S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

08/10/2019 - 20:03

(12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం)

08/10/2019 - 20:00

నేను పూర్వపు హైదరాబాద్‌లో ఉన్న హెడ్‌మాస్టర్లనూ చూశాను. ఈనాడు గ్రామాల్లో పనిచేస్తున్నటు వంటి హెడ్‌మాస్టర్లకు పనిచేసే అవకాశం దొరికింది. బహుశా ఈ నేలనే ఆ మనుషులకు ఈ అంకితభావ గుణాన్ని నేర్పుతుందేమో. నేను ఎనె్నన్నో స్కూళ్లను చూసే అవకాశం దొరికింది. ఒకవైపు పత్రికల్లో ప్రభుత్వ స్కూళ్లు పనికిరాని స్కూళ్లని అంటున్నా అవేమీ పట్టించుకోకుండా తమ విద్యుక్త ధర్మాన్ని చేసే హెడ్‌మాస్టర్లను కూడా చూశాను.

08/10/2019 - 19:51

నెలరాజులా వెలుగులు చిందుతూ
ముద్దబంతిలా మురిపా లొలకబోస్తూ
మదిలో నిత్యం పారే
వెలుగు ఉదయాల సెలయేరై
చూపు మాత్రంతోనే
ఎడారై ఎండిన ఎదలో సుధలూరించే
కష్టం ఇష్టమయ్యే
భావసారూప్యత కలిగి
ఎక్కువ తక్కువల భేదం తెలియక
నిన్నటి నైరాశ్యాల నింగిలో
రేపటి ఆశయై పొద్దుపొడుస్తూ
ఒంటరితనాల ఎదల్లో తోడుగా
నేనున్నానంటూ స్థైర్యాన్నిచ్చేదై

08/10/2019 - 18:59

విప్పేద్దాం
నిస్సిగ్గుగా
దేహాలన్నీ
బజార్లలో
సంచారం

ఎందుకురా
మనకి విలువల సంకెళ్లు
వలువలూడిన
మానవత్వం
కన్నా తప్పేం కాదు

పసికూన మొదలు
కాటికి కాళ్లు చాపిన
ముసలిదాకా
మొసళ్ల కాటుకి బలౌతుంటే
ఇంకెందుకీ దాపరికం

08/10/2019 - 18:56

భారతావని మొత్తం శ్రావణ పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తుంది. ఏడాదికి ఒకసారి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లో శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది. సాధారణంగా జంధ్యాన్ని (యజ్ఞోపవీతం) ధరించే వారందరూ ఈ రోజు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. దీనినే ‘ ఉపాకర్మ’ అని కూడా అంటారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యానే్న ‘యజ్ఞోపవీతం’ అని కూడా అంటారు.

08/10/2019 - 18:54

దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే- శ్రావణమాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత విశిష్టమైన రోజు. ఈ పండుగను హిందువులతో పాటు సిక్కులు, జైనులు జరుపుకుంటారు. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమిగా పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.

08/10/2019 - 17:34

చినుకులు
చినుకులు చినుకులు
గాలిలో
రెక్కలు విప్పిన
రంగుల
సీతాకోకచిలుకలు
చినుకులు
చినుకులు చినుకులు
పిల్లల
పెదవులపై
పురివిప్పిన నవ్వులు
చినుకులు
చినుకులు చినుకులు
చెట్టులు కూసెను
పక్షుల
కిలకిలరావాలు
చినుకులు
చినుకులు చినుకులు
గరికపై
విరబూసిన
తేమ తుషారాలు
చినుకులు

08/10/2019 - 17:31

మిత్రమా, కాలమా!
నీది నాది గర్భాలయ మైత్రి
నా జన్మ రహస్యానికి ఆజన్మ సాక్షివి నువ్వు
తొలి కణానికి తొలి క్షణానివి నువ్వు
నా తొలి అంగానికి తొలి చైతన్యానివి నువ్వు
నా తొలి అందానికి తొలి సంతకానివి నువ్వు
కాలమా, మిత్రమా!
నీది నాది భూవలయ మైత్రి
నా పుడమి తల్లి బంధానికి కొలమానానివి నువ్వు
నాలోని పంచభూతాల ఏకతా రాగానివి నువ్వు

08/10/2019 - 17:31

ఘాతుకాలు.. దౌర్జన్యాలు.. దోపిడీలు..
మానుషహీన దుశ్చర్యలు-
నరకులు నరకులు.. అసురులంతరించిపోయినా
ఉరికే నరకులు..
బరిసెలు.. వేటకొడవళ్లు.. కత్తులు.. కటారులు..
నాటుబాంబులతో మోటు దారుణ మారణాలు
లారీలతో గుద్దిస్తరు యాక్సిడెంటుగ రుద్దేస్తరు
పంచనామా జరిపిస్తరు-
వీరి వీరి దారులే వేరు.. పంతగిస్తే
నరకపురికి పంపకపోరు వీరు
పైసలతో కాని పనులుంటవా?

08/10/2019 - 17:22

జీవితంలో కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి.
అలాంటి పరిస్థితులని మనం ఊహించలేం.
మనం బాధలో వుంటాం. ఆ పరిస్థితిలో వున్నప్పుడు మరొకరి బాధని వినాల్సి వస్తుంది. మరొకరి బాధని పంచుకోవాల్సి వస్తుంది. ఇది ఎంతటి కష్టమైన పరిస్థితి.

Pages