S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

09/08/2018 - 20:02

జాతీయ భావాన్ని పాదుకొలిపి, జాతి జనులను సమగ్రత వైపు నడిపించిన ఖ్యాతి కేవలం ‘గణేశ్ చతుర్థి’ ఉత్సవాలకే దక్కుతుంది. హిందువులు అనాదిగా మతపరమైన ఎన్నో పండగలను ఆచరిస్తున్నా, ఏ పర్వదినానికీ లేని విశిష్ఠత వినాయక చవితి ఉత్సవాల్లో కనిపిస్తుంది. అగ్రవర్ణాలు, బడుగువర్గాల మధ్య అంతరాలను తొలగించడంలో కీలకపాత్ర వహిస్తున్నందునే దీన్ని జాతీ య స్థాయిలో భారీ ఉత్సవంగా ఏటా నిర్వహిస్తున్నారు.

09/08/2018 - 20:02

ప్రణవ స్వరూపుడు - ప్రమద గణాధిపతి - పార్వతీ పరమేశ్వరుల ప్రియ పుత్రుడు - సకల జగతికి ప్రేమపాత్రుడైన విఘ్న నాయకుడు వేదాల్లో - ఉపనిషత్తుల్లో.. అష్టాదశ పురాణాల్లో కీర్తింపబడినాడు. అలాగే తెలుగు సాహితీ నందనవనంలో, ప్రబంధాలలో - శతక సాహిత్యంలో భాగవత భారత రామాయణాలలో తొలి వేలుపుగా ప్రస్తుతింపబడినవాడు.

09/08/2018 - 20:01

హిందూ సంప్రదాయంలో ఒక ప్రతిష్ఠాత్మక, ప్రత్యేక పీఠాన్ని అలంకరించిన దేవుడు వినాయకుడు. సమస్త భారతదేశ ప్రజ వైభవంగా జరుపుకొనే పర్వదినం వినాయక చవితి పండుగ. గణాధిపతియైన గణపతి ప్రజల నిత్య జీవితంలో ఒక విడదీయరాని విభాగమై పోయాడు.

09/08/2018 - 20:01

‘‘గణపతి బొప్పా మోరియా
మంగళమూర్తి మోరియా’’

09/02/2018 - 22:40

మీరు ఏదైనా పని చేద్దామని అనుకుంటే చాలామంది విశ్వసించరు. విశ్వసించకపోయినా పర్వాలేదు. కానీ అధైర్యపడకూడదు. కానీ చాలామంద అధైర్యపరుస్తారు. ఈ లోకంలో ఇవన్నీ సహజమే.
మిమ్మల్ని ఇష్టపడేవారు లేరు.
పర్వాలేదు.
మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారా లేదో అనేది ముఖ్యం. మిమ్మల్ని మీరు ఇష్టపడితే చాలు. చాలా మంది మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టే అర్థం.

09/02/2018 - 00:04

సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు, వివిధ కులాల మధ్య హెచ్చు తగ్గులు లేకుండా చూసేందుకు, మానవ సేవయే మాధవసేవగా పరిగణిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భగవత్ రామానుజాచార్యులు చిన జీయర్‌కు ఆదర్శమూర్తి.

09/02/2018 - 00:02

సమాజాన్ని సక్రమమార్గంలో నడపాలంటే ఎవరో మహానుభావులు జన్మించాల్సిందే. సమాజంలో సమానత్వం సాధించేందుకు, అంటరానితనాన్ని రూపుమాపేందుకు, దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించేందుకు వేయి సంవత్సరాల క్రితమే ‘విప్లవం’ సృష్టించిన మహానుభావుడు భగవత్ రామానుజాచార్యులు. అట్టడుగు వర్గాలు ఆలయాల్లోకి వచ్చేందుకు వీలులేని వాతావరణం కొనసాగుతున్న సమయంలో, అంటరానితనం అడుగడుగునా కనిపిస్తున్న సమయంలో రామానుజులు జన్మించారు.

09/01/2018 - 20:48

టైప్ మిషీన్‌తో ఎవరైనా ఏం చేస్తారు? ఇదేం పిచ్చి ప్రశ్న. టైపు మిషీన్‌తో ఎవరైనా టైపే కదా చేస్తారు అని విసుక్కుంటున్నారా!? టైప్ రైటర్ మెషీన్‌తో పేపరుపై అక్షరాలు టైపు చేయడం అందరికీ తెలిసిన విషయమే.. కానీ టైప్ మిషీన్‌తో ఎవరైనా చిత్రాలను టైపు చేయగలరా? ఇది చాలా అసాధ్యమైన విషయం. కానీ ముంబయికి చెందిన చంద్రకాంత్ భిడే మాత్రం చిత్రాలను చకచకా టైపు చేస్తారు.

08/25/2018 - 20:28

భారతదేశానికి స్వాతంత్య్రం రావటానికి మూడేళ్ల ముందే అంటే 1944లోనే ముగ్గురు గిరిజన వైతాళికులు గిరిజనోద్ధరణ కొరకు నడుం కట్టారు. వారివారి నివాసిత గ్రామాలను విడిచి తంబూర, రెండు డక్కీలు తీసుకొని కాలినడకన ఊరూరా తిరిగారు. ఊరికి దూరంగానో, కాల్వగట్లపై, చెరువు గట్లపై, తాటాకు గుడిసెల్లోనో, బొంతల నీడల్లోనో నివాసముండే తమ జాతి జనుల దగ్గరికి వెళ్లేవారు. దయనీయమైన, దారుణమైన వారి జీవిత వెతల గూర్చి చెప్పేవారు.

08/25/2018 - 19:23

హిందూ సంప్రదాయ పండుగల్లో బంధాలను, బంధుత్వాలను.. అన్నాచెల్లెళ్ల.. అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలను చాటిచెప్పే పండుగ రాఖీ పౌర్ణమి. అంతటి పవిత్రమైన, ప్రాధాన్యత కలిగిన రాఖీ పౌర్ణమిని ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి రోజున జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు.. ఇలా చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా ఆప్యాయతలను పంచేది రాఖీ పండుగే..

Pages