S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

08/11/2018 - 19:37

ప్రపంచంలో ఎక్కడైనా వ్యక్తుల పేరుతోనో, సంస్థల పేరుతోనో ఉత్తరాలు రాస్తారు. కానీ ఉత్తర జర్మనీలో యూటిన్ నగరానికి సమీపంలోని డొడావెర్ అడవిలో 500 సంవత్సరాల నాటి ‘ఓక్’ చెట్టుకు దేశవిదేశాల నుంచి ఎందరో పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉత్తరాలు రాస్తుంటారు. ప్రపంచంలోనే పోస్టల్ చిరునామా కలిగిన ఏకైక చెట్టు ఇదే!

08/11/2018 - 18:54

వామ్మో! గంటకు 457 కిలోమీటర్లా..? అని గుడ్లు తేలేస్తున్నారా? ఆగండాగండీ.. గంటకు 1,123 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అత్యాధునిక రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వర్జిన్ హైపర్‌లూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న అత్యంత వేగవంతమైన మెట్రో రైలు రవాణా వ్యవస్థను పోలిన ‘హైపర్‌లూప్’కు సంబంధించి ఇప్పటికే ఒక రికార్డు నమోదైంది.

08/04/2018 - 21:08

అనేక సందర్భాలు-
జీవితంలో అనేక సందర్భాలు ఉం టాయి.
కొన్ని పనులు చేద్దామని అనుకుంటాం. చేయలేకపోతాం.
ప్రయత్నించి విఫలమవుతాం.
ఉదయానే్న లేచి ఎన్నో పనులు చేద్దామని అనుకుంటాం.
కానీ 8 గంటల వరకు నిద్ర లేవకుండా ఉంటాం.
ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ
వాటిని సరిగ్గా ఉపయోగించలేక పోయి ఉంటాం.
ఎంతోమందిని మన మాటలతో బాధపెట్టి ఉంటాం.

08/04/2018 - 20:41

హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్లవలసిన శ్రీ్ధరరావు పొరపాటున కదులుతున్న బెజవాడ రైలు ఎక్కేశాడు.

08/04/2018 - 19:35

ప్రపంచవ్యాప్తంగా పఫిన్ పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కారణాలేంటో తెలుసుకునేందుకు ఓ అంతర్జాతీయ సంస్థ పరిశోధన ప్రారంభించింది. శాస్తవ్రేత్తలు చిన్న చిన్న జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను సముద్ర పక్షుల శరీరాలకు అమర్చి వాటి కదలికలను గమనిస్తున్నారు.

08/04/2018 - 19:12

ప్రభాతవేళ ప్రభాకరుని లేలేత కిరణాలు అవనీతలాన్ని తాకకముందే- అక్కడ అంతా ఒంటికాలిపై నిలబడి ఊపిరి బిగపట్టి ఏకాగ్రతతో సాధన చేస్తుంటారు.. వైవిధ్య భరితమైన ఆ యుద్ధకళలో మెళకువలను నేర్చుకుంటారు.. మన దేశంలో అతి ప్రాచీనమైన ‘కలరి’ (కలరిపయత్తు) యుద్ధ విన్యాసాలకు ఇప్పుడు నగరాల్లో విశేష ఆదరణ లభిస్తోంది.

07/28/2018 - 19:00

మన దేశంలో సాదాసీదా చాయ్‌వాలాలు చరిత్ర సృష్టిస్తున్నారు.. గుజరాత్‌కు చెందిన నరేంద్ర మోదీ చాయ్‌వాలాగా పనిచేసి, ప్రధాని పీఠాన్ని అధిష్ఠించగా, ఇంకెందరో ‘టీ’ అమ్ముకునే వ్యక్తులు పరోపకారంలోనే జీవిత పరమార్థం ఉందని తమకు చేతనైంతగా సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. ఒడిశాకు చెందిన అజయ్ బహదూర్ సింగ్ డాక్టర్‌గా పేదలకు సేవలందించాలని చిన్నప్పటి నుంచి కలలు కనేవాడు.

07/28/2018 - 18:59

చిన్నప్పుడెప్పుడో చదువుకున్న లేదా పెద్దలద్వారా విన్న కాకి కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓ కాకికి దాహం వేసి వెతగ్గా.. వెతగ్గా.. ఓ కుండ కనిపించిందనీ.. దానిలో అడుగున నీళ్లు ఉన్నాయని, కాకి వాటిని తాగాలనే ధ్యేయంతో తెలివైన ఆలోచన చేసి ఒక్కొక్కటిగా గులకరాళ్లను వేసి నీళ్లను పైకి తెచ్చుకుని తాగుతుందనేది కథ. విపత్కర పరిస్థితుల్లో తెలివిగా ఎలా ఆలోచించాలి అనేది కథాసారాంశం.

07/28/2018 - 18:33

ఆ రోజు ఆదివారం. ఆ సాయంత్రం అయిదు గంటలకు ఆదర్శనగర్‌లోని ఆంధ్ర కేసరి పార్కులో ‘అపూర్వార్థ చతుర విన్యాస ప్రౌఢోక్తి’, ‘వక్రోక్త్యుద్ఘాటనా చక్రవర్తి’ ‘విచిత్రార్థ ప్రవచన పంచానన’ ఇత్యాది బిరుదాంకితులైన జంధ్యాల శాస్ర్తీగారు ‘్భషలో తమాషాలు’ అనే అంశం గురించి ఉపన్యసించబోతున్నారని తెలిసి జనం తండోప తండాలుగా పార్కుకు చేరుకున్నారు.

07/28/2018 - 18:08

లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే ఫ్రాన్స్ దేశపు ప్రఖ్యాతి పొందిన సైకిల్ క్రీడాకారుడికి కేన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు అతడు బతికే అవకాశం నలభై శాతం మాత్రమే ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు, అతడు ఇక మీదట సైకిల్ తొక్కరాదని కూడా హెచ్చరించారు. అతనికి మిన్ను విరిగి మీద పడ్డట్లూ, తనకు మరణమే శరణ్యమన్నట్లూ అనిపించింది.

Pages