S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాల భూమి
సింహపురిని పరిపాలించే విక్రమసేన మహారాజుకి ఒక వింత ఆలోచన మనసులో తట్టింది. తన రాజ్యంలో అత్యంత సోమరియైన వ్యక్తిని తెలుసుకొని అతనికి జీవితాంతం సరిపోయే కానుకలిచ్చి సత్కరించాలని అనుకొన్నాడు. అనుకొన్నదే తడవుగా మంత్రి సుబుద్ధిని పిలిచి మనసులో తనకు తట్టిన ఆలోచనను చెప్పాడు.
పూర్వం అమరేశ్వర పురంలో అమరనాథుడనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన తన ఆదాయంలో ఐదో వంతు దానధర్మాలకు వెచ్చించేవాడు. దానికై ప్రతిరోజూ ప్రాతఃకాలానే్న తన ఇంటి ముందుకు వచ్చిన వారికి తమ ఇలవేల్పైన ఈశ్వరుని చిత్రం ఉన్న గుర్తింపు పత్రం ఇచ్చేవాడు.
రామచంద్రయ్య ఒక రిటైర్డ్ టీచర్. అతని కూతురు జమున, అల్లుడు రాంబాబు, మనుమడు వంశీ పట్నంలో నివాసం ఉంటున్నారు. రాంబాబు ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్ హోదాలో పని చేస్తున్నాడు. జమున ఇంటిపట్టునే ఉంటుంది. వంశీ ఏడవ తరగతి చదువుతున్నాడు.
రత్నగిరి జమీందారు దగ్గర ఆదాయ వ్యయాలన్నీ చూడటానికి చలమయ్య అనే గణికుడు ఉండేవాడు. జమీందారుకి ఆయన నమ్మినబంటు.
చలమయ్యకి ఒక అలవాటు వుండేది. అదేమంటే తాంబూలం అతిగా తీసుకోవడం. అతని దగ్గర వెండితో చేసిన పాతకాలం అడపం పెట్టె ఒకటి వుండేది. అది అతనికి తాత నుంచి సంక్రమించింది. అందులో అతనికి కావలసిన తాంబూల దినుసులన్ని వుండేవి. దినంలో అనేకసార్లు తాంబూలం వేసుకోనిదే చలమయ్యకు బుర్ర పనిచేసేది కాదు.
తరగతి గది కిటికీ పక్కన కూర్చున్న పదేళ్ల చిన్నాకు ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాలు పక్షుల్లా కనిపించాయి.
బడి వదిలాక కూడా ఇంటికి వస్తుంటే పిల్లలంతా మిద్దెలపైనా వీధి చివరనున్న బయలు ప్రదేశంలో గాలిపటాలు ఎగురవేస్తూ కనిపించారు. ఇంటికి రాగానే తండ్రిని అడిగాడు గాలిపటం కొనివ్వమని. అసలే అప్పుల వాళ్లు అప్పుడే ఇంటికొచ్చి కోప్పడి వెళ్లారేమో రోజుకూలీ అయిన అతని తండ్రి డబ్బుల్లేవంటూ విసుక్కున్నాడు.
ఆకలితో ఇళ్ల చుట్టూ తిరుగుతున్న పిల్లికి తలుపు తెరచి ఉన్న ఇల్లొకటి కనపడింది.
‘అబ్బా...! తాగటానికి ఏదైనా దొరికితే బాగుండును’ అనుకుంటూ ఇంటిలోనికి తొంగి చూసింది పిల్లి. గుంజకి కట్టివేయబడ్డ కుక్క తప్ప ఇంట్లో ఎవ్వరూ కనపడలేదు దానికి. దాంతో ధైర్యంగా వంటింట్లో దూరి గినె్నలో ఉన్న పాలు తాగబోయింది.
వీధిలోనికి జనాలందరూ ఒక్కసారిగా కొవ్వొత్తులు పట్టుకుని గట్టిగా ‘్భరత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా వస్తున్నారు. అది గమనించిన భరత్ ‘ఏమైంది నాన్నా! అందరూ అలా నినాదాలు చేస్తున్నారు’ అని అడిగాడు.
కనకయ్య, కాంతయ్య ప్రాణమిత్రులు. తీరిక దొరికినప్పుడల్లా ఇరువురూ రావిచెట్టు కింద బండరాయి మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
ఎప్పటిలాగే ఓ రోజు రావిచెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఆ దారంట ఒక వృద్ధురాలు యాచించుకుంటూ వెళ్లడం గమనించిన కాంతయ్య ‘ఔనూ, మొన్న మొన్నది వరకు ఈమె కూరగాయలు అమ్మేది కదూ... ఇప్పుడేంటి ఇలా అడుక్కుంటోంది?’ అంటూ సందేహం వెలిబుచ్చాడు.
గంగయ్య, రంగమ్మ భార్యాభర్తలు. గంగయ్య కాయకష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. రంగమ్మ మాత్రం ఇంటి పనులు చేసేది. ఇతరుల ఇంటి విషయాలు తెలుసుకోవాలంటే ఆమెకు ఆసక్తి ఎక్కువ. ఇరుగు పొరుగున ఉన్న దంపతులు తగాదా పడినా, మాట్లాడుకుంటున్నా కిటికీ మాటున నక్కి వారి మాటలను రహస్యంగా వినేది. అలా వినే సమయంలో భర్తను కూడా పట్టించుకునేది కాదు.
పూర్వం భూమి అంతా రాజుల ఆధీనంలో ఉండేది. రాజుని ‘పృథ్వీపతి’ అనేవారు. భూమి మీద హక్కు అంతా రాజుదే. రాజు గ్రామాలలో వుండే పాలెగాండ్ల ద్వారా రైతులకు భూమి కౌలుకి ఇచ్చేవారు. పాలెగాండ్లు రైతుల దగ్గర శిస్తు వసూలు చేసి రాజు కోశాగారానికి ధనాన్ని పంపుతూ ఉండేవారు. రాజు ప్రజల ధన, మాన, ప్రాణాలకు భంగం కలుగకుండా రక్షణ కల్పిస్తూ పరిపాలన సాగించేవారు.