S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

06/03/2019 - 22:30

చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!
అన్నాడు ఆనాటి వేమన
చెత్తబుద్ధి లేని జనే్మ
జన్మ కాదురా!
అంటున్నారు నేటి జనం
చదువులు చట్టుబండలై
చనువులు నిండు కుండలై
లవ్వులు లవ్వులు అనుకొంటూ
పువ్వుల్లా నలిగిపోతున్నారు
పెళ్లినాటి ప్రమాణాలకు
నీళ్లొదిలి, అక్రమ సంబంధాల
కౌగిళ్లకు బందీలై
కనుమరుగవుతున్నారు
తల్లిదండ్రుల విడాకుల

06/03/2019 - 22:28

నాకు అప్పటివరకూ తెలీదు
సూర్యుడూ మాయవౌతాడని
ఆకాశాన్ని వెలిగించే వెనె్నల కూడా
మంచులా కరిగిపోతుందని
మనం శాశ్వతం అనుకున్నవన్నీ
ఎప్పుడోసారి అశాశ్వతవౌతాయని!

నాకు అప్పటివరకూ తెలీదు
సముద్రమూ చెమర్చుతుందని
ఆకులన్నిటినీ పరామర్శించే చిరుగాలి
మబ్బుల ముంగిట సోలిపోతుందని
మనల్ని ఓదార్చే చేతులు కూడా
ఎప్పుడోసారి ఓదార్పును కోరుకుంటాయని!

06/03/2019 - 22:02

విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. ప్రణాళిక ప్రకారం చదవడంతో పాటుగా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే ఆత్మవిశ్వాసంతో పరీక్షలను శాసించవచ్చు.

06/03/2019 - 22:00

అక్షరాలు రాని అర్భకుడును గూడ
నవ్యప్రక్రియకును నన్నయననె
తెలుగు కవిత ఎంత పలుచనైపోయెరా!
తిరునగరిది మాట తిరుగులేదు

ప్రతిభ ఉండవలయు పాండితివలయును
దండిగాను సృజన ఉండవలయు
అపుడు నవ్యసృష్టి అవనిలో నిలుచురా!
తిరునగరిది మాట తిరుగులేదు

06/01/2019 - 23:53

(గత సంచిక తరువాయి)
*

06/01/2019 - 23:28

భక్తజనుల కోర్కెలు తీర్చే పెద్దమ్మ పసిబాల చిన్నమ్మ ఆలయం అనంతపురం జిల్లా నల్లమాడ మండలంలోని వంకరకుంట గ్రామ పరిసరాల్లో వున్న తుమ్మలామల దుర్గం వద్ద వెలసింది. 4రోజుల పాటు భక్త జనసందోహం మధ్య పరుష నిర్వహిస్తారు.
పూర్వీకులు, చిన్నమ్మ వంశీకులు తెలిపిన ప్రకారం పసిబాల చిన్నమ్మ చరిత్ర..

06/01/2019 - 23:16

అప్పటికే సెల్‌ఫోన్ చాలాసేపట్నించి మోగుతోంది. ‘హలో..’ అంటూ శ్యామల ఓ క్షణం వాచ్‌కేసి చూసి ‘ఈ రోజు వీలు కాదురా.. వీలుంటే రేపు వస్తానేం..’ ఫోన్ పెట్టేసింది చిందరవందరగా ఉన్న ఇంటివైపు తేరిపార చూస్తూ. ఇల్లంతా సర్దుకోడానికి ఈ రోజంతా పట్టేలా ఉంది డ్యూటీ ఏం చేస్తాం ఇంక.

06/01/2019 - 23:13

ఒక ప్రవాహానికి కదులుతున్న ప్రతిబింబంలా నేను
తడి చూపుల్ని ఆరేసుకున్న చెట్టులా ఈ ఒడ్డున
ఏకాంతర అంతరంగ మధనంలో
విరిగిపడే ఒక నేను.

జీవన గమనానికి ఆంతరంగిక ఆలోచనకీ
ప్రవాహిని ఈ జీవనది
నీటిలా పారే మనసుకి
విశ్వాస బలంతో అంతఃకరణ శుద్ధితో
కర్మలు శుద్ధి గావించబడతాయి.

06/01/2019 - 22:57

బీజ గణితం ధర్మమా అని మనకి లభించిన సంఖ్యలలో మరొక జాతివి సంశ్లిష్ట సంఖ్యలు (complex numbers). ఇక్కడ నేను వాడిన మాట ‘సంశ్లిష్ట’ అని గమనించండి; ఇది క్లిష్ట కాదు, సంక్లిష్ట కాదు. ‘క్లిష్ట’ అంటే కష్టమైనది అని కానీ, గజిబిజిగా ఉన్నదని కానీ అర్థం. ‘సంశ్లిష్ట’ అన్న మాట complex కి సమానార్థకం ఎలా అయిందో సోదాహరణంగా చూపిస్తాను.

06/01/2019 - 22:49

అడవి బిడ్డల అద్భుత వర్ణచిత్రాలిప్పుడు ‘ఆన్‌లైన్’లో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. గిరిజన చిత్రకళకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. సంప్రదాయ సిద్ధంగా తమతమ పద్ధతుల్లో, వివిధ వస్తువులను, జంతువులను, పక్షులను, తీగెలను, చెట్లను చిత్రిస్తున్న యువ ఆదివాసీ (గిరిజన) చిత్రకారుల సృజన కొత్త అందాలతో కొలువుతీరింది.

Pages