు కన్నీటి చుక్కలు
ఒక గమ్యం రెండు దారులు
మనిషి జీవితం ఎడారిలో ఒయాసిస్సే
లోకం నిన్ను ఒంటరిని చేసినప్పుడు
ఆ శూన్యంలోంచి నిన్ను మనిషిని చేసింది స్నేహమే
ఒంటరితనంలోంచి సమూహంలోకి

10/26/2019 - 18:24

కొన్ని బంధాలంతే
ఎప్పటికీ కలవవు
ఎక్కడో దూరాన
కలిసినట్టు కనిపిస్తాయంతే
పక్క పక్కనే వుండి
పలకరిస్తున్నట్టుగానే వుంటాయి
వత్తిళ్లతో పుటం పెట్టుకుంటూ
శ్రమైక జీవితమై పోతుంటాయి
మురిపంగా ఎదురుబొదురుగా కూర్చుండి
ముచ్చట పెడుతున్నట్టుగానే వుంటాయి
నీలాగే నేనూ...
నాలాగే నీవూ.. అంటూ
అపురూప ఆదర్శాలను వల్లిస్తున్నట్టుగా

10/26/2019 - 18:16

మొదటిసారి చూడగానే ఏర్పడే అభిప్రాయం చాలా బాగా వుండాలి అంటారు.
నిజమే!
కొంతమంది మొదటిసారి చూడగానే ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు.
అదే అభిప్రాయంతో కొనసాగుతారు.
కొన్ని మొదటిసారి ఏర్పడే ముద్ర అంత బాగా వుండకపోవచ్చు.
అది అలా వుండిపోవాల్సిందేనా?
మొదటిసారి కలిసినప్పుడు, నవ్వుతూ పలకరించాలి. కళ్లల్లోకి చూడాలి. వాళ్లు చెప్పింది జాగ్రత్తగా వినాలి.

10/19/2019 - 22:13

భారతదేశం దక్షిణ భాగంలోని మూడు సముద్రాల (అరేబియన్ సము ద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం) సంగమ స్థలిని ఆనుకుని ఉన్న కన్యాకుమారి పుణ్యతీర్థం దగ్గరగా ఉన్న చిన్న కొండ మీద, మహిమాన్వితుడైన ఏకనాథ్ రానడె (వివేకానంద సందేశాల వలన ప్రభావితుడై, వివేకానందుని సందేశాలను భావితరాలకు అందించాలని) ‘వివేకానంద శిలా స్మారకం’ అనే జాతీయ స్మారక చిహ్నం నిర్మాణానికి స్ఫూర్తినిచ్చి, నిర్మాణం చేయించి, 1970 సెప్టెంబర్ 2న అప్ప

,
10/19/2019 - 20:23

ప్రకృతి ‘అందం’ ఆరాధనీయం.. ఆ ప్రకృతికి ప్రతిరూపంగా భావించే స్ర్తి ‘అందం’ అంతే స్థాయిలో తన్మయత్వానికి గురి చేస్తుంది. ప్రకృతి అందం.. స్ర్తి అందం బింబ ప్రతిబింబాలన్నా తప్పు కాదు. అందుకే స్ర్తి అందాన్ని నిరపేక్షకంగా చూడాలని విజ్ఞులు అంటారు. అందానికి పరవశించి పోయి తన ‘వశం’ చేసుకోవాలని, దక్కకపోతే ‘ఆసిడ్’ పోయడం పరమ దుర్మార్గం... దారుణం.. రాక్షసత్వం.. నిందనీయం.

10/19/2019 - 20:17

పంధొమ్మిది వందల ఎనభైలలో చివరి సంవత్సరాల సందర్భం ఇది. హైదరాబాద్ త్యాగరాయ గానసభా వేదికపై కె.ఎల్.రావు సన్మాన సభ జరిగింది. సన్మానపత్రం రమాపతిరావు అనే నేను చదివి వారికి సమర్పించాను. మానవీయ శంకర దయాళ్ శర్మ ఆనాటి ఉత్సవ ముఖ్య (విశిష్ఠ) అతిథి. పి.వి.ఆర్.కె. ప్రసాద్ సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్.

Pages