S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల భూమి

09/22/2018 - 19:26

ఒకప్పుడు రాజభోగాలు అనుభవించి అట్టహాసంగా బ్రతికిన రాజా రవివర్మ గారి కుటుంబం తరువాతి తరాల కాలంలో బాగా చితికిపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవసాగింది.

09/01/2018 - 18:58

దేవళ రాజ్యాన్ని శతనందనుడు అనే రాజు పరిపాలించేవాడు. ప్రదీపుడు అతని మంత్రి. ఎప్పటికప్పుడు ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ వారికి కావలసిన సదుపాయాలు సమకూర్చడానికై తన దగ్గర వున్న రాజోద్యోగులకు ఆదేశాలు జారీచేసేవాడు మహారాజు. ప్రజలకు కూడా రాజు అన్నా, మంత్రి అన్నా చాలా గౌరవం వుండేది. ప్రదీపుడు పెద్దవాడు కావడంతో మరొక యువకుడిని మంత్రి పదవికి ఎంపిక చేయాలని సంకల్పించారు.

08/25/2018 - 18:18

పరంధామయ్యకి కమల - విమల అని ఇద్దరు కూతుళ్లు. ఆయన పేరు మోసిన వైద్యుడు.
కమల నెమ్మదస్తురాలు, గుణవంతురాలు అని పేరు గడిస్తే, విమల అదృష్టవంతురాలనే పేరు గడించింది.
ఎందుకంటే విమల శకునం వచ్చిన రోజు పరంధామయ్యకు చక్కని ఆదాయం వచ్చి జేబులు నిండేవి. ఇల్లు లక్ష్మీదేవితో కళకళలాడేది. అదే కమల ఎదురువచ్చిన రోజు ఒక్క కేసూ వచ్చేది కాదు.

08/17/2018 - 20:31

గంపవరం రాజ్యాన్ని మోహిత్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. అయితే అతనికి లెక్కకు మించిన తిక్క ఉంది. ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినప్పటికీ తనకు తోచిన తిక్క పనులు చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు. ఆ రాజ్యానికి మంత్రి యశోపతి. రాజ్యపాలన సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ రాజ్యంలో దొంగల బెడద అధికమైంది. దొంగలు రాత్రిపూట ఇళ్లల్లో దూరి దోచుకుపోతున్నారు.

08/04/2018 - 20:24

పూర్వం ఉజ్జయినీ రాజ్యాన్ని ఉజ్వల వర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా ఏ కష్టమూ లేకుండా చూసేవాడు. రాజ్యంలో ఎక్కడా అక్రమాలూ, అన్యాయాలూ వంటివి లేక ప్రజలు సుఖజీవనం సాగించేవారు. ఉజ్వల వర్మ అంటే గిట్టని వారూ, ఆయన న్యాయపాలన వలన నష్టపోతున్న వారూ కొందరు రాజద్రోహులు కుట్రలు పన్నసాగారు.

07/28/2018 - 21:25

అడవి రాజు సింహానికి సహాయకునిగా చాలాకాలం నుండి ఒక నక్క ఉండేది. అయితే ఇటీవల నక్క మీద నమ్మకం పోయింది రాజుకి. దాంతో దానిని తొలగించి ఒక తోడేలుని తనకి సహాయకునిగా నియమించుకుంది.
ఒకరోజు సింహమూ, తోడేలూ రెండు కలిసి ఆహారం వెదకటానికై అడవిలో తిరగసాగాయి.
వీరిద్దరినీ చూసి జంతువులన్నీ దూరంగా పారిపోవటంతో ఎంత వెదికినా ఆహారం దొరకలేదు వాళ్లకు. అలా వెదుకుతూ వెదుకుతూ అడవి చివరి వరకూ వచ్చేశాయి.

07/21/2018 - 18:27

విజయుడు ఒక గురుకులంలో సమస్త విద్యలు, మంత్రతంత్ర విద్యలు కూడా పూర్తి చేసుకుని గురువుగారికి తగిన దక్షిణ సమర్పించి, ఆయన ఆశీర్వాదం తీసుకుని తన ఊరికి బయలుదేరాడు. అలా విజయుడు కొన్ని మైళ్లు నడిచిన తరువాత ఓ ఇంటి అరుగు మీద బడలిక తీర్చుకునేందుకు కూర్చున్నాడు.

07/07/2018 - 23:37

రామాపురంలో గోవిందయ్య అనే అతను బజారులో కిరాణా కొట్టు నడుపుతూ ఉండేవాడు. సామాన్లు అందివ్వడానికి ఎవరినో ఒకరిని పనికి పెట్టుకునేవాడు. కొంతకాలం అయ్యాక అతనికి జీతం ఇవ్వాల్సి వస్తుందని అతనిపై ఏదో ఒక నింద మోపి తరిమేసేవాడు. అలా అతని దగ్గర చాలామంది పనికి కుదిరి, ఆ తర్వాత దొంగని ముద్ర వేయించుకొని వెళ్లిపోయారు. ఆ వూళ్లో వాళ్లకి గోవిందయ్య సంగతి తెలియడంతో పనికి ఎవరూ రాలేదు.

07/01/2018 - 00:06

అడవికి రాజైన సింహం, పిల్ల జంతువులన్నింటికి విద్యాబుద్ధులు నేర్పించి ఆదర్శమైన అడవిగా తయారుచేయాలనుకుంది.
జంతువులన్నింటిని సమావేశ పరచింది. ‘చదువు తెలివిని పెంచుతుంది. మంచి నడతకు దారి చూపుతుంది. అందుకోసం మన పిల్లలకు తప్పనిసరిగా విద్యాబుద్ధులు నేర్పించాలి’ ఆదేశించింది సింహం.

06/23/2018 - 23:43

పు ష్పగిరి దేశపు రాజు మృగయా వినోదం కోసం అడవికి వెళ్లాడు. ఒక జింకను వేటాడుతూ అడవిలో దారితప్పిపోయాడు. ధనవర్మ అడవిలో తిరుగుతూ సరిహద్దు గ్రామం తాళ్లూరు చేరుకున్నాడు. ఊరి చివర ఇంట్లో వున్న కాంతమ్మ అతన్ని ఆదరించింది. రుచికరమైన భోజనం వడ్డించి ఆకలి తీర్చింది. ధనవర్మ ఎంతో సంతోషించాడు.

Pages